ఉమాశంకర్‌గణేష్‌కు సోదరులు పూరీ స్వాగతం | Puri jagannath Welcomes His Brother Uma Shankar Ganesh | Sakshi
Sakshi News home page

ఉమాశంకర్‌కు సోదరుల అభినందనలు

Published Sat, May 25 2019 11:59 AM | Last Updated on Sat, May 25 2019 12:22 PM

Puri jagannath Welcomes His Brother Uma Shankar Ganesh - Sakshi

గణేష్‌తో మాట్లాడుతూ వస్తున్న పూరీ జగన్నాథ్‌

మాకవరపాలెం (నర్సీపట్నం) :ఎమ్మెల్యేగా గెలుపొంది నియోజకవర్గానికి వస్తున్న ఉమాశంకర్‌గణేష్‌కు తన సోదరులు పూరీ జగన్నాథ్, సాయిరాంశంకర్‌లు కూడా స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. వీరు శుక్రవారం మండలంలోని వెంకన్నపాలెం చేరుకుని గణేష్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు కార్యకర్తలు, అభిమానులతో కాసేపు ముచ్చటించారు. వీరితో కరచాలనం చేయడంతో పాటు సెల్ఫీలు తీసుకునేందుకు జనం ఎగబడ్డారు.

పూరీ, జమీలు భేటీ
నాతవరం:  ప్రజలు రాజన్న రాజ్యం కోసమే సార్వత్రిక ఎన్నికల్లో నర్సీపట్నం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీకి ఉహించని విధంగా భారీ మెజార్టీ ఇచ్చారని సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు అంకంరెడ్డి జమీలు అన్నారు.వీరు శుక్రవారం నర్సీపట్నం ఎమ్మెల్యే విజేత పెట్ల ఉమా శంకర్‌గణేష్‌ నివాసంలో కలిశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement