నల్లగొండ(నడిగూడెం): విద్యుత్ షాక్తో రైతు మృతి చెందిన ఘటన నల్లగొండ జిల్లా నడిగూడెం మండలంలో మంగళవారం చోటుచేసుకుది. వివరాలు... మండలంలోని కాగత రామచంద్రాపురం గ్రామానికి చెందిన సొమిరెడ్డి(60) పొలం పనుల నిమిత్తం సాగర్ ఎడమ కాల్వ గట్టుపై వెళుతుండగా తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ వైర్లు తగిలి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.