కేజ్రీవాల్‌ విదేశీ పర్యటనకు అనుమతి నిరాకరణ | Arvind Kejriwal denied political clearance to attend climate | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్‌ విదేశీ పర్యటనకు అనుమతి నిరాకరణ

Published Thu, Oct 10 2019 3:33 AM | Last Updated on Thu, Oct 10 2019 4:51 AM

Arvind Kejriwal denied political clearance to attend climate - Sakshi

న్యూఢిల్లీ: వాతావరణ మార్పుపై డెన్మార్క్‌లో జరుగుతున్న సీ –40 క్లైమేట్‌ సదస్సులో పాల్గొనాలనుకున్న ఢిల్లీ సీఎం, ఆప్‌ చీఫ్‌ కేజ్రీవాల్‌కు చుక్కెదురైంది. ఆయన పర్యటనకు విదేశాంగ శాఖ రాజకీయ అనుమతి నిరాకరించిందని అధికార వర్గాలు మంగళవారం తెలిపాయి. దాంతో మంగళవారం కోపెన్‌హెగన్‌కు బయల్దేరాల్సిన ఆయన తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అంతర్జాతీయంగా భారత్‌ ప్రతిష్ట దెబ్బతింటుందని, ఆప్‌ అంటే కేంద్రానికి ఎందుకు అంత కోపమని ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. ఈ విషయమై కేంద్రప్రభుత్వం స్పందించింది. క్లైమేట్‌ సదస్సు మేయర్‌ స్థాయి ప్రతినిధులు పాల్గొంటున్న కార్యక్రమం కాబట్టే అనుమతి ఇవ్వలేదని కేంద్రం వివరణ ఇచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement