denied
-
పండగ పూట మరోసారి ‘మంచు’ వివాదం (ఫోటోలు)
-
Liquor Scam: లిక్కర్ స్కాం నిందితులకు బెయిల్ నిరాకరణ
సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన నిందితులకు ఊరట దక్కలేదు. మనీలాండరింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయిన ఐదుగురికి గురువారం బెయిల్ నిరాకరించింది కోర్టు. లిక్కర్ స్కాంలో విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, సమీర్ మహేంద్రు, శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబులను దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. అయితే బెయిల్ కోసం వీళ్లు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ Rouse Avenue Court కోర్టును ఆశ్రయించగా.. కోర్టు బెయిల్‌కు తిరస్కరించింది. 123 పేజీలతో కూడిన తీర్పును వెలువరించారు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నాగ్‌పాల్. ఐదుగురు నిందితులపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి. నిందితులు మనీలాండరింగ్ చట్టంలోని సెక్షన్ 3 కింద.. ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు. కాబట్టి, ఈ ఐదుగురు నిందితులు బెయిల్‌కు అర్హులు కాదు. అందుకే బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తున్నాం అని స్పెషల్ కోర్టు న్యాయమూర్తి వెల్లడించారు. Delhi's Rouse Avenue Court dismisses bail petitions of Vijay Nair, Abhishek Bonipally, Sameer Mahendru, Sarath P Reddy and Binoy Babu who were arrested in the money laundering probe emerging out of the Delhi govt new excise policy case — ANI (@ANI) February 16, 2023 -
ప్రత్యేక కోర్టులు అక్కర్లేదు: సుప్రీం
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్, పన్నుల ఎగవేత వంటి ఆర్థిక నేరాల కేసుల విచారణ కోసం జిల్లాకో ప్రత్యేక కోర్టు ఏర్పాటుచేయాలన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆర్థిక నేరాల కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటుచేసేలా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించాలంటూ దాఖలైన పిల్‌ను సీజేఐ జస్టిస్ యు.యు. లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిల సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారించింది. ‘ ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలపై కేసుల విచారణకు కోర్టులున్నాయి. పోక్సో కోర్టులున్నాయి. ప్రతి ఒక్క అంశానికి విడిగా కోర్టులు ఏర్పాటుచేస్తూ పోతే కింది స్థాయి జ్యుడీషియల్ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. అందుకు ఒప్పకోం’ అంటూ పిల్‌ను తిరస్కరించింది. -
గిరిజనులపై దాడులు అమానుషం: చాడ
సాక్షి, హైదరాబాద్: గిరిజనులపై అటవీశాఖ అధికారుల దాడులను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో ఖండించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం సీతయ్య గూడెంలో అటవీశాఖ అధికారులు 55 ఎకరాల్లో పోడు సాగు చేసుకుంటున్న రైతులపై దాడులు చేయడం అమానుషమన్నారు. ఈ ఘటనతో తీవ్రంగా మానసిక వేదనకు గురైన ఇద్దరు రైతులు అక్కడికక్కడే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని, వారికి చికిత్స అందించారని తెలిపారు. పోడు సాగుదారులకు పట్టాలు పంపిణీ చేసేంతవరకూ కమ్యూనిస్టు పార్టీ అలుపెరుగని ఉద్యమం చేస్తుందన్నారు. ప్రభుత్వం తక్షణమే పోడు సాగుదారులపై దాడులు నిలిపివేతకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
బెంగాల్ మంత్రికి వీసా నిరాకరణ
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ గ్రంథాలయ శాఖ మంత్రి, జమాత్ ఉలేమా హింద్ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధిక్ అల్లాహ్ చౌదరికి బంగ్లాదేశ్ వీసా నిరాకరించింది. వీసా నిరాకరణకు గల కారణం వెల్లడికాలేదు. ఈ విషయంపై సిద్ధిక్ చౌదరి మాట్లాడుతూ.. ‘డిసెంబర్ 26 నుంచి 31ల మధ్య ఐదు రోజుల బంగ్లాదేశ్ పర్యటనకు ఈ నెల 12వ తారీఖున వీసా కోసం దరఖాస్తు చేశాను. అక్కడ ఓ సదస్సులో పాల్గొనమని నాకు ఆహ్వానం వచ్చింది. నాకూ కొన్ని వ్యక్తిగత పనులున్నాయి. వీసా ఇస్తున్నట్టుగానీ, తిరస్కరిస్తున్నట్టు గానీ నాకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. వీసా కోసం అన్ని పత్రాలను సమర్పించాను. అవసరమైన అనుమతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద తీసుకున్నాను. అయినా వీసా రాకపోవడంతో ఇప్పటికే బుక్‌చేసుకున్న టికెట్‌ను క్యాన్సిల్ చేసేశా’నని వెల్లడించారు. ఈ విషయంపై బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్‌ను వివరణ కోరగా, ఆయన అందుబాటులోకి రాలేదు. ఆ కార్యాలయ సిబ్బంది కూడా అందుబాటులోకి లేకుండా పోయారు. ఈ విషయంపై తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు మాట్లాడుతూ.. వీసా రాకపోవడంపై మేము నిజంగా ఆశ్చర్యపోతున్నాం. ఒక మంత్రికి బంగ్లాదేశ్ వీసా నిరాకరించడంపై మేము షాక్‌కు గురయ్యామని వ్యాఖ్యానించారు. సిద్ధిక్ చౌదరి పశ్చిమ బెంగాల్లో ముస్లిం సామాజిక వర్గాన్ని ప్రభావితం చేయగల నాయకులలో ఒకరు. కాగా, సిద్ధిక్ చౌదరి ఇటీవల వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, దేశవ్యాప్త ఎన్నార్సీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఇలా జరగడం గమనార్హం. -
కేజ్రీవాల్ విదేశీ పర్యటనకు అనుమతి నిరాకరణ
న్యూఢిల్లీ: వాతావరణ మార్పుపై డెన్మార్క్‌లో జరుగుతున్న సీ –40 క్లైమేట్ సదస్సులో పాల్గొనాలనుకున్న ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ కేజ్రీవాల్‌కు చుక్కెదురైంది. ఆయన పర్యటనకు విదేశాంగ శాఖ రాజకీయ అనుమతి నిరాకరించిందని అధికార వర్గాలు మంగళవారం తెలిపాయి. దాంతో మంగళవారం కోపెన్‌హెగన్‌కు బయల్దేరాల్సిన ఆయన తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట దెబ్బతింటుందని, ఆప్ అంటే కేంద్రానికి ఎందుకు అంత కోపమని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ విషయమై కేంద్రప్రభుత్వం స్పందించింది. క్లైమేట్ సదస్సు మేయర్ స్థాయి ప్రతినిధులు పాల్గొంటున్న కార్యక్రమం కాబట్టే అనుమతి ఇవ్వలేదని కేంద్రం వివరణ ఇచ్చింది. -
శ్రీనివాస్ హత్యతో సంబంధం లేదు: ఎమ్మెల్యే వీరేశం
సాక్షి, నల్లగొండ: నల్లగొండ మున్సిపల్ చైర్పర్సన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో తనకెలాంటి సంబంధం లేదని స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి బ్రదర్స్ శవ రాజకీయాలు చేస్తున్నారని, సీబీఐ విచారణ జరిపించినా అభ్యంతరం లేదని అన్నారు. నమ్మిన వారే హత్య చేశారని మృతుడి భార్యే చెప్పిందన్నారు. అదనపు గన్మెన్లు కావాలని డీజీపీని కోరిన కోమటిరెడ్డి శ్రీనివాస్ కుటుంబానికి రక్షణ కావాలని ఎందుకు కోరలేదని ఆయన ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న ఈ మూడున్నరేళ్ల తన ఫోన్ కాల్ డేటా బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. హత్యా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్సేనని, నయీమ్‌ను పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీనే అని వేముల ఆరోపించారు. -
మానవత్వం మరచిన వైద్యులు
అనారోగ్యతో ఆస్పత్రికి వస్తే చికిత్స చేసేందుకు నిరాకరణ నెల్లూరు(క్రైమ్) : ఊపిరి ఆడటం లేదంటూ ఓ మహిళ వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లింది. తక్షణమే వైద్యసేవలందించాల్సిన అక్కడి వైద్యసిబ్బంది నిరాకరించారు. ప్రాణాలు పోతున్నాయని ప్రాధేయపడినా పట్టించుకోలేదు. ఈ పరిస్థితి జిల్లా ప్రభుత్వాస్పత్రిలో శనివారం జరిగింది. నెల్లూరు రూరల్ మండలం గుడిపల్లిపాడుకు చెందిన ఓ వివాహిత కొంతకాలం కిందట తీవ్ర అనారోగ్యానికి గురైంది. కుటుంబ సభ్యులు ఆమెకు ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షలు చేయించారు. ఆమెకు నయంకాని జబ్బని పరీక్షల్లో తేలింది. జబ్బును నయం చేసేందుకు మందులు ఇచ్చి వాటిని క్రమం తప్పకుండా వాడాలని సూచించారు. మందులను వాడుతున్నా.. జబ్బునయం కాలేదు. రోజురోజుకు ఆరోగ్యం క్షీణించసాగింది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉండటంతో వైద్యం చేయించే స్థోమత లేకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువస్తే వారు సరిగా వైద్యసేవలు అందించలేదు. దీంతో ఆమెను జొన్నవాడలోని కామక్షితాయి దేవాలయం వద్ద వదిలి పెట్టారు. శనివారం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆమె స్థానికుల సహాయంతో చికిత్స కోసం జిల్లా ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. అప్పటికే ఆమెకు ఊపిరి తీసుకోవడం కష్టమైంది. తన పరిస్థితిని అక్కడున్న వైద్యులు, వైద్య సిబ్బందికి చెప్పలేక చెప్పి చికిత్స అందించాలని అభ్యర్థించింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటం చూసి వైద్యం అందించేందుకు వారు నిరాకరించారు. తన దయనీయస్థితిని అటుగా వెళ్లేవారికి చెప్పి వైద్యం అందించేందుకు సహకరించాలని కన్నీటి అభ్యర్థించింది. కొందరు సహచర రోగులు ఆమె పరిస్థితిని అక్కడున్న వైద్యసిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా వారు స్పందించిన పాపన పోలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఆస్పత్రి ఆవరణలోనే వైద్యంకోసం పడిగాపులు కాయసాగింది. తాజా ఘటన మరోసారి ప్రభుత్వ వైద్యసిబ్బందిలో మానవత్వం మచ్చుకైనా లేదన్న విషయాన్ని మరోసారి రుజువుచేస్తోందని పలువురు రోగుల బందువులు వాపోతున్నారు. -
పర్మనెంట్ వీసా తిరస్కరించారని..
మెల్ బోర్న్: ఆస్ట్రేలియా మెల్బోర్న్ ప్రాంతంలో ఓ భారతీయ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం కోసం చేసిన తన ధరఖాస్తును అధికారులు నిరాకరించడంతో అతడు ప్రాణాలు తీసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. 36 ఏళ్ళ దీపక్ సింగ్ 2008 లో స్టూడెంట్ వీసాతో ఆస్ట్రేలియాలో కమ్యూనిటీ వెల్ఫేర్ కోర్సు చదివేందుకు వెళ్ళాడు. చదువుకునే సమయంలోఅతడు అక్కడ ఉద్యోగం చేసినట్లుగా రుజువులు దొరకండం అతడ్ని శాస్వత నివాసానికి అర్హత లేకుండా చేసింది. అనంతరం అక్కడే ఓ ఆస్ట్రేలియన్ మహిళను సింగ్ వివాహమాడాడు. టెంపరరీ వీసాతో కొనసాగుతూ... అక్కడి పౌరురాలిని వివాహమాడిన ఆధారంతో పర్మనెంట్ రెసిడెన్సీ (పీఆర్) వీసాకోసం ధరఖాస్తు చేసుకున్నాడు. పని హక్కులను తొలగించడంతోపాటు.. భారత్ కు తిరిగి వెళ్ళాల్సిందిగా సింగ్ ను ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆదేశించడంతో అతడు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడని, అతడి స్నేహితుడు, సంఘం సభ్యుడైన జస్వీందర్ సిద్ధు తెలిపినట్లు ఓ వెబ్ సైట్ వివరాల్లో వెల్లడించింది. ఆస్ట్రేలియా పౌరురాలిని పెళ్ళాడిన సింగ్.. స్పౌస్ వీసా ఆధారంగా పర్మనెంట్ రెసిడెన్సీ వీసాకు ధరఖాస్తు చేసుకున్నాడని, అయితే అది రావడం ఎంతో కష్టం అని తేలడంతో సింగ్ తీవ్ర నిరాశకు, ఒత్తిడికి లోనయ్యాడని సిద్ధు తెలిపాడు. 2012 లోనే ఓసారి అతని ధరఖాస్తును తిరస్కరించడంతో అప్పట్నుంచీ అతడు పీఆర్ వీసాకోసం తీవ్రంగా పోరాడుతున్నాడని, ఇమ్మిగ్రేషన్ నిరాకరణపై కోర్టును ఆశ్రయించిన సింగ్.... పోరాటం చివరిస్థాయిలో ఉండగా.. కోర్టుకు హాజరు కావాల్సిన అతడు.. ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిపాడు. ప్రతిరోజులాగే ఆదివారం కూడా అతడు నిద్రలేచి కనీసం ఏమీ తినకుండా ఆఫీసుకు బయల్దేరాడని, ఇంటినుంచీ వెళ్ళిన కేవలం అరగంట లోపే పోలీసులు అతడు కారులో చనిపోయినట్లుగా సమాచారం అదించినట్లు సిద్ధూ తెలిపాడు. -
సాధ్వీ ప్రజ్ఞ కు చుక్కెదురు
ముంబై: మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో నిందితురాలిగా జైలులో ఉన్న సాధ్వి ప్రజ్ఞాసింగ్ కు కోర్టులో చుక్కెదురైంది. ఆమెకు బెయిల్ ఇవ్వడానికి ముంబై స్పెషల్ కోర్టు నిరాకరించింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)మాలెగావ్ పేలుళ్ల కేసు విచారణ నుంచి తప్పు కోవడాన్ని కోర్టు ప్రశ్నించింది. కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాతే బెయిల్ ఇస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. కాగా కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళతామని సాధ్వి కుటుంబ సభ్యులు తెలిపారు. 2008లో మహారాష్ట్ర్రలోని మాలెగావ్ లో బాంబు పేలుళ్లలో ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇందులో నిందితులుగా పేర్కొంటూ సాధ్వితో పాటు మరికొంత మందిపై మోకా చట్టం కింద కేసును విచారిస్తున్నజాతీయదర్యాప్తు సంస్థ సరైన సాక్షాదారాలు లేవనే కారణంతో కేసునుంచి విత్ డ్రా అయింది. -
బీఫ్ తిన్నందుకే..
హైదరాబాద్: గత డిసెంబర్ నెలలో ఉస్మానియాలో నిర్వహించిన బీఫ్ ఫెస్టివల్ పాల్లొన్న విద్యార్ధికి ఇంగ్లీష్ అండ్ ఫారీన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ(ఈఎఫ్ఎల్ యూ) షాక్ ఇచ్చింది. జాలీస్ కొడూరు అనే విద్యార్థి యూనివర్సిటీలో అరబిక్ లాంగ్వేజ్ లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్(ఎమ్ఏ) పూర్తి చేశారు. యూనివర్సిటీలోనే పీహెచ్ డీ ప్రవేశ పరీక్ష కోసం ధరఖాస్తు చేసుకుని హాల్ టికెట్ కోసం వెళ్లగా తనపై గత డిసెంబర్ లో పోలీసు నమోదయిందని ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి అర్హత లేదని చెప్పడంతో కంగుతిన్నాడు. గత ఏడాది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన బీఫ్ ఫెస్టివల్ లో పాల్లొన్న వారిలో 25 మంది ఈఎఫ్ఎల్ యూ విద్యార్థులు కూడా ఉన్నారు. విద్యార్థుల బీఫ్ ఫెస్టివల్ లో పాల్గొనకూడదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, కొంతమంది విద్యార్థుల ఆదేశాలను పాటించకుండా ఫెస్టివల్ పాల్గొన్నట్లు ఈ సందర్భంగా యూనివర్సిటీ తెలిపింది. విశ్వవిద్యాలయ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ ఆర్డినెన్స్ పాస్ చేసిందని ఈఎఫ్ఎల్ యూ ప్రొఫెసర్ ప్రకాష్ కోనా తెలిపారు. జలీస్ కు మాత్రమే కాకుండా శారీరక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న మరో విద్యార్ధికి, ఫేస్ బుక్ లో యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ పై అభ్యంతరకరమైన పోస్టు చేసిన విద్యార్థికి కూడా యూనివర్సిటీ హాల్ టికెట్లను జారీ చేయలేదు. తన మీద కేసు నమోదయి ఇప్పటికి ఆరునెలలు కావొస్తోందనీ.. తాను హాల్ టికెట్ తీసుకోవడానికి వెళ్లే వరకు యూనివర్సిటీ ఈ విషయం చెప్పలేదని జమీల్ వాపోయాడు. పోలీసు కేసు ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు చూపలేదని తెలిపారు. -
షూ విసిరిన వ్యక్తికి 14 రోజుల కస్టడీ
న్యూ ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై షూ విసిరిన వ్యక్తికి ఢిల్లీ కోర్టు బెయిల్ నిరాకరించింది. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ తీర్పునిచ్చింది. గతవారం ఢిల్లీలో ట్రాఫిక్ యాజమాన్య నిర్వహణలో భాగంగా సరిబేసి సంఖ్యల పద్ధతి అమలుపై కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఓ వ్యక్తి ఆయనపై చెప్పు విసిరిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై సదరు నిందితుడు బెయిల్ కోరగా నిరాకరించిన కోర్టు రెండువారాలపాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. నిందితుడు వేద ప్రకాష్ బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అభిలాష్ మల్హోత్రా తోసిపుచ్చారు. ప్రజలు ఇటువంటి చర్యలకు పాల్పడటం సరికాదని, ఇందుకు ప్రతిబంధకంగా శిక్షను అనుభవించాలని తీర్పునిచ్చారు. సరి బేసి సంఖ్య పథకం కోసం ఢిల్లీలో నకిలీ సీఎన్జీ స్టిక్కర్లు పంపిణీ చేశారని ఆరోపిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కార్యకర్త వేద్ ప్రకాష్... కేజ్రీవాల్ పైకి షూ విసిరాడు. అయితే అది ఆయనకు తగలకుండా తృటిలో తప్పింది. సీఎన్జీతో నడుస్తున్న కార్లకు పథకంనుంచి మినహాయింపు ఇచ్చారని, అటువంటి 'స్కామ్' వీడియో ఆధారాలు తనవద్ద ఉన్నాయని, అక్రమాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోపోవడంతోనే తనకు కేజ్రీవాల్ పై కోపం వచ్చి..షూ విసిరానని నిందితుడు చెప్తున్నాడు. ఒకరోజు కస్టడీ ముగిసిన అనంతరం నిందితుడ్ని కోర్టుకు హాజరు పరచడంతో.. నిందితుడి బెయిల్ పిటిషన్ ను కోర్టు పరిశీలించింది. ఇతరుల మధ్య అభిప్రాయ బేధాలు ఉండొచ్చని, ప్రజలు ఎన్నుకున్నముఖ్యమంత్రిని, రాజ్యాంగాధికారాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందన్న కోర్టు... ఇటువంటి చర్యలతో అసంతృప్తిని వ్యక్త పరచడం సరికాదని అభిప్రాయ పడింది. -
ఆ అధికారులను కోల్‌కతా మ్యాచ్‌కు రానివ్వలేదు
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం కోల్ కతా వచ్చేందుకు పాక్ దౌత్యవేత్తలకు కేంద్రం అనుమతి నిరాకరించింది. మార్చి 19న భారత్- పాకిస్తాన్ మధ్య కోల్ కతాలో వరల్డ్ టీ 20 మ్యాచ్ జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు పాకిస్తాన్ అధికారులు ఏడుగురు కోల్ కతా వచ్చేందుకు అనుమతి కోరగా.. చివరినిమిషం వరకు తమకు అనుమతి ఇవ్వలేదని, చివరినిమిషంలో ఇద్దరు అధికారులకు మాత్రమే అనుమతి ఇవ్వడంతో వారు కూడా కోల్‌కతాకు వచ్చే అవకాశం లేదని పాక్ వర్గాలు తెలిపాయి. కోల్ కతా మ్యాచ్ కోసం పాక్ దౌత్యవేత్తలకు భారత్ అనుమతి నిరాకరించడం నిజమేనని భారత్ కు చెందిన డిప్యూటీ హై కమిషనర్ జేపీ సింగ్ ఇస్లామాబాద్ లో తెలిపారు. అయితే, ఇద్దరు దౌత్యవేత్తలకు కోల్ కతా వచ్చేందుకు ప్రయాణ అనుమతులు మంజూరు చేశామని, మరో ఐదుగురికి మాత్రం నిరాకరించామని భారత అధికారులు తెలిపారు. ఆ ఐదుగురికి పాకిస్తాన్ అంతర్గత భద్రతా సిబ్బందితో, ముఖ్యంగా ఐఎస్ఐతో సంబంధాలు ఉండటం వల్లే అనుమతి నిరాకరించామని చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం 3.30 వరకు మొత్తం ఏడుగురిలో ఏ ఒక్కరికి అనుమతులు రాలేదని పాకిస్తాన్ వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ క్రికెట్ జట్టును ప్రోత్సహించేందుకే దౌత్యవేత్తలు కోల్ కతాకు వెళుదామనుకుంటున్నారని, ఈ విషయంలో భారత ప్రభుత్వం అనవసరంగా సమస్యను సృష్టిస్తోందని పాక్ దౌత్యవర్గాలు ఆరోపిస్తున్నాయి. టీ20 ప్రపంచ కప్ లో భాగంగా పాక్ జట్టు మ్యాచులు జరగనున్న కోల్ కతా , మొహాలీలను సందర్శించేందుకు పాకిస్తాన్ దౌత్యవేత్తలు, ప్రముఖులతో సహా 45 మందికి అనుమతి ఇవ్వాలని కేంద్ర విదేశాంగ శాఖను పాక్ కోరిందని తెలుస్తోంది. అయితే పాక్ మ్యాచ్ ఆడుతున్న ప్రతిచోటుకీ అంతమందిని అనుమతించడం సాధ్యం కాదని, ఇటువంటి నిర్ణయాలు అన్యోన్యత ఆధారంగా తీసుకుంటారని ఓ భారతీయ అధికారి తెలిపారు -
ఇస్రో గగనతలంపై అనుమానాస్పద విహారం
చెన్నై: తమిళనాడు తిరునల్వేలి జిల్లా మహేంద్రగిరిలోని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) ఉపరితలంపై అనుమానాస్పదంగా ఏదో ఎగురుతోందన్న వార్తలు కలకలం సృష్టించాయి. దీనిపై స్థానిక గొర్రెల కాపరులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆందోళన నెలకొంది. ఇస్రోకు సమీపంలోని నిషిద్ధ ప్రదేశం ఏడో వాచ్ టవర్ దగ్గర ఆకాశంలో అనుమానాస్పదంగా ఎగురుతున్న విమానాన్ని చూశామని తెలిపారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఇక్కడ గగనతలంలో ఏదో నిగూఢంగా ఎగురుతున్న విషయాన్ని గమనించి ఆందోళన చెందామన్నారు. సమీపంలోని అటవీ ప్రాంతాల గుండా పయనిస్తూ ఇస్రో వైపు రావడాన్ని తాము స్పష్టంగా చూశామని చెప్పారు. అయితే ఇస్రో అధికారులు మాత్రం ఈ వార్తలను ధ్రువీకరించలేదు. అలాంటి సంకేతాలేవీ శాస్త్రీయంగా తమకు అందలేదంటున్నారు. సుమారు 55 కి.మీ దూరంనుంచే గగనతలంలో సంచరించేవాటిని కనిపెట్టే సాంకేతిక పరిజ్ఞానం తమ సంస్థ కలిగి ఉందన్నారు. అయితే అటవీ, పోలీసు శాఖ ఉన్నతాధికారులు దీనిపై సిరియస్‌గా దృష్టి పెట్టారు. గొర్రెల కాపరులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఏడో వాచ్ టవర్ దగ్గర నిఘా పెట్టారు. సమాచారంలో వాస్తవికతను నిర్ధారించేందుకు గొర్రెల కాపరులను ప్రశ్నిస్తున్నారు. వారు చూసిన వస్తువు ఏమై ఉంటుందనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. -
నోటికాడి మాంసం తన్నేస్తారా ?
-
సాయం కాదు.. విచారణ కావాలి
న్యూఢిల్లీ: వేల కోట్ల రూపాయల కుంభకోణం వ్యాపమ్ కేసులో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి జర్నలిస్టు కుటుంబం షాక్ ఇచ్చింది. జర్నలిస్టు కుటుంబాన్ని ఆదుకుంటామన్న సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సాయాన్ని తిరస్కరించింది. ప్రభుత్వం తమకు సహాయం అందించాల్సిన అవసరం లేదని, ఈ మిస్టీరియస్ మరణంపై సమగ్ర దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. కాగా రిపోర్టింగ్‌కు వెళ్లి అనుమానాస్పదంగా మరణించిన జర్నలిస్టు అక్షయ్ సింగ్ కుటుంబాన్ని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అక్షయ్ మృతి వల్ల ఆ కుటుంబం సర్వం కోల్పోయిందని, దీనిపై నిష్పక్షపాతంగా విచారణ చేయిస్తామని హామీ ఇచ్చారు. ఆ కుటుంబానికి రాష్ట్రంలో ఇల్లు, ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఆర్థిక సహాయం చేయనున్నట్టు ప్రకటించారు. ఈ కేసులో నిందితురాలైన నమ్రతా దామర్ అనుమానాస్పద మరణం (అది హత్యేనని తర్వాత తేలింది)పై ఆరా తీయడానికి వెళ్లి అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టు అక్షయ్ సింగ్ చనిపోయారు. ఈ మృత్యుహేల ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగిస్తూ గురువారం సుప్రీం ఆదేశాలు జారీచేసింది. -
సర్పంచ్ల పవర్‌కు ‘చెక్’
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సర్పంచ్‌లకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన చెక్‌పవర్ విషయంలో వారికి చెక్ పెట్టింది. నిధుల వినియోగంలో జవాబుదారీతనం లేక ఏటా కోట్లాది రూపాయలు దుర్వినియోగమవుతున్నాయనే కారణంతో సర్పంచ్‌లతో పాటు కార్యదర్శులకు కలిపి సంయుక్తంగా చెక్‌పవర్ కట్టబెట్టింది. దీంతో పాటు నిధుల వినియోగంపైనా కొన్ని ఆంక్షలు విధించింది. తాజాగా ఇచ్చిన ఉత్తర్వులు జీఓ 385 ప్రకారం ఇకపై గ్రామానికి సంబంధించిన నిధులు ఖర్చు చేయాలంటే సర్పంచ్, కార్యదర్శులు ఉమ్మడిగా చెక్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది. జిల్లాలో 1028 పంచాయతీలుండగా 1020 పంచాయతీలకు నూతన సర్పంచ్‌లు కొలువుదీరారు. ఉమ్మడి చెక్‌పవర్ వలన తక్షణం నిర్వహించాల్సిన పనుల్లో తీవ్ర జాప్యం జరగవచ్చని పలువురు సర్పంచ్‌లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉమ్మడి చెక్‌పవర్ వలన పంచాయతీ నిధుల ఖర్చు, పనుల్లో పారదర్శకత ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. క్షేత్ర స్థాయిలో సమస్యలు: స్థానిక సంస్థల్లో చెక్‌పవర్ కలిగిన హోదా సర్పంచ్‌లది మాత్రమే. పంచాయతీరాజ్ నిబంధనల ప్రకారం మైనర్ పంచాయతీల్లో లక్ష రూపాయల వరకూ సర్పంచ్ నిధులను ఖర్చు చేసుకోవచ్చు. లక్ష దాటితే డీఎల్పీఓ అనుమతి తీసుకోవాలి. అదే మేజర్ పంచాయతీల్లో అయితే * 2 లక్షల వరకూ ఖర్చు చేసుకునే అవకాశం ఉంది. అది దాటితే జిల్లా పాలనాధికారి అనుమతి తప్పని సరి. ప్రస్తుతం చెక్‌పవర్‌ను కార్యదర్శితో సంయుక్తంగా పంచుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయంతో అవినీతికి, ఏకపక్ష నిర్ణయాలకు అడ్డుకట్ట పడుతుందని భావించినా క్షేత్రస్థాయిలో కార్యాచరణ పరంగా సమస్యలు ఉత్పన్నం కావచ్చని పంచాయతీరాజ్ విభాగం అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. పంచాయతీలకు పాలకవర్గం ఉంటే అభివృద్ధి పనుల విషయంలో తక్షణ స్పందన ఉంటుందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. సుదీర్ఘ కాలం ప్రత్యేకాధికారుల పాలన తరువాత నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు ఎన్నో సమస్యలు స్వాగతం పలికాయి. జిల్లాలో మేజర్ పంచాయతీలు 70కుపైగానే ఉన్నాయి. వీటికి కార్యదర్శులు తగినంత మందిలేరు. రెండేసి మేజర్ పంచాయతీలకు కలిపి ఒక ఈఓ ఉన్నారు. వీటిలో చాలాచోట్ల సర్పంచ్‌లుగా ఎన్నికైన వారు స్థానికంగా, రాజకీయంగా పలుకుబడి కలిగినవారు, ముఖ్యనేతల అనుచరులున్నారు. మైనర్ పంచాయతీల్లోనూ పలుకుబడి కలిగిన వ్యక్తులు సర్పంచ్‌లుగా ఉన్నవారున్నారు. ఇలాంటి గ్రామాల్లో ఉమ్మడి చెక్‌పవర్ ప్రధాన సమస్యగా మారుతుంది. సర్పంచ్ చెక్‌పై సంతకం చేయాలని ఆదేశిస్తే తిరస్కరించే పరిస్థితి కార్యదర్శికి ఉండదు. రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువగా ప్రభావం చూపుతాయి. అధికారులకే ఇబ్బందులు... చెక్‌పవర్ విషయంలో కార్యదర్శులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గక తప్పని పరిస్థితి గ్రామాల్లో నెలకొంటుంది. దీంతో నిధులు వెచ్చించేందుకు అనుమతులిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో కొన్ని చోట్ల పనుల్లో తీవ్ర జాప్యం జరిగే అవకాశం ఉంది. సర్పంచ్ పదవీ కాలం ముగిశాక పదవి నుంచి తప్పుకుంటారు. అయితే కార్యదర్శి మాత్రం నిధుల వినయోగానికి సంబంధించి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇదే అంశంపై కార్యదర్శులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆర్థిక సంఘాల నిధులు, నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇలా వివిధ రూపాల్లో పంచాయతీలకు నిధులందుతాయి. వీటి వెచ్చింపుకు మరి కొంత సమయం పడుతుంది. ఈ లోగా గ్రామాల్లో తాగునీటి వనరులకు తాత్కాలిక మరమ్మతులు, పారిశుధ్య పనులు, బ్లీచింగ్, కార్యాలయ నిర్వహణ తదితర అవసరాలకు నిధులు అత్యవసరం. ఈ విషయాల్లో ఉమ్మడి చెక్ పవర్ పై సర్పంచ్, గ్రామ కార్యదర్శుల మధ్య విభేదాలు వస్తే గ్రామ పాలనలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఇరువర్గాల్లో అసంతృప్తి.. ఉమ్మడి చెక్‌పవర్‌పై అటు సర్పంచ్‌లు, ఇటు కార్యదర్శుల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వం తమను కీలుబొమ్మలుగా ఆడించేందుకే ఈ నిర్ణయం తీసుకుందని పలువురు సర్పంచ్‌లు ఆరోపిస్తున్నారు. దీనిపై కొందరు సర్పంచ్‌లు న్యాయస్థానానికి వెళ్లే యోచనలో ఉన్నారు. రాజకీయ ఒత్తిళ్లు, స్థానికంగా ఉండే పరిస్థితులను బట్టి నిధులు వెచ్చిస్తే ఆ నేరం కార్యదర్శులపై రుద్దేందుకు అవకాశం ఉంటుందని అధికారులంటున్నారు. పాలకవర్గానికి ప్రభుత్వ నియమ నిబంధనలను తెలియచేసే వరకే తమ పాత్రను పరిమితం చేయాలని కోరుతున్నారు.