హైదరాబాద్: గత డిసెంబర్ నెలలో ఉస్మానియాలో నిర్వహించిన బీఫ్ ఫెస్టివల్ పాల్లొన్న విద్యార్ధికి ఇంగ్లీష్ అండ్ ఫారీన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ(ఈఎఫ్ఎల్ యూ) షాక్ ఇచ్చింది. జాలీస్ కొడూరు అనే విద్యార్థి యూనివర్సిటీలో అరబిక్ లాంగ్వేజ్ లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్(ఎమ్ఏ) పూర్తి చేశారు. యూనివర్సిటీలోనే పీహెచ్ డీ ప్రవేశ పరీక్ష కోసం ధరఖాస్తు చేసుకుని హాల్ టికెట్ కోసం వెళ్లగా తనపై గత డిసెంబర్ లో పోలీసు నమోదయిందని ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి అర్హత లేదని చెప్పడంతో కంగుతిన్నాడు. గత ఏడాది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన బీఫ్ ఫెస్టివల్ లో పాల్లొన్న వారిలో 25 మంది ఈఎఫ్ఎల్ యూ విద్యార్థులు కూడా ఉన్నారు.
విద్యార్థుల బీఫ్ ఫెస్టివల్ లో పాల్గొనకూడదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, కొంతమంది విద్యార్థుల ఆదేశాలను పాటించకుండా ఫెస్టివల్ పాల్గొన్నట్లు ఈ సందర్భంగా యూనివర్సిటీ తెలిపింది. విశ్వవిద్యాలయ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ ఆర్డినెన్స్ పాస్ చేసిందని ఈఎఫ్ఎల్ యూ ప్రొఫెసర్ ప్రకాష్ కోనా తెలిపారు. జలీస్ కు మాత్రమే కాకుండా శారీరక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న మరో విద్యార్ధికి, ఫేస్ బుక్ లో యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ పై అభ్యంతరకరమైన పోస్టు చేసిన విద్యార్థికి కూడా యూనివర్సిటీ హాల్ టికెట్లను జారీ చేయలేదు.
తన మీద కేసు నమోదయి ఇప్పటికి ఆరునెలలు కావొస్తోందనీ.. తాను హాల్ టికెట్ తీసుకోవడానికి వెళ్లే వరకు యూనివర్సిటీ ఈ విషయం చెప్పలేదని జమీల్ వాపోయాడు. పోలీసు కేసు ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు చూపలేదని తెలిపారు.
బీఫ్ తిన్నందుకే..
Published Tue, May 10 2016 8:44 AM | Last Updated on Thu, Jul 11 2019 6:23 PM
Advertisement