Hallticket
-
నకిలీ హాల్ టికెట్‌తో సివిల్స్ పరీక్షకు..
సాక్షి, హైదరాబాద్: యూపీఎస్సీ సివిల్‌సర్వీసెస్(మెయిన్స్) పరీక్షలకు శుక్రవారం ఓ యువతి నకిలీ హాల్‌టికెట్‌తో రావడాన్ని అధికారులు గుర్తించారు. కర్నూల్ జిల్లాకు చెందిన యువతి బజార్‌ఘాట్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ పరీక్షా కేంద్రంలో హాల్‌టికెట్(నెంబర్ 7601738) పరీక్షకు హాజరయ్యింది. హాల్ టికెట్‌ను పరిశీలించిన చీఫ్ అబ్జర్వర్ నకిలీదిగా గుర్తించారు. దీనిపై విచారణ జరిపిన అధికారులు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు హైదరాబాద్ జిల్లా పౌరసంబంధాల అధికారి పేర్కొన్నారు. -
29న ప్రత్యేకాధికారి పోస్టులకు రాతపరీక్ష
సప్తగిరికాలనీ: కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాలలో ప్రత్యేకాధికారి పోస్టుల భర్తీ కోసం నిర్వహించే రాతపరీక్షను శుక్రవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు స్థానిక పాత ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి శ్రీనివాసాచారి తెలిపారు. అభ్యర్థినులు గురువారం సర్వశిక్ష అభియాన్ కార్యాలయంలో హాల్ టికెట్లు పొందవచ్చన్నారు. శుక్రవారం ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకు కూడా హాల్‌టికెట్లు తీసుకోవచ్చని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థినులు ఏదైనా గుర్తింపుకార్డు, పాస్‌పోర్టు సైజ్ ఫొటోను తప్పక వెంట తెచ్చుకోవాలని సూచించారు. -
29న ప్రత్యేకాధికారి పోస్టులకు రాతపరీక్ష
సప్తగిరికాలనీ: కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాలలో ప్రత్యేకాధికారి పోస్టుల భర్తీ కోసం నిర్వహించే రాతపరీక్షను శుక్రవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు స్థానిక పాత ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి శ్రీనివాసాచారి తెలిపారు. అభ్యర్థినులు గురువారం సర్వశిక్ష అభియాన్ కార్యాలయంలో హాల్ టికెట్లు పొందవచ్చన్నారు. శుక్రవారం ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకు కూడా హాల్‌టికెట్లు తీసుకోవచ్చని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థినులు ఏదైనా గుర్తింపుకార్డు, పాస్‌పోర్టు సైజ్ ఫొటోను తప్పక వెంట తెచ్చుకోవాలని సూచించారు. -
బీఫ్ తిన్నందుకే..
హైదరాబాద్: గత డిసెంబర్ నెలలో ఉస్మానియాలో నిర్వహించిన బీఫ్ ఫెస్టివల్ పాల్లొన్న విద్యార్ధికి ఇంగ్లీష్ అండ్ ఫారీన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ(ఈఎఫ్ఎల్ యూ) షాక్ ఇచ్చింది. జాలీస్ కొడూరు అనే విద్యార్థి యూనివర్సిటీలో అరబిక్ లాంగ్వేజ్ లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్(ఎమ్ఏ) పూర్తి చేశారు. యూనివర్సిటీలోనే పీహెచ్ డీ ప్రవేశ పరీక్ష కోసం ధరఖాస్తు చేసుకుని హాల్ టికెట్ కోసం వెళ్లగా తనపై గత డిసెంబర్ లో పోలీసు నమోదయిందని ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి అర్హత లేదని చెప్పడంతో కంగుతిన్నాడు. గత ఏడాది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన బీఫ్ ఫెస్టివల్ లో పాల్లొన్న వారిలో 25 మంది ఈఎఫ్ఎల్ యూ విద్యార్థులు కూడా ఉన్నారు. విద్యార్థుల బీఫ్ ఫెస్టివల్ లో పాల్గొనకూడదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, కొంతమంది విద్యార్థుల ఆదేశాలను పాటించకుండా ఫెస్టివల్ పాల్గొన్నట్లు ఈ సందర్భంగా యూనివర్సిటీ తెలిపింది. విశ్వవిద్యాలయ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ ఆర్డినెన్స్ పాస్ చేసిందని ఈఎఫ్ఎల్ యూ ప్రొఫెసర్ ప్రకాష్ కోనా తెలిపారు. జలీస్ కు మాత్రమే కాకుండా శారీరక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న మరో విద్యార్ధికి, ఫేస్ బుక్ లో యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ పై అభ్యంతరకరమైన పోస్టు చేసిన విద్యార్థికి కూడా యూనివర్సిటీ హాల్ టికెట్లను జారీ చేయలేదు. తన మీద కేసు నమోదయి ఇప్పటికి ఆరునెలలు కావొస్తోందనీ.. తాను హాల్ టికెట్ తీసుకోవడానికి వెళ్లే వరకు యూనివర్సిటీ ఈ విషయం చెప్పలేదని జమీల్ వాపోయాడు. పోలీసు కేసు ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు చూపలేదని తెలిపారు. -
హాల్‌టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం
* నిప్పంటించుకున్న ఇంజనీరింగ్ విద్యార్థి * 90 శాతం గాయాలతో పరిస్థితి విషమం * ఇంటర్ సర్టిఫికెట్‌కు గుర్తింపు లేకపోవడమే కారణం * అడ్మిషన్ సమయంలో పట్టించుకోని కళాశాల * పరీక్షల సమయంలో హాల్‌టికెట్ జారీ చేయని ఉన్నత విద్యామండలి * కాలేజీ నిర్వాకంపై తోటి విద్యార్థుల ఆగ్రహం మొయినాబాద్: హాల్‌టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సర్టిఫికెట్లు సరిగా తనిఖీ చేయకుండా అడ్మిషన్ ఇచ్చిన కాలే జీ యాజమాన్యం.. తీరా పరీక్షల సమయంలో హాల్‌టికెట్ రాలేదని చేతులె త్తేయడంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. 90 శాతం కాలిన గాయాలతో ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని చిలుకూరులో గాయత్రి ఆలయ సమీపంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం అమిస్తాపూర్‌కు చెందిన కె.శివమహేష్(21).. గతేడాది తొలుత విద్యాజ్యోతి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరంలో చేరాడు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివినట్లు సర్టిఫికెట్‌ను ఇంజనీరింగ్ కాలేజీలో మహేశ్ సమర్పించాడు. అయితే ఆ కాలేజీకి గుర్తింపు లేదని, ఇంటర్ సర్టిఫికెట్ చెల్లద సిబ్బంది ఇంజనీరింగ్ అడ్మిషన్‌ను రద్దు చేశారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పకుండా హిమాయత్‌నగర్‌లో ఉన్న అభినవ్ హైటెక్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈఈఈ గ్రూపులో శివమహేశ్ చేరాడు. సదరు కళాశాల యాజమాన్యం అతడి సర్టిఫికెట్లను తనిఖీ చేయకుండానే కాసులకు కక్కుర్తి పడి అడ్మిషన్ ఇచ్చింది. ఆరు నెలలుగా కళాశాలకు వెళ్తున్న మహేశ్.. మొదటి సంవత్సరం పరీక్షకు ఫీజు సైతం చెల్లించాడు. అయితే హాల్‌టికెట్ల జారీ కోసం విద్యార్థుల సర్టిఫికెట్లను తనిఖీ కోసం ఉన్నత విద్యామండలికి కళాశాల యాజమాన్యం పంపించింది. మహేశ్ ఇంటర్ చదివిన కాలేజీకి ప్రభుత్వ గుర్తింపు లేదని, హాల్‌టికెట్ జారీ చేయడం లేదని ఉన్నత విద్యామండలి తెలియజేసింది. దీంతో ఈ విషయాన్ని కళాశాల యాజమాన్యం ఈ నెల 12న శివమహేశ్కు తెలిపింది. సోమవారం నుంచి మొదటి ఏడాది పరీక్షలు ప్రారంభం కావడం.. పరీక్షకు హాల్‌టికెట్ రాకపోవడంతో శివమహేశ్ తీవ్రంగా మనస్తాపం చెందాడు. చిలుకూరు రెవెన్యూ పరిధిలోని గాయత్రి ఆలయం సమీపంలోని నిర్మాణుష్య ప్రదేశంలో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలకు తాళలేక పెద్దగా కేకలు వేయడంతో సమీపంలోని ఓ ఇంటి వాచ్‌మన్ గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తీవ్రంగా గాయపడిన శివమహేశ్‌ను పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 90 శాతం కాలిన గాయాలతో విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. శివమహేశ్‌ను చేర్చుకునే సమయంలోనే కళాశాల యాజమాన్యం సర్టిఫికెట్లను క్షణంగా తనిఖీ చేయాల్సింది. అప్పుడే ఇంటర్ సర్టిఫికెట్ చెల్లదని గుర్తించి ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదని తోటి విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళాశాలలో చేరి 6 నెలలుగా తరగతులకు హాజరై తీరా పరీక్షల సమయంలో హాల్ టికెట్ రాకపోవడంతో శివమహేశ్ మనోవేదనకు గురైనట్లు పేర్కొన్నారు. -
ఆవూ.. పరీక్ష రాస్తుందోచ్!
శ్రీనగర్: అవును. ఈ ఆవు పాలు ఇవ్వడమే కాదు.. పాలిటెక్నిక్ డిప్లొమా ప్రవేశ పరీక్ష కూడా రాయబోతోంది! నమ్మశక్యంగా లేదా? అయితే.. అన్ని వివరాలనూ క్షుణ్ణంగా పరిశీలించి మరీ జమ్మూకశ్మీర్ ‘బోర్డ్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్(బీవోపీఈఈ)’ జారీ చేసిన ఈ హాల్‌టికెట్ చూడండి. కచిర్ గావ్(గోధుమ రంగు ఆవు).. డాటర్ ఆఫ్ గూరా దండ్(ఎర్ర ఎద్దు).. వయసు 18 ఏళ్లు అంటూ పూర్తి వివరాలున్నాయి. సంతకం, వేలిముద్రల బాక్సుల్లో తోక, గిట్ట ఫొటోలూ ఉన్నాయి! ఉదయం 9:55 గంటలు దాటితే ప్రవేశం లేదనీ స్పష్టంచేశారు. మే 10న జరిగే పరీక్ష రాసేందుకు ఈ హాల్‌టికెట్ జారీ అయింది! కశ్మీర్ ప్రతిపక్ష పార్టీ నేత జునైద్ అజీమ్ మట్టూ హాల్‌టికెట్ కాపీని ట్విటర్లో పెట్టడంతో ఈ గోవు-పరీక్ష సంగతి వెలుగుచూసింది. విద్యామంత్రి నయీం అక్తర్ హయాంలో మంచి ప్రగతి కనిపిస్తోందని, ఆవులూ హాల్‌టికెట్లు పొందగలుగుతున్నాయంటూ మట్టూ ట్వీట్ చేశారు. మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. ఆవు పరీక్ష బాగా రాస్తుందో లేదో చూడాలని ఉందన్నారు. చివరకు ఈ వార్త అధికారుల దాకా పాకడంతో వారు నాలుక్కర్చుకుని శనివారం ఉదయం హాల్‌టికెట్‌ను వెబ్సైట్ నుంచి తొలగించారు. దరఖాస్తులు, హాల్‌టికెట్ల జారీ ప్రక్రియ ఆన్లైన్లో జరగడం వల్ల పొరపాటు చోటుచేసుకుందని బోర్డు ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ ఫరూక్ అహ్మద్ మీర్ వివరణనిచ్చారు. మనిషి బొమ్మకు, జంతువుల బొమ్మకు తేడాను సాఫ్ట్వేర్ గుర్తించలేకపోవడం వల్ల పొరపాటు జరిగిందన్నారు. ఎవరో ఆకతాయిలు ఆవు ఫొటోను అప్లోడ్ చేసి ఈ కొంటె పనిచేశారని, వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. -
హాల్‌టికెట్‌పై కేసీఆర్ ఫోటో