సాగర్ ఎడమ కాల్వలో యువకుడి గల్లంతు
Published Thu, Nov 17 2016 1:02 PM | Last Updated on Wed, Aug 29 2018 8:36 PM
దేవలపల్లి: నల్గొండ జిల్లా దేవలపల్లి మండల కేంద్రంలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వలో జమీల్(25) అనే యువకుడు గురువారం గల్లంతయ్యాడు. వివరాలు..నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన సుధాకర్, జమీల్‌లు లారీ డ్రైవర్, క్లీనర్‌లుగా పనిచేస్తున్నారు. ఇద్దరూ కలిసి నిజామాబాద్ నుంచి మిర్యాలగూడకు లారీలో ధాన్యం తీసుకువస్తున్నారు. మార్గమధ్యంలో స్నానం చేయడానికి సాగర్ ఎడమ కాల్వ వద్దకు చేరుకున్నారు. స్నానం చేస్తున్న సమయంలో కాలు జారడంతో కాల్వలో పడి గల్లంతయ్యాడు. జమీల్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement