Jameel
-
వివాదంలో హన్సిక మూవీ: కోర్టుకెక్కిన డైరెక్టర్
హీరోయిన్ హన్సిక నటించిన తాజా చిత్రం ‘మహా’ పై వివాదం నెలకొంది. యు.ఆర్. జమీల్ దర్శకత్వం వహించారు. కాగా ‘‘నేను దర్శకత్వం వహించిన ‘మహా’ని నాకు చెప్పుకుండానే ఓటీటీలో విడుదలకు సిద్ధం చేస్తున్నారు.. దీనిపై నిషేధం విధించాలి’’ అని జమీల్ డిమాండ్ చేస్తున్నారు. అసలు విషయంలోకి వస్తే.. హన్సిక టైటిల్ రోల్ చేసిన ‘మహా’ దాదాపు రెండేళ్ల క్రితమే ప్రారంభమైంది. ‘‘ఈ చిత్రం పెండింగ్ పనులు నాకు తెలియకుండానే పూర్తి చేశారు.. నిర్మాత (మదియళగన్) నాకు 24 లక్షలు పారితోషికం చెల్లించాల్సి ఉండగా కేవలం 8.15 లక్షలు మాత్రమే చెల్లించారు. నాకు తెలియకుండానే పెండింగ్ చిత్రీకరణ పూర్తి చేసినందున, నా కథ మార్చినందున రూ.10 లక్షల పరిహారంతో పాటు, నాకు రావాల్సిన రెమ్యూనరేషన్ బకాయి చెల్లించాలి’’ అని కేసు పెట్టారు జమీల్. అంతేకాదు.. సినిమా రిలీజ్ కానివ్వకుండా నిర్మాణ సంస్థపై నిషేధాన్ని విధించాలని కూడా కోర్టులో పిటిషన్ వేశారు. ‘జమీల్ పిటిషన్‌పై మే 19లోగా స్పందించాలి’ అంటూ సదరు కోర్డు నిర్మాతను ఆదేశించింది. కాగా ఒక పైలెట్‌తో ప్రేమలో పడే పైలెట్ అటెండెంట్ (హన్సిక) కథ ఇది. ఈ జంటకు పుట్టిన కుమార్తె మరణం వెనక దుర్మార్గుల్ని హీరో ఎలా పట్టుకుని అంతం చేశాడు? అనేది ‘మహా’ చిత్రకథ. ఇందులో శింబు అతిథి పాత్రలో కనిపిస్తారు. చదవండి: రెమ్యునరేషన్ పెంచిన తమన్.. ఒక్కో మూవీకి ఎంతంటే.. -
ఉమాశంకర్‌గణేష్‌కు సోదరులు పూరీ స్వాగతం
మాకవరపాలెం (నర్సీపట్నం) :ఎమ్మెల్యేగా గెలుపొంది నియోజకవర్గానికి వస్తున్న ఉమాశంకర్‌గణేష్‌కు తన సోదరులు పూరీ జగన్నాథ్, సాయిరాంశంకర్‌లు కూడా స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. వీరు శుక్రవారం మండలంలోని వెంకన్నపాలెం చేరుకుని గణేష్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు కార్యకర్తలు, అభిమానులతో కాసేపు ముచ్చటించారు. వీరితో కరచాలనం చేయడంతో పాటు సెల్ఫీలు తీసుకునేందుకు జనం ఎగబడ్డారు. పూరీ, జమీలు భేటీ నాతవరం: ప్రజలు రాజన్న రాజ్యం కోసమే సార్వత్రిక ఎన్నికల్లో నర్సీపట్నం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకి ఉహించని విధంగా భారీ మెజార్టీ ఇచ్చారని సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు అంకంరెడ్డి జమీలు అన్నారు.వీరు శుక్రవారం నర్సీపట్నం ఎమ్మెల్యే విజేత పెట్ల ఉమా శంకర్‌గణేష్ నివాసంలో కలిశారు. -
సాగర్ ఎడమ కాల్వలో యువకుడి గల్లంతు
దేవలపల్లి: నల్గొండ జిల్లా దేవలపల్లి మండల కేంద్రంలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వలో జమీల్(25) అనే యువకుడు గురువారం గల్లంతయ్యాడు. వివరాలు..నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన సుధాకర్, జమీల్‌లు లారీ డ్రైవర్, క్లీనర్లుగా పనిచేస్తున్నారు. ఇద్దరూ కలిసి నిజామాబాద్ నుంచి మిర్యాలగూడకు లారీలో ధాన్యం తీసుకువస్తున్నారు. మార్గమధ్యంలో స్నానం చేయడానికి సాగర్ ఎడమ కాల్వ వద్దకు చేరుకున్నారు. స్నానం చేస్తున్న సమయంలో కాలు జారడంతో కాల్వలో పడి గల్లంతయ్యాడు. జమీల్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బీఫ్ తిన్నందుకే..
హైదరాబాద్: గత డిసెంబర్ నెలలో ఉస్మానియాలో నిర్వహించిన బీఫ్ ఫెస్టివల్ పాల్లొన్న విద్యార్ధికి ఇంగ్లీష్ అండ్ ఫారీన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ(ఈఎఫ్ఎల్ యూ) షాక్ ఇచ్చింది. జాలీస్ కొడూరు అనే విద్యార్థి యూనివర్సిటీలో అరబిక్ లాంగ్వేజ్ లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్(ఎమ్ఏ) పూర్తి చేశారు. యూనివర్సిటీలోనే పీహెచ్ డీ ప్రవేశ పరీక్ష కోసం ధరఖాస్తు చేసుకుని హాల్ టికెట్ కోసం వెళ్లగా తనపై గత డిసెంబర్ లో పోలీసు నమోదయిందని ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి అర్హత లేదని చెప్పడంతో కంగుతిన్నాడు. గత ఏడాది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన బీఫ్ ఫెస్టివల్ లో పాల్లొన్న వారిలో 25 మంది ఈఎఫ్ఎల్ యూ విద్యార్థులు కూడా ఉన్నారు. విద్యార్థుల బీఫ్ ఫెస్టివల్ లో పాల్గొనకూడదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, కొంతమంది విద్యార్థుల ఆదేశాలను పాటించకుండా ఫెస్టివల్ పాల్గొన్నట్లు ఈ సందర్భంగా యూనివర్సిటీ తెలిపింది. విశ్వవిద్యాలయ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ ఆర్డినెన్స్ పాస్ చేసిందని ఈఎఫ్ఎల్ యూ ప్రొఫెసర్ ప్రకాష్ కోనా తెలిపారు. జలీస్ కు మాత్రమే కాకుండా శారీరక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న మరో విద్యార్ధికి, ఫేస్ బుక్ లో యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ పై అభ్యంతరకరమైన పోస్టు చేసిన విద్యార్థికి కూడా యూనివర్సిటీ హాల్ టికెట్లను జారీ చేయలేదు. తన మీద కేసు నమోదయి ఇప్పటికి ఆరునెలలు కావొస్తోందనీ.. తాను హాల్ టికెట్ తీసుకోవడానికి వెళ్లే వరకు యూనివర్సిటీ ఈ విషయం చెప్పలేదని జమీల్ వాపోయాడు. పోలీసు కేసు ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు చూపలేదని తెలిపారు.