Sagar Left Canal
-
సాగర్ కాలువలో ఇద్దరు గల్లంతు
త్రిపురారం: ప్రమాదవశాత్తు సాగర్ ఎడమ కాలువలో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. ఈ సంఘటన నిడమనూరు మండలంలోని బొక్కమంతలపాడు గ్రామ పంచాయతీ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురారం మండల కేంద్రానికి చెందిన వేదవరపు సాయి (25) కుటుంబ సభ్యులతో కలిసి అడవిదేవులపల్లి రోడ్డులో గత 10 సంవత్సరాల నుంచి కూరగాయల షాపు నిర్వహిస్తున్నాడు. దుకాణంలో పని చేయడానికి మండల కేద్రంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన మేదరి శైలజ, అవిరెండ్ల రమాదేవి కూలి పనికి వెళ్లారు. కూరగాయలు తెచ్చే ట్రేలు కడగడంతో పాటు, బట్టలు ఉతకడానికి తన సొంత టాటా ఏస్ వాహనంలో మేదరి శైలజ, అవిరెండ్ల రమాదేవితోపాటు సాయి నిడమనూరు మండలంలోని బొక్కమంతలపాడులోని ఎడమ కాలువ వద్దకు వెళ్లారు. సాయి కాలువ కట్టపై ఉన్నాడు. శైలజ, రమాదేవి కాలువలో బట్టలు ఉతికి పైకి వస్తున్న క్రమంలో శైలజ కాలుజారి కాలువలో పడింది. శైలజను కాపాడే ప్రయత్నంలో రమాదేవి కూడా కాలువలో పడడంతో సాయి గమనించి అందులోకి దిగాడు. వెంటనే స్థానికులు వచ్చి చీరల సాయంతో అవిరెండ్ల రమాదేవిని కాపాడారు. శైలజ, సాయిని కాపాడే సమయంలో నీటి ఉధృతికి వారు లోపలికి కొట్టుకుపోయారు. సమాచారం తెలుసుకున్న నిడమనూరు ఎస్ఐ గోపాల్ రావు పోలీస్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నీటి ఉధృతి అధికంగా ఉండడంతో వారు పెద్దదేవులపల్లి రిజర్వాయర్‌కు కొట్టుకురావచ్చని పోలీసులు భావిస్తున్నారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఎడమ కాలువకు ఎన్ని తూట్లో..!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం మేడారం చెరువు వద్ద దాదాపు 100 మీటర్ల పొడవున నాగార్జునసాగర్ ఎడమ కాలువ దెబ్బతింది. అందులో సగం వరకు కట్ట కోతకు గురైంది. భారీగా ప్రవాహం వస్తే ఎప్పుడు కట్ట తెగిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలంలోని ముప్పారం 30/2వ కిలోమీటర్ వద్ద 50 మీటర్ల వరకు ఎడమ కాలువ లైనింగ్ పోయి ప్రమాదకరంగా మారింది. ఎప్పుడు తెగిపోతుందో తెలియదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగితారామచంద్రపురం వద్ద కుంగిపోయిన వెంపలబోడు తూము. అధిక ప్రవాహం వస్తే ఎప్పుడు తూము తెగిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. నాగార్జునసాగర్ ఎడమ కాలువ దుస్థితికి ఇవి కేవలం మూడు ఉదాహరణలు మాత్రమే. నల్లగొండ నుంచి సూర్యాపేట మీదుగా ఖమ్మం జిల్లా వరకు 172 కిలోమీటర్ల పొడవున అనేక చోట్ల ఇలాంటి ప్రమాదకర పరిస్థితులే నెలకొన్నాయి. ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని ఆందోళనకర పరిస్థితి నెలకొంది. 2022లో నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ముప్పారం వద్ద ఎడమ కాలువకు గండిపడటంతో వందల ఎకరాల్లో పంటలు పాడైపోయి రైతులు నష్టాలపాలయ్యారు. మరమ్మతులు పూర్తయ్యే వరకు 25 రోజులపాటు నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో పంటలకు నీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. నిర్లక్ష్యం కారణంగానే మళ్లీ గండ్లు ఎడమ కాలువకు నిడమనూరు వద్ద గండి పడినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కేవలం ఆ ప్రాంతంలో మాత్రమే గండిపూడ్చి వదిలేసింది. నీటిపారుదల శాఖ కాలువ పొడవునా లైనింగ్ దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మతులు చేయాలని రూ.44 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా పట్టించుకోలేదు. 2009లో ప్రపంచ బ్యాంకు ని«ధులు రూ.4,444 కోట్లతో ఎడమ, కుడి కాలువల ఆధునీకరణ (లైనింగ్, మరమ్మతులు) పనులు చేపట్టారు. అందులో ఎడమ కాలువ పనులను చేపట్టినా చాలావరకు పూర్తి చేయకుండా వదిలేశారు. దీంతో అవి మరింతగా దెబ్బతిన్నాయి.ఈనెల 1వ తేదీన నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం రంగులవంతెన వద్ద ఇటీవల కురిసిన భారీ వర్షాలు, పాలేరు వెనుక జలాల కారణంగా గండ్లు పడ్డాయి. రెండు చోట్ల 50 నుంచి 70 మీటర్ల పొడవునా కాలువ కట్ట కొట్టుకుపోయింది. పాలేరు వాగు నీటితోపాటు ఈ కాలువ నీరు కలిసి నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం, వల్లాపురం, అనంతగిరి మండలం చనుపల్లి, పాలారం, కిష్టాపురం, కొత్తగూడెం, గోండ్రియాల, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మందడి నర్సయ్యగూడెం, చీతిలితండా, రాజపేట, ఈశ్వరమాదారం గ్రామాలను నీరు ముంచెత్తింది. వందల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పొంచి ఉన్న ప్రమాదం ఎడమ కాలువ పొడవునా పలుచోట్ల లైనింగ్, కోతకు గురైన కాలువ కట్టలతో ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందో తెలియన ప్రజలు ఆందోళన చెందుతున్నారు. యాద్గార్పల్లి మేజర్ పరిధిలోని మిర్యాలగూడ మండలం ఐలాపురం, వేములపల్లి మండలంలోని అన్నపరెడ్డిగూడెం మధ్య దాదాపు 3.5 కిలోమీటర్ల పొడవునా లైనింగ్ దెబ్బతింది. నడిగూడెం మండలం రామాపురం, చాకిరాల, సిరిపురం, కాగితరామచంద్రాపురం గ్రామాల సమీపాన కాలువ కట్టలు దెబ్బతిన్నాయి.నిడమనూరు మండలంలోని 32/2 వద్ద కాల్వ కరకట్ట లైనింగ్ పూర్తిగా తొలగిపోయి మట్టి పూర్తిగా కాల్వలోకి జారి ప్రమాదకరంగా మారింది. ముప్పారం బ్రిడ్జి వెంట లైనింగ్ పూర్తిగా ధ్వంసమై కట్ట బలహీనంగా మారింది. 30/4 కిలో మీటర్ వద్ద కాల్వ లైనింగ్ పూర్తిగా ధ్వంసమైంది. 29/6 కిలోమీటర్ వద్ద గుంటికగూడెం మేజర్ కాల్వ తూముకు ఇరువైపులా కాల్వ కట్ట లైనింగ్ పాడైపోయింది. ముకుందాపురం–దుగ్గెపల్లి బ్రిడ్జి వెంట లైనింగ్ పూర్తిగా దెబ్బతింది. గరిడేపల్లి మండలం వెలిదండ సమీపంలో ఎడమ కాలువ కట్ట దెబ్బతిని ప్రమాదకరంగా మారింది. అత్యవసర పరిస్థితుల్లో కాలువ నీటిని వాగులు, చెరువుల్లోకి మళ్లించే ఎస్కేప్ కెనాల్స్ (నీటిని మళ్లించేవి)ను పట్టించుకోకపోవడం, పైగా వాటిని ఓపెన్ చేయరాకుండా వెల్డింగ్ చేసి పెట్టడంతో గండ్లు పడుతున్నాయి. -
సాగర్‌కు పోటెత్తిన కృష్ణమ్మ
సాక్షి, హైదరాబాద్/దోమలపెంట: నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు నాగార్జునసాగర్‌లోకి 2,18,622 క్యూసెక్కుల నీరు చేరుతుండటంతో నీటినిల్వ 526.8 అడుగుల వద్ద 161.97 టీఎంసీలకు చేరుకుంది. సాగర్ నిండాలంటే ఇంకా 151 టీఎంసీలు అవసరం. ఎగువ నుంచి భారీ వరద వస్తున్న నేపథ్యంలో మరో ఐదారు రోజుల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిండుతుందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,62,411 క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. ఎనిమిది గేట్లు పది అడుగుల మేర ఎత్తి.. కుడి, ఎడమగట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 2,83,360 క్యూసెక్కుల నీటి ని దిగువకు వదిలేస్తున్నారు.ఆ జలాలు నాగార్జునసాగర్ వైపు పరుగులు తీస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కృష్ణా ప్రధాన పాయతోపాటు మలప్రభ, ఘటప్రభలు వరదెత్తుతున్నాయి. దీంతో ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లలోకి వరద ఉధృతి పెరిగింది. ఆల్మట్టి డ్యామ్‌లోకి 3.42 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. 3.50 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్‌లోకి 3.35 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. 3.22 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.జూరాల ప్రాజెక్టులోకి 2.95 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. 2.81 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. తుంగ, భద్ర, ఉప నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటం.. భద్ర డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో గురువారం ఉదయం 9 గంటల నుంచి తుంగభద్రలో ప్రవాహం రెండు లక్షల క్యూసెక్కులకు చేరుతుందని డ్యామ్ అధికారులను సీడబ్ల్యూసీ(కేంద్ర జలసంఘం) అప్రమత్తం చేసింది. ఆ మేరకు దిగువకు వరదను విడుదల చేస్తామని తుంగభద్ర బోర్డు అధికారులు ఏపీ, తెలంగాణ అధికారులను అప్రమత్తం చేశారు. కృష్ణా, తుంగభద్రల్లో వరద పెరిగిన నేపథ్యంలో గురువారం నుంచి శ్రీశైలానికి చేరే వరద మరింత పెరగనుంది. మిడ్‌మానేరుకు జలకళ బోయినపల్లి(చొప్పదండి): నిన్నటిదాకా వెలవెలబోయిన మిడ్‌మానేరు ప్రాజెక్టుకు ప్రస్తుతం జలకళ సంతరించుకుంది. సీజన్ ప్రారంభమై రెండు నెలలైనా శించిన మేర వర్షాలు కురవకపోవడంతో మిడ్‌మానేరుకు పెద్దగా వరద చేరలేదు. దీంతో పంటల సాగుపై రైతులు ఆందోళన చెందారు. ఈక్రమంలో కడెం ప్రాజెక్టు నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరదనీరు భారీగా చేరడంతో జూలై 27న గాయత్రి పంప్‌హౌస్ నుంచి వరదకాల్వ ద్వారా మిడ్‌మానేరుకు నీటి విడుదల ప్రారంభించారు.మిడ్‌మానేరు ప్రాజెక్టులో ఐదు రోజుల క్రితం 5.90 టీఎంసీల నీటినిల్వ మాత్రమే ఉంది. రోజుకు15 వేల క్యూసెక్కుల చొప్పున ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటి విడుదల జరగడంతో బుధవారం సాయంత్రం ఆరు గంటల వరకు ప్రాజెక్టులో 10.55 టీఎంసీల మేర నీటినిల్వ ఉంది. ప్రాజెక్టులోకి నీరు చేరడంతో సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల పరిధిలోని గంగాధర, రామడుగు, బోయినపల్లి మండలాలకు చెందిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
కృష్ణమ్మకు జలకళ
సాక్షి, హైదరాబాద్: పరీవాహక ప్రాంతం(బేసిన్)లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణానది జలకళ సంతరించుకుంది. ప్రధాన పాయతోపాటు ఉప నదులు కూడా పరవళ్లు తొక్కుతున్నాయి. ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లు ఇప్పటికే నిండుకుండలా మారడంతో వచి్చన వరదను వచి్చనట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. ఆ వరద అంతా జూరాలకు వస్తుండగా.. 37 గేట్లు ఎత్తేసి నీటిని విడుదల చేస్తున్నారు. అలా కృష్ణమ్మ పరుగుపరుగున శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతోంది. మరోవైపు కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్రలో వరద ఉధృతి పెరిగింది. తుంగభద్ర డ్యామ్ నిండుకుండలా మారింది.ఎగువ నుంచి మరింత వరద వస్తుండటంతో.. సోమవారం సాయంత్రం 4.30 గంటలకు గేట్లు ఎత్తి నీటిని వదలడం ప్రారంభించారు. నీటి విడుదలను క్రమేణా పెంచుతామని, నదీ తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జల వనరుల శాఖ అధికారులకు తుంగభద్ర బోర్డు సమాచారం ఇచ్చింది. తుంగభద్ర డ్యామ్ నుంచి విడుదలవుతున్న నీళ్లు సుంకేశుల బరాజ్ మీదుగా శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతాయి. ఇటు జూరాల నుంచి, అటు సుంకేశుల నుంచి వచ్చే ప్రవాహాలతో.. శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద భారీగా పెరగనుంది. సాగర్ ఎడమ కాల్వ కట్టకు బుంగ నడిగూడెం: నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం సమీపాన సాగర్ ఎడమ కాల్వ కట్టకు ఆదివారం రాత్రి బుంగ పడింది. కట్టతోపాటు, కాల్వ లైనింగ్ కూడా కోతకు గురైంది. దీంతో అధికారులు కృష్ణానగర్, చాకిరాల వంతెనల వద్ద రాకపోకలను నిలిపివేస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. బుంగపడిన చోట కంచె ఏర్పాటు చేశారు. గతంలో ఏర్పడిన చిన్న బుంగ ప్రస్తుతం పెద్దగా మారి, కట్ట పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఏర్పడిందని రైతులు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి కాల్వ కట్టలకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. -
కొట్టుకుపోయిన సాగర్ ఎడమకాలువ ఎస్కేప్ షట్టర్
చిలుకూరు: సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం పోలేనిగూడెం పరిధిలో నాగార్జునసాగర్ ఎడమ కాలువకు ఏర్పాటు చేసిన ఎస్కేప్ షట్టర్ నీటి ప్రవాహానికి ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో కొట్టుకుపోయింది. దీంతో సుమారు 1,500 క్యూసెక్కుల వరద కాలువ నుంచి బయటికెళ్లి సమీప గ్రామాల పంటపొలాలను ముంచెత్తింది. నాగార్జున్ సాగర్ ప్రధాన కాలువ 113.14వ కిలోమీటర్ వద్ద కాలువకు అనుబంధంగా 18 ఏళ్ల క్రితం ఎస్కేప్‌ను నిర్మించి రెండు షట్టర్లు ఏర్పాటు చేశారు. ఇవి పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ షట్టర్లను తొలగించి, కొత్తగా ఎస్కేప్ ఏర్పాటు చేయా లని నిర్ణయించిన ఎన్ఎస్పీ అధికారులు రూ.62 లక్షల నిధులు కూడా మంజూరు చేశారు. ఈ పనులకు సంబంధించి టెండర్లు కూడా పూర్తి కాగా మరో వారం రోజుల్లో పనులు ప్రారంభించాల్సి ఉంది. అయితే, సాగర్ ఆయకట్టు పరిధి రెండో జోన్‌లోని పంటలను కాపాడటంలో భాగంగా అధికారులు పాలేరు రిజర్వాయర్‌ను నింపేందుకు ఈనెల 16న నాగార్జునసాగర్‌లో 6,200 క్యూ సెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ జలా లు నేరుగా పాలేరుకు వెళ్తున్నాయి. 19.5 అడుగుల ఎత్తు నుంచి నీటి ప్రవాహం ఉధృతంగా వెళ్తుండటంతో శిథిలావస్థకు చేరిన ఎస్కేప్ షట్టర్ కొట్టుకుపోయిందని రైతులు చెబుతున్నారు. దీనికితోడు షట్టర్‌కు బిగించిన బేరింగ్లను ఇటీవల దుండగులు ఎత్తుకుపోయారు. దీంతోపాటు చిలుకూరు మండలం బేతవోలు చెరువును నింపేందుకు రై తులు జేసీబీతో షట్టర్‌ను కొద్దిగా పైకి లేపిన ట్లు తెలిసింది. ఈక్రమంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గేటు తట్టుకోలేక కొట్టుకుపోయి ఉంటుందని భావిస్తున్నారు. కాలువ కింద, పక్కన ఏమైనా సంఘటన జరిగినప్పుడు నీళ్ల తాకిడిని తగ్గించి మళ్లించేందుకు వీలుగా ఏర్పాటుచేసిన దానిని ఎస్కేప్ షట్టర్‌ను అంటారు. ఆయకట్టు పరిధిలోని మునగాల, బరాఖత్‌గూడెం, ముకుందాపురం, చిలుకూరు మండలంలోని పోలేనిగూడెం, బేతవోలు తదితర గ్రామాల్లో సుమారు 600 ఎకరాల చేతికొచ్చిన వరి పంట నీట మునిగిందని రైతులు వాపోతున్నారు. విషయం తెలుసుకున్న ఎన్ఎస్పీ సీఈ రమేష్, ఈఈ సత్యనారాయ ణ, డీఈ రఘు తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో సాగర్, అడవిదేవులపల్లి రిజర్వాయర్ వద్ద నీటిని నిలిపివేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే షట్టర్ కొట్టుకుపోయి నష్టం వాటిల్లిందని రైతులు ఆరోపిస్తున్నారు. కాగా, కొట్టుకుపోయిన గేటు స్థానంలో సోమవారం రాత్రి కొత్త గేటును అమర్చినట్లు ఎన్ఎస్పీ అధికారులు చెప్పారు. -
సాగర్ కాల్వలో కొట్టుకుపోయిన కారు.. వీడిన మిస్టరీ
సాక్షి, మిర్యాలగూడ: నాగార్జున సాగర్ ఎడమకాల్వలోకి గుర్తు తెలియని వ్యక్తులు కారును తోసేసి పరారైన ఘటనలో.. మిస్టరీ దాదాపుగా వీడింది. కారును కాలువలోకి తోసేసింది అన్నాచెల్లెళ్లుగా గుర్తించారు పోలీసులు. కుటుంబ విభేధాలతో పాటు మతిస్థిమితం సరిగా లేనందునే వాళ్లు ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తిప్పర్తికి చెందిన రామాంజనేయులు రిటైర్డ్ హెచ్ఎమ్. ఆయనకు మల్లికార్జున్, విఘ్నేశ్వరీ ఇద్దరు పిల్లలు. ఇద్దరు కూడా దివ్యాంగులే. గత కొంతకాలంగా తండ్రితో వాళ్లకు విభేదాలు నడుస్తున్నాయి. తల్లిదండ్రులతో దూరంగా మిర్యాలగూడ సమీపంలోని అవంతిపురంలో ఉంటున్నారు ఆ అన్నాచెల్లెళ్లు. తమను పట్టించుకోవడం లేదంటూ కొంతకాలం క్రితం టూటౌన్ పోలీస్ స్టేషన్ లో తండ్రి రామాంజనేయులుపై ఫిర్యాదు కూడా చేసింది విఘ్నేశ్వరీ. ఈ క్రమంలో.. హైదరాబాద్ నాగోలులో ఓ కారును కొనుగోలు చేశారు ఆ అన్నాచెల్లెళ్లు. ఆపై ఆత్మహత్య చేసుకునేందుకే వాళ్లు సాగర్ ఎడమకాల్వలోకి కారును తోసేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణ నిమిత్తం మిర్యాలగూడ డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. అయితే మిర్యాలగూడ లో పార్కింగ్ చేసిన సమయంలో తమ కారు పోయిందని విఘ్నేశ్వరీ పొంతనలేని సమాధానాలు చెప్తోంది. దీంతో తల్లిదండ్రులతో మాట్లాడి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు పోలీసులు. వీడియో ద్వారా.. నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రం శివారులో హోలీ పండుగ సందర్భంగా.. కొందరు యువకులు కాల్వలో ఈత కొడుతున్నారు. ఆ సమయంలో గుర్తు తెలియని యువకుడితోపాటు, ఓ మహిళ కారులో వచ్చారు. సాగర్ ఎడమ కాల్వ కట్టపైన వారు కారు నిలిపారు. అనంతరం కారును కాల్వలోకి తోసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో సమీపంలో కాల్వలో ఈత కొడుతున్న యువకుడు సుధాకర్ అక్కడికి చేరుకుని నీటిలో కారు కొట్టుకుపోతుండగా తన సెల్ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కారు నీటిలో కొంతదూరం కొట్టుకుపోయి పూర్తిగా మునిగింది. అయితే అందులో ఎవరూ లేరని పోలీసులకు ఆ యువకుడు చెప్తున్నాడు. పోలీసులు కారు ఆచూకీ కోసం కాల్వ వెంట గాలింపు చర్యలు చేపట్టారు. కారు వెనుక డిక్కీలో ఏమైనా ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. -
సాగర్ ఎడమ కాల్వలో ఇద్దరు గల్లంతు
-
సాగర్ ఎడమ కాల్వలో ఇద్దరు గల్లంతు
నల్లగొండ: నాగార్జున సాగర్ ఎడమ కాల్వలో ఇద్దరు వ్యక్తులు గల్లంతైన సంఘటన మంగళవారం జరిగింది. జిల్లాలోని హాలియా వద్ద సాగర్ ఎడమ కాల్వలోకి మేహష్, దుర్గాప్రసాద్ అనే వ్యక్తులు స్నానానికి దిగారు. హఠాత్తుగా నీటి ఉధృతి పెరగడంతో ఇద్దరూ గల్లంతయ్యారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి ఆ ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మహేష్ గుంటూరు నివాసిగా, దుర్గాప్రసాద్ హాలియా వాసిగా గుర్తించారు. -
సాగర్ ఆయకట్టుకు నీరివ్వాలి: జూలకంటి
సాక్షి, హైదరాబాద్: సాగర్ ఎడమ కాలువ కింద సాగ వుతున్న పంటలకు వరుసగా రెండు వారాలపాటు నీరి వ్వాలని సీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఎడమ కాలువ కింద సాగవుతున్న పొలాలకు వారం విడిచి వారం నీటిని విడుదల చేస్తామని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. వారం రోజులే నీళ్లిస్తే పొలాలు దున్నుకోవడం, పంటలు సాగుచేయడం సాధ్యం కాదన్నారు. ఇప్పటికే మూడేళ్ల పాటు పంటలు పోరుు, తీవ్రంగా ఇబ్బందులుపడుతున్న రైతులను ఆదుకోవాలనే సోరుు రాష్ట్ర ప్రభుత్వానికి ఉండవద్దా అని ప్రశ్నించారు. రెండువారాల పాటు వరుసగా నీరిచ్చి, మధ్యలో వారం రోజులు ఆపినా రైతులకు కొంత ఉపయోగం ఉంటుందన్నారు. -
సాగర్ ఎడమ కాల్వలో యువకుడి గల్లంతు
దేవలపల్లి: నల్గొండ జిల్లా దేవలపల్లి మండల కేంద్రంలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వలో జమీల్(25) అనే యువకుడు గురువారం గల్లంతయ్యాడు. వివరాలు..నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన సుధాకర్, జమీల్‌లు లారీ డ్రైవర్, క్లీనర్లుగా పనిచేస్తున్నారు. ఇద్దరూ కలిసి నిజామాబాద్ నుంచి మిర్యాలగూడకు లారీలో ధాన్యం తీసుకువస్తున్నారు. మార్గమధ్యంలో స్నానం చేయడానికి సాగర్ ఎడమ కాల్వ వద్దకు చేరుకున్నారు. స్నానం చేస్తున్న సమయంలో కాలు జారడంతో కాల్వలో పడి గల్లంతయ్యాడు. జమీల్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సాగర్ ఎడమకాల్వలో పడి నలుగురు మృతి
-
ప్రత్యామ్నాయం
మిర్యాలగూడ : సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలోని ఎత్తిపోతల పథకాలతో పాటు సుమారు 3.90 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కాగా నీటిని విడుదల చేయకపోవడంతో ఎత్తిపోతల పథకాల కింది ఆయకట్టుతో పాటు ఎడమ కాలువ పరిధిలోని భూములన్నీ బీడుగా మారే పరిస్థితి వచ్చింది. రైతులు ప్రత్యామ్నాయ సాగుపై దృష్టి సారించడం వల్ల కనీసం 30 శాతం వరకు వరి పంటలు సాగు చేసే పరిస్థితి ఉంది. సాగర్ నీటి కోసం మెట్ట నార్లు పోసుకున్న రైతులు ఖరీఫ్‌లో ప్రత్యామ్నాయం ద్వారా నాట్లు వేయాలనే ఏర్పాట్లలో ఉన్నారు. పాలేరు, మూసీ, కృష్ణా నదులతో పాటు హాలియా వాగు, తుంగపాడు బంధం సమీపంలో విద్యుత్ మోటార్లను ఏర్పాటు చేసుకుని సాగు నీటిని వినియోగించుకుంటున్నారు. పూడికలు తీయిస్తున్న అన్నదాతలు సమీపంలోని వాగులతో పాటు రైతులు బోర్లు, బావులపై దృష్టి సారించారు. గతంలో నాలుగేళ్లపాటు వరుస కరువుతో ఉన్న సమయంలో బావులు తవ్విన రైతులు ప్రస్తుత అవసరాల మేరకు పూడికలు తీయిస్తున్నారు. దాంతో పాటు ఆయకట్టేతర ప్రాంతాలను మరిపించే విధంగా బోర్లు వేయిస్తున్నారు. ఒక్కొక్క బోరుకు రూ. 20వేల నుంచి 30 వేల వరకు ఖర్చు చేయడంతో పాటు మరో రూ. 20 వేలు వెచ్చించి మోటార్లు బిగిస్తున్నారు. విద్యుత్‌పై ఆశలు తెలంగాణ ప్రభుత్వం రైతులకు సరిపడా విద్యుత్ అందజేస్తామని చెప్పడంతో రైతులు కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఏడు గంటల పాటు విద్యుత్ అందిస్తున్న అధికారులు ఖరీఫ్ సీజన్లో 9 గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్ అందిస్తామని చెబుతుండటంతో రైతుల్లో మరింత ఆశలు పెరిగాయి. తొమ్మిది గంటల పాటు విద్యుత్ అందిస్తే ఖరీఫ్‌లో పుష్కలంగా పంట పండే అవకాశం ఉన్నందున రైతులు ప్రయత్నాలు చేస్తున్నారు. రూ. 50 వేలు ఖర్చు పెట్టా సుమారు 50 వేల రూ పాయలు ఖర్చు పెట్టి బోరు వేశాను. విద్యుత్ సరపడా రావడంతో నాలుగు ఎకరాల పొలం నాటు వేశాను. దుక్కి దున్నడం నుంచి ఇప్పటి వరకు ఎకరానికి 20 వేల రూపాయలు ఖర్చు పెట్టా. పంట ఏపుగా ఉంది. కరెంటు కూడా సరిపడా వస్తుంది. కరెంటు సరిపడా వస్తేనే పంటలు చేతికి వస్తాయి. - దుగ్గె బుచ్చయ్య, దామరచర్ల -
విద్యుత్ షాక్‌తో రైతు మృతి
నల్లగొండ(నడిగూడెం): విద్యుత్ షాక్‌తో రైతు మృతి చెందిన ఘటన నల్లగొండ జిల్లా నడిగూడెం మండలంలో మంగళవారం చోటుచేసుకుది. వివరాలు... మండలంలోని కాగత రామచంద్రాపురం గ్రామానికి చెందిన సొమిరెడ్డి(60) పొలం పనుల నిమిత్తం సాగర్ ఎడమ కాల్వ గట్టుపై వెళుతుండగా తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ వైర్లు తగిలి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. -
కృష్ణా డెల్టాకు మరో 4 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా డెల్టా అవసరాల కోసం నాలుగు టీఎంసీల నీటి విడుదలకు ఇరు రాష్ట్రాలు అంగీకారానికి వచ్చాయి. జలసౌధలో మంగళవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావుల మధ్య అంగీకారం కుదిరింది. సాగర్ ఎడమ కాలువ కింద కృష్ణా డెల్టా ఆయకట్టు ఉన్న విషయం విదితమే. ఈఎన్సీల భేటీలో నీటి విడుదలపై నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బుధవారం నుంచి ఎడమ కాలువకి ఏడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో నీటి మట్టాలపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. -
సాగర్ లో జారిపడి గృహిణి మృతి
నల్లగొండ: సాగర్ ఎడమ కాలువలో జారిపడి భార్య మృతి చెందగా, భర్త గల్లంతయ్యాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా వేములపల్లిలో సోమవారం మధ్యాహ్నం 12గంటలకు జరిగింది. వివరాలు.. వేములపల్లికి చెందిన గంజి సత్యం అంత్యక్రియలకు ఆయన కూమార్తె పద్మ(33), అల్లుడు నరేందర్(38)లు సోమవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం స్నానం చేసేందుకు సాగర్ ఎడమ కాలువలోకి దిగారు. ఆ ప్రాంతంలో నీటి ఉధృతి వేగంగా ఉండటంతో వారు గల్లంతైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారికి ఈత రాకపోవడంతో నీటిలో కొట్టుకుపోయినట్లు వారు చెప్పారు. ఈ ప్రమాదంలో నరేందర్ గల్లంతు కాగా, పద్మ మృతదేహాన్ని కుటుంబసభ్యులు గుర్తించారు. దీంతో ఆ గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (వేములపల్లి) -
సాగర్ ఆయకట్టులో.. వారబందీ
మిర్యాలగూడ : సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలో వారబందీకి అధికారులు ఉపక్రమించారు. ఈ మేరకు ఎన్ఎస్పీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సాగర్ జలాశయం లో పుష్కలంగా నీరున్నప్పటికీ వారబందీ విధించడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులో నీటి మట్టం తక్కువగా ఉన్న సమయంలో ఎడమ కాల్వకు ఆన్ అండ్ ఆఫ్ విధానంలో 10 రోజుల పాటు నీటిని విడుదల చేసి ఐదు రోజుల పాటు కాలువ నీటిని నిలిపివేయాలని గతంలో నిర్ణయించారు. కానీ అనుకోకుండా కృష్ణా ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో జలాశయం నిండింది. దీంతో రైతులు సంతోషంగా వరి నాట్లు వేసుకున్నారు. ఇప్పటికే కాలువ చివరి భూములకు నీరందడం లేదని రైతులు ఆందోళన చెందుతుండగా వారబందీని అమలు చేయాలని నిర్ణయించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా పాలేరు రిజర్వాయర్‌ను పూర్తిస్థాయిలో నింపడం కోసమే వారబందీ అని ఎన్ఎస్పీ అధికారులు పేర్కొంటున్నారు. పంటలకు కష్టమే.. ప్రస్తుతం ఎడమ కాల్వ పరిధిలో వారబందీ విధానాన్ని అమలు చేస్తే పొట్టదశలో ఉన్న వరి పొలాలకు ప్రమాదం పొంచి ఉంది. ఎడమ కాల్వ పరిధిలోని ఆయకట్టుకు నీటిని ఆలస్యంగా విడుదల చేయడంతో వరి నాట్లు కూడా ఆలస్యమయ్యాయి. ఈ మేరకు నవంబర్ 15వ తేదీ వరకు పుష్కలంగా నీరు పారాల్సి ఉంది. కానీ వారబందీ విధానం వల్ల మేజర్ కాల్వల చివరి భూములకు ఇక నీరందడం కష్టంగా మారనుంది. ఇప్పటికే కాల్వ చివరి భూములకు నీరందక రైతులు నానా ఇబ్బందులు పడుతుండగా వారంబందీని అమలు చేస్తే ఇక పంట పొలాలు వదులుకోవాల్సిందేనని రైతులు పేర్కొంటున్నారు. అధికారిక లెక్కల ప్రకారం.. సాగర్ కుడి, ఎడమ కాల్వకు చెరో 50 టీఎంసీల నీటిని విడుదల చేయాలని నిర్ణయించగా ఇప్పటి వరకు ఎడమ కాల్వకు 58.34 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు ఎన్ఎస్పీ అధికారులు లెక్కలు చూపుతున్నారు. మొదటి జోన్ పరిధిలో 33 టీఎంసీలు, రెండవ జోన్ పరిధిలో 25.34 టీఎంసీల నీటిని వాడుకున్నట్లు పేర్కొంటున్నారు. కాగా ఖరీఫ్ సీజన్లో పంటలు చేతికి రావడానికి ఇంకా 17 టీఎంసీల నీరు అవసరం ఉందని అధికారులే చెప్పడం గమనార్హం. రెండు మూడు రోజుల్లో అమలు.. వారబందీ మరో రెండు రోజుల్లో అమలు చేయనున్నారు. అందులో భాగంగా నాగార్జున సాగర్ ఎడమ కాల్వ పరిధిలోని మక్త్యాల బ్రాంచి కెనాల్ వరకు(115 కిలో మీటర్లు) మూడు జోన్లుగా విభజించి ఒక్కొక్క జోన్ పరిధిలో వారంలో ఒక రోజు చొప్పున మేజర్ కాల్వలకు ఖరీఫ్ పూర్తయ్యే వరకు నీటిని నిలిపి వేయనున్నారు. కాగా ప్రధాన కాల్వకు నీటి విడుదల యథావిధిగా కొనసాగనుంది. రైతులు సహకరించాలి మిర్యాలగూడ : నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పరిధిలోని ముక్తాల బ్రాంచి కెనాల్ వరకు వారబందీ విధానాన్ని అమలు చేయనున్నామని, అందుకు రైతులు సహకరించాలని ఎన్ఎస్పీ సీఈ పురుషోత్తంరాజు కోరారు. శనివారం స్థానిక ఎన్ఎస్పీ క్యాంపులోని రైతు శిక్షణ కేంద్రంలో ఎన్ఎస్పీ, రెవెన్యూ అధికారులు, రైతులు, నీటి సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎడమ కాల్వకు ఆన్ అండ్ ఆఫ్ విధానంతో ఒప్పందం ప్రకారం ఖరీఫ్ పంటలకు నీటిని విడుదల చేస్తామని చెప్పారు. ఖమ్మం జిల్లా పాలేరు రిజ ర్వాయర్‌లో పూర్తి స్థాయి నీటిమట్టం 2.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.9 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అందువల్ల వారంలో ఒక రోజు మేజర్ కాల్వలకు నీటిని బంద్ చేస్తామని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను నీటి సంఘాల ప్రతిని ధులు అంగీకరించారు. వారబందీకి రైతులందరూ సహకరించాలని కోరారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు మాట్లాడుతూ నియోజకవర్గంలోని వజీరాబాద్ మేజర్‌కు డిజైన్ ప్రకారం నీటిని విడుదల చేయడం లేదని, దాంతో కాల్వ చివరి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దామరచర్ల మండలంలో 40 శాతం పంట పొలాలు ప్రస్తుతం బీడుగా ఉన్నాయని, ఎన్ఎస్పీ అధికారులు క్షేత్ర స్థాయి వెళ్లి పరిస్థితిని సమీక్షించాలన్నారు. అలాగే 19, 20 ఎత్తిపోతల పథకాలకు కూడా టెండర్లు నిర్వహించి ఆధునికీకరణ పనులు చేపట్టాలని కోరారు. సమావేశంలో ఎన్ఎస్పీ ఎస్ సుధాకర్, ఈఈ అంజయ్య, దామరచర్ల జెడ్పీటీసీ సభ్యుడు శంకర్‌నాయక్, నీటి సంఘాల చైర్మన్లు, రైతు ప్రతినిధులు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, వీరకోటిరెడ్డి, శ్రీనివాస్, స్వామి పాల్గొన్నారు. -
రూ కోటి నేలపాలు
నడిగూడెం, న్యూస్‌లైన్: నడిగూడెం మండలం రామాపురం రెవెన్యూ గ్రామంలోని 190 సర్వేనంబర్ పరిధిలో దాదాపు 2900 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిలో 2200 ఎకరాల్లో కొంతమేర భూమి ఉండగా, 700 ఎకరాల్లో గుట్టలున్నాయి. రామాపురం, ఎక్లాస్‌ఖాన్‌పేట, ఎక్లాస్‌ఖాన్‌పేట తండా, తెల్ల బెల్లి, మునగాల మండలం బరాఖత్‌గూడెం, ముకుందాపురం, ఆకుపాములు, కోదండరా మాపురం గ్రామాల పరిధిలో ఈ భూములు విస్తరించి ఉన్నాయి. ఆయా గ్రామాలకు చెందిన పలువురు రైతులు ఏక్‌సాల్ పట్టాలు పొందుతూ మెట్ట పంటలను సాగు చేసుకుంటున్నారు. మరికొన్ని భూములు బీళ్లుగా ఉన్నాయి. నిధులు ఖర్చుచేసినా.. దశాబ్దాల క్రితం ఈ భూముల అభివృద్ధికి వివిధ పథకాల ద్వారా అప్పటి ప్రభుత్వం దాదాపు కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసింది. భూములను అభివృద్ధి పర్చడం కోసం ఎస్సీ కార్పొరేషన్ నుంచి రూ 10 లక్షలు, బీసీ కార్పొరేషన్ నుంచి రూ 10 లక్షలు, మాడా నుంచి రూ 5 లక్షలు, ఫలసాగర్ పథకం కింద రూ 10 లక్షలు, వర్షాధారంగా పండ్ల తోటల సాగు పథకం కింద రూ 5 లక్షలు, పనికి ఆహార పధకం కింద రూ 10 లక్షలు, ఇందిర జలప్రభ మొదటి దఫా కింద రూ 25 లక్షలు, రెండో దఫా కింద రూ 10 లక్షలు, జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ 10 లక్షలు, మరో రెండు పథకాల ద్వారా రూ 20 లక్షలు ఖర్చు చేశారు. బావులు తీయించడం, బోర్లు, చేతి పంపులు వేయించడం తదితర పనుల ద్వారా కోటి రూపాయలకుపైగా ఖర్చు చేశారు. అయినా అధికారుల పర్యవేక్షణలేకపోవడంతో ఈ భూములు అభివృద్ధికి నోచుకోలేదు. బావులు అడుగంటాయి. చేతి పంపులు నిరుపయోగంగా మారాయి. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. చెంతనే సాగర్ కాల్వ ఉన్నా.. 190 సర్వేనంబర్‌లో గల భూములకు రెండు కిలోమీటర్ల దూరంలో సాగర్ ఎడమ కాల్వ ఉంది. అయినా ఈ భూములకు చుక్క నీరు అందే పరిస్థితి లేదు. 20 ఏళ్ల కిందట ఈ భూముల మీదుగా ఆర్-9 ఎత్తిపోతల పథ కాన్ని నిర్మించారు. క్రిష్ణానగర్ మీదుగా రామాపురం, ఎక్లాస్‌ఖాన్‌పేట తండా, ఆకుపా ముల, ముకుందాపురం గ్రామాలకు సాగు నీరందించేందుకు ఈ ఎత్తిపోతల పథకాన్ని డిజైన్ చేశారు. కానీ ఈ డిజైన్ ప్రకారం నీరందకపోవడంతో వందల ఎకరాల భూము లు బీళ్లుగానే ఉంటున్నాయి. హామీ ఏమైంది? నడిగూడెం మండలం నిమ్మసాగుకు ప్రసిద్ధి. దాదాపు 2500 ఎకరాలకు పైగానే ఈ పంట సాగులో ఉంది. నిమ్మ ఆధారిత పరిశ్రమను పెట్టాలని ఎప్పటి నుంచో ఈ మండల రైతులు కోరుతున్నారు. గతంలో పనిచేసిన ఓ కలెక్టర్ కూడా ఈ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ఈ హామీ నేటికీ నెరవేరలేదు. ఈ 190 సర్వేనంబర్ పరిధిలోని భూముల్లో నిమ్మ ఆధారిత పరిశ్రమను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే నడిగూడెం, మునగాల, కోదాడ మండలాలకు చెందిన ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రజలు చెబుతున్నారు. పాసుపుస్తకాల పంపిణీలో అవకతవకలు ఈ సర్వేనంబర్ భూముల్లోని రైతులకు ఏక్‌సాల్ పట్టాలనిస్తున్నారు. అంటే ఒక ఏడాది మాత్రమే పట్టాదారు పాస్‌పుస్తకాలను ఇస్తుంటారు. వీటిని ప్రతి ఏడాది రెన్యువల్ చేసుకోవాలి. ఈ పాస్‌పుస్తకాల పంపిణీలో సంబంధిత వీఆర్ఓలు ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. మామూళ్ల మత్తులో వారు భూములు లేనివారికి పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారని పలువురు రైతులంటున్నారు. ఎక్కువ భూములున్నవారికి తక్కువ ఉన్నట్టు, తక్కువ భూములున్న వారికి ఎక్కువున్నట్టు రికార్డుల్లో చేర్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. అనేక మంది రామాపురం, ఎక్లాస్కాన్పేట, తెల్లబెల్లి గ్రామాలకు చెందిన బడా రైతులు ఈ సర్వేనంబరు భూములను ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. పలువురు రైతులు పాస్‌పుస్తకాలు లేకున్నా వారి పరిధి లోని భూములను అక్రమంగా విక్రయి స్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పం దించి ఈ భూములను అభివృద్ధ్ది చేయాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు.