copenhagen
-
Copenhagen: చికుబుకు చికుబుకు బకనే!
డెన్మార్క్ రాజధాని కోపన్హేగన్కు చేరువలో ఉన్న పిల్లల వినోద కేంద్రం బకన్. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన అమ్యూజ్మెంట్ పార్కు. నాలుగు శతాబ్దాలకు పైగా ఇది కొనసాగుతోంది. సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ అమ్యూజ్మెంట్ పార్కులో పిల్లల వినోదానికి అన్ని రకాల ఏర్పాట్లూ ఉన్నాయి. పచ్చని చెట్లు చేమలతో కళకళలాడుతూ కనిపించే ఈ పార్కు విస్తీర్ణం 75 వేల చదరపు మీటర్లు. ఇందులో ఐదు రోలర్ కోస్టర్లు, నాలుగు లిటిల్ ట్రెయిన్స్, ఒక వాటర్ రైడ్ సహా పిల్లల కోసం 33 క్రీడాకర్షణలు ఉన్నాయి. సుదీర్ఘ చరిత్ర కారణంగా దీనిని చూడటానికి విదేశీ పర్యాటకులు కూడా పెద్దసంఖ్యలో వస్తుంటారు. ఏటా ఈ పార్కుకు దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షల మంది వస్తుంటారు. ఇందులోకి ప్రవేశం పూర్తిగా ఉచితం. రకరకాల రైడ్స్, ఇతర వినోద క్రీడా సాధనాలను ఉపయోగించుకోవాలనుకుంటే మాత్రం విడి విడిగా కూపన్లను కొనుక్కోవాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో పలురకాల క్రీడాసాధనాల కోసం డిస్కౌంట్ కూపన్లు అందుబాటులో ఉంటాయి. అలాగే తరచుగా ఇక్కడకు వచ్చే కోపన్హేగెన్ వాసులకు సీజన్ పాస్‌లు కూడా తక్కువ ధరల్లో అందుబాటులో ఉంటాయి.నీటిబుగ్గతో మొదలైంది..ప్రస్తుతం ఈ పార్కు ఉన్న ప్రాంతానికి అతి చేరువగా ఒక నీటిబుగ్గ ఉంది. పదహారో శతాబ్దిలో కిర్‌స్టెన్ పీల్ అనే స్థానికుడు ఒకరు ఈ నీటిబుగ్గను గుర్తించాడు. కోపన్హేగెన్ శివార్లలో పచ్చని అడవి మధ్యనున్న ఈ నీటిబుగ్గ అనతి కాలంలోనే జనాలను ఆకర్షించింది. కోపన్హేగెన్ నగరంలో సరఫరా అయ్యే నీటి నాణ్యత అప్పట్లో బాగుండేది కాదు. అందువల్ల ఎక్కువమంది జనాలు ఈ నీటిబుగ్గ నుంచి నీరు తీసుకుపోవడానికి ఇక్కడకు వచ్చేవారు. పిల్లలు ఆడుకోవడానికి ఈ ప్రదేశం అనుకూలంగా ఉండటంతో 1583లో నీటిబుగ్గకు చేరువగా అడవిలోని కొంతభాగాన్ని శుభ్రం చేసి, పార్కుగా మార్చారు. ఆ తర్వాత డెన్మార్క్, నార్వే ప్రాంతాలను పరిపాలించిన రాజు ఫ్రెడెరిక్–ఐఐఐ 1669లో ఇక్కడి అడవిలో జంతువుల అభయారణ్యాన్ని ఏర్పాటు చేశాడు. తర్వాత ఆయన కొడుకు క్రిస్టియన్–V ఈ పార్కును దాదాపు నాలుగు రెట్లు విస్తరించి, పిల్లలు ఆడుకోవడానికి వీలుగా రూపొందించాడు. అప్పట్లో ఇక్కడ రాచవంశీకులు, కులీనుల పిల్లలు మాత్రమే ఆడుకునేవారు. ఫ్రెడెరిక్–V కాలంలో 1756 నుంచి ఇందులోకి సాధారణ ప్రజలకు కూడా అనుమతి కల్పించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పార్కు కాలానుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్పులు చేసుకుంటూ వస్తున్నా, ఏనాడూ దీని తలుపులు మూసుకోలేదు. ‘కోవిడ్–19’ కాలంలో కలిగిన తాత్కాలిక అంతరాయం మినహా ఇది నేటికీ నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంది. -
డెన్మార్క్‌లో వరుస బాంబు పేలుళ్లు
కోపెన్హాగన్:డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. బుధవారం(అక్టోబర్2)ఉదయం జరిగిన ఈ పేలుళ్లలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని డెన్మార్క్ పోలీసులు ప్రకటించారు.పేలుళ్లపై ప్రాథమిక దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధవాతారణం నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పేలుళ్లు చోటు చేసుకోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదీ చదవండి: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిసైళ్ల దాడులు -
డెన్మార్క్ ప్రధానిపై దాడి
కోపెన్‌హాగెన్/న్యూఢిల్లీ: డెన్మార్క్ ప్రధానమంత్రి మెట్టె ఫ్రెడెరిక్సన్(46)పై దాడి జరిగింది. శుక్రవారం ఆమె రాజధాని కోపెన్‌హాగెన్‌లోని కుల్వోర్వెట్ స్క్వేర్ వద్ద సోషల్ డెమోక్రాట్ల తరఫున ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎదురుగా వచి్చన ఓ వ్యక్తి చేతితో ప్రధానిని భుజాన్ని బలంగా నెట్టివేశాడు. దీంతో, ఆమె పక్కకు తూలారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనతో ప్రధాని ఫ్రెడెరిక్సన్కు ఎటువంటి గాయాలు కాలేదు కానీ, షాక్‌కు గురయ్యారని ఆమె కార్యాలయం తెలిపింది. ఘటన నేపథ్యంలో శనివారం ప్రధాని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారని వివరించింది. యూరోపియన్ పార్లమెంట్‌కు ఆదివారం ఎన్నికలు జరగనుండగా ఈ పరిణామం చోటుచేసుకుంది. ఫ్రెడెరిక్సన్‌పై దాడిని ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. -
డెన్మార్క్ ప్రధానిపై దాడి
కోపెన్‌హగన్: డెన్మార్క్ ప్రధాని ఫ్రెడ్రిక్సెన్పై దాడి జరిగింది. కోపెన్హాగన్ స్క్వేర్ వద్ద ప్రధానిపై దుండగుడు ఒక్కసారిగా దాడికి దిగాడు. ఈ ఘటనతో ప్రధాని షాక్‌కు గురైనట్లు ఆమె కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దాడికి దిగిన వ్యక్తిని అరెస్టు చేశారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. దాడి జరిగిన వెంటనే ప్రధానిని సెక్యూరిటీ సిబ్బంది అక్కడి నుంచి తీసుకెళ్లారని ఘటనకు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.ప్రధానిపై దాడి తమను కలిచివేసిందని పర్యావరణ మంత్రి ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు. మూడు వారాల క్రితమే యూరప్ దేశం స్లొవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై దుండగులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. -
డెన్మార్క్ రాజుగా పదో ఫ్రెడరిక్
కోపెన్‌హేగెన్: డెన్మార్క్ రాజ సింహాసనాన్ని పదో ఫ్రెడరిక్ ఆదివారం అధిష్టించారు. రాణి రెండో మార్గరెట్ (83) అనారోగ్య కారణాలతో సింహాసనం వీడుతున్నట్లు కొత్త సంవత్సరం మొదటి రోజే ప్రకటించారు. 900 ఏళ్ల డెన్మార్క్ రాచరిక చరిత్రలో రాజు స్వచ్ఛందంగా సింహాసనం వీడటం ఇదే తొలిసారి. రాజధాని కోపెన్‌హేగెన్‌లోని జరిగిన కేబినెట్ సమావేశంలో సింహాసనం నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపే పత్రంపై రాణి సంతకం చేశారు. తర్వాత ప్రధాని మెట్టె ఫ్రెడెరిక్సన్ రాజభవనం బాల్కనీ నుంచి పదో ఫ్రెడరిక్‌ను రాజుగా ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు రాజభవనం వెలుపల వేలాది మంది గుమికూడారు. ‘గాడ్ సేవ్ ది కింగ్’అని చెబుతూ రాణి అక్కడి నుంచి ని్రష్కమించారు. రెండో మార్గరెట్‌తో పాటు ఆస్ట్రేలియా మూలాలున్న ఫ్రెడరిక్ భార్య క్వీన్ మేరీ రూపంలో డెన్మార్క్‌కు ఇద్దరు రాణులుంటారు. ఫ్రెడరిక్, మేరీల పెద్ద కుమారుడు క్రిస్టియన్ (18) యువరాజు హోదాతో సింహాసనానికి వారసుడయ్యారు. డెన్మార్క్ రాజరికం యూరప్‌లోనే అత్యంత పురాతనమైంది. 10వ శతాబ్దంలో వైకింగ్ రాజు గోర్డ్ ది ఓల్డ్ కాలం నుంచి అప్రతిహతంగా కొనసాగుతోంది. 1146లో అప్పటి డెన్మార్క్ రాజు మూడో ఎరిక్ లామ్ స్వచ్ఛందంగా సింహాసనం నుంచి వైదొలిగి, సన్యాసం తీసుకున్నారు. డెన్మార్క్ రాజుగా తొమ్మిదో ఫ్రెడరిక్ 1947 నుంచి 1972వరకు కొనసాగారు. ఆయన అకస్మాత్తుగా చనిపోవడంతో ఆయన కుమార్తె రెండో మార్గరెట్ సింహాసనం అధిíÙ్ఠంచారు. దాదాపు 52 ఏళ్లపాటు రాణిగా కొనసాగారు. -
భారత్‌లో అవకాశాలు అపారం
కోపెన్హగెన్/పారిస్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూరప్ పర్యటన బుధవారం మూడోరోజుకు చేరుకుంది. డెన్మార్క్ రాజధాని కోపెన్‌హగెన్‌లో నార్డిక్ దేశాలైన నార్వే, స్వీడన్, ఐస్లాండ్, ఫిన్‌ల్యాండ్ దేశాల అధినేతలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. భారత్–ఆయా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. భారత్‌లో అపారమైన అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని నార్డిక్ దేశాల పెట్టుబడిదారులను కోరారు. భారత కంపెనీలతో జట్టుకట్టాలన్నారు. ప్రధానంగా టెలికాం, డిజిటల్ రంగాల్లో అద్భుత అవకాశాలు ఎదురు చూస్తున్నాయని తెలిపారు. నరేంద్ర మోదీ తొలుత నార్వే ప్రధాని జోనాస్ గాహ్ర్‌స్టోర్‌తో భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య తొలిభేటీ ఇదే కావడం విశేషం. బ్లూ ఎకానమీ, క్లీన్ ఎనర్జీ, స్పేస్ హెల్త్‌కేర్ తదితర కీలక అంశాలపై జోనాస్‌తో ఫలవంతమైన చర్చలు జరిపినట్లు మోదీ ట్వీట్ చేశారు. భారత్ ఇటీవల ప్రకటించిన ఆర్కిటిక్ పాలసీలో నార్వే ఒక మూలస్తంభం అని కొనియాడారు. స్వీడన్ ప్రధానమంత్రి మాగ్డలినా ఆండర్సన్, ఐస్‌ల్యాండ్ ప్రధానమంత్రి కాట్రిన్ జాకబ్స్‌డాటిర్, ఫిన్లాండ్ ప్రధానమంత్రి సనా మారిన్‌తోనూ మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నాలుగు దేశాల ప్రధానులతో సంతృప్తికరమైన చర్చలు జరిగినట్లు మోదీ వెల్లడించారు. రెండో ఇండియా–నార్డిక్ సదస్సు కోపెన్‌హగెన్‌లో బుధవారం నిర్వహించిన రెండో ఇండియా–నార్డిక్ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ఫిన్లాండ్, ఐస్‌ల్యాండ్, స్వీడన్, నార్వే, డెన్మార్క్ ప్రధానమంత్రులు పాల్గొన్నారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం, పరిణామాలు, ప్రపంచంపై దాని ప్రతికూల ప్రభావాలపై ప్రధానంగా చర్చించారు. అనంతరం ఉమ్మడి ప్రకటన జారీ చేశారు. ఉక్రెయిన్‌లో కొనసాగతున్న సంక్షోభం, సామాన్య ప్రజల అగచాట్లపై ఆందోళన వ్యక్తం చేశారు. పౌరుల మరణాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పౌరులు క్షేమంగా బయటకు వెళ్లేందుకు, సురక్షిత ప్రాంతాలకు చేరుకొనేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉక్రెయిన్, రష్యాను కోరారు. ప్రపంచంలో చాలాదేశాలు ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం నడుచుకోవడం లేదని, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నారని, ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం లేదని ప్రధానమంత్రులు ఆక్షేపించారు. ఉక్రెయిన్‌పై చట్టవిరుద్ధంగా రష్యా సేనలు సాగిస్తున్న దాడులను నిరసిస్తున్నట్లు ఉమ్మడి ప్రకటనలో వెల్లడించారు. నిబంధనల ఆధారిత ఇంటర్నేషనల్ ఆర్డర్‌కు తాము మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని మరింత ప్రభావవంతంగా, పారదర్శకంగా మార్చాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం సంస్కరణలు చేపట్టాలని కోరారు. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ)లోనూ సంస్కరణలు అవసరమన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని, అందుకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని నార్డిక్ దేశాల అధినేతలు ఉద్ఘాటించారు. పారిస్‌లో మాక్రాన్‌తో భేటీ ప్రధాని బుధవారం సాయంత్రం ఫ్రాన్స్ చేరుకున్నారు. పారిస్‌లో ల్యాండయ్యానంటూ ట్వీట్ చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్‌తో భేటీ అయ్యారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక, వ్యూహాత్మక అంశాలపై చర్చించుకున్నారు. -
డెన్మార్క్ పీఎంతో మోదీ చర్చలు
కోపెన్హాగన్: డెన్మార్క్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని మెట్టె ఫ్రెడెరిక్సన్తో ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం సమావేశమై పలు విషయాలను చర్చించారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక బంధాలను బలోపేతం చేయడం సహా అనేక అంశాలు వీరిమధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. మోదీకి డెన్మార్క్‌లో ఘన స్వాగతం లభించింది. ప్రధాని ఫ్రెడెరిక్సన్ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి మోదీకి స్వాగతం పలికారు. తన అధికార నివాసానికి తోడ్కొని వెళ్లి, భారత పర్యటనలో ఆయన తనకిచ్చిన పెయింటింగ్‌ను చూపించారు. మోదీని మంచి స్నేహితుడిగా అభివర్ణించారు. డెనార్క్‌లో పర్యటించిడం మోదీకి ఇదే తొలిసారి. బుధవారం కూడా ఆయన డెన్మార్క్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. డెన్మార్క్ రాణి మార్గరెథే2తో సమావేశమవుతారు. అక్కడి భారతీయులతో కలిసి ఇండో డెన్మార్క్ రౌండ్‌టేబుల్ వ్యాపార సమావేశంలో పాల్గొంటారు. డెన్మార్క్‌లో 60కి పైగా భారత కంపెనీలున్నాయి. 16వేల దాకా ప్రవాస భారతీయులున్నారు. ఇండో నార్డిక్ సమావేశం రెండో ఇండియా నార్డిక్ సమావేశంలో మోదీ పాల్గొననున్నారు. నార్డిక్ దేశాలైన డెన్మార్క్, ఐస్లాండ్, ఫిన్లాండ్, స్వీడన్, నార్వే ప్రధానులు ఈ సమావేశానికి హాజరవుతారు. 2018లో జరిగిన తొలి ఇండో నార్డిక్ సదస్సు అనంతరం పురోగతిని సమీక్షిస్తారు. ఆర్థిక రికవరీ, శీతోష్ణస్థితి మార్పు, టెక్నాలజీ, పునర్వినియోగ ఇంధన వనరులు, అంతర్జాతీయ భద్రత, ఆర్కిటిక్ ప్రాంతంలో ఇండో నార్డిక్ సహకారం తదితరాలపై సదస్సు దృష్టి పెడుతుందని మోదీ చెప్పారు. నార్డిక్ ప్రధానులతో మోదీ విడిగా కూడా చర్చిస్తారు. నార్డిక్ దేశాలు, భారత్ మధ్య 2020–21లో 500 కోట్ల డాలర్లకు పైగా వాణిజ్యం జరిగింది. A special start to a special visit. PM @narendramodi was welcomed by PM Frederiksen at Copenhagen. @Statsmin pic.twitter.com/iRnJt6J8k3— PMO India (@PMOIndia) May 3, 2022 యుద్ధం తక్షణం ఆగాలి: మోదీ రష్యా, ఉక్రెయిన్ తక్షణం కాల్పుల విరమణ ప్రకటించాలని మోదీ పిలుపునిచ్చారు. వెంటనే చర్చలతో సంక్షోభానికి తెర దించాలన్నారు. రష్యాపై ప్రభావం చూపగల భారత్ యుద్ధాన్ని ఆపేందుకు డెన్మార్క్ ప్రధాని ఫ్రెడెరిక్సన్ ఆశాభావం వెలిబుచ్చారు. భూమికి భారత్ హాని చేయదు! భారత్ పర్యావరణ విధ్వంసకారి కాదని మోదీ అన్నారు. భూ పరిరక్షణ యత్నాల్లో ముందంజలో ఉంటుందని చెప్పారు. భారత్‌లో పునర్వినియోగ ఇంధన వనరుల వాడకాన్ని ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలను, కాప్ 26 సదస్సుల్లో ఇచ్చిన వాగ్దానాలను వివరించారు. ‘‘2070 నాటికి కర్బన ఉద్గారరహిత దేశంగా రూపొందేందుకు ప్రయత్నిస్తున్నాం. 2030 నాటికి దేశ ఇంధనావసరాల్లో 40 శాతం పునర్వినియోగ ఇంధన వనరుల ద్వారా తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం’’ అని వివరించారు. ప్రతి ప్రవాస భారతీయుడూ కనీసం ఐదుగురు విదేశీ స్నేహితులు భారత్‌ను సందర్శించేలా ప్రోత్సహించాలని సూచించారు. అప్పుడు దేశీయ టూరిజానికి పునర్వైభవం వస్తుందన్నారు. వైవిధ్యమే భారత బలం భారతీయ సమాజానికి సమ్మిళిత, సాంస్కృతిక వైవిధ్యమే బలాన్నిస్తుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ శక్తితోనే భారతీయులు ప్రతి క్షణం జీవిస్తారని, ఈ విలువలే భారతీయుల్లో వేలాది సంవత్సరాలుగా పెంపొందాయని ఆయన చెప్పారు. డెన్మార్క్‌లోని ప్రవాస భారతీయుల సదస్సులో ఆయన ప్రసంగించారు. భారతీయులంతా దేశరక్షణలో భాగస్వాములు కావాలని, జాతి నిర్మాణంలో ప్రతిఒక్కరూ చేతులు కలపాలని ఆయన కోరారు. భారతీయుడు ఏదేశమేగినా ఆ దేశాభివృద్ధికి నిజాయతీగా పనిచేస్తాడన్నారు. ప్రధాని ప్రసంగం సందర్భంగా పలుమార్లు ప్రాంగణమంతా మోదీ, మోదీ అని మారుమోగింది. తాను పలువురు ప్రపంచ నేతలను కలిసానని, వారంతా తమ దేశాల్లో భారతీయుల విజయాలను తనతో పంచుకునేవారని మోదీ చెప్పారు. ప్రవాస భారతీయుల జనాభా కొన్ని దేశాల మొత్తం జనాభా కన్నా అధికమని గుర్తు చేశారు. కరోనా నియంత్రణలు సడలించిన అనంతరం డెన్మార్క్ ప్రధానినే తొలిసారి భారత్‌కు ఆహ్వానించామని గుర్తు చేశారు. చదవండి: ప్రధాని నరేంద్రమోదీ సలహాదారుగా తరుణ్ కపూర్ #WATCH | Prime Minister Narendra Modi and Danish PM Mette Frederiksen hold a conversation at the latter's residence in Copenhagen, Denmark. pic.twitter.com/wUGfJBYcOc— ANI (@ANI) May 3, 2022 ‘Walking the talk’ PM @narendramodi and @Statsmin PM Mette Frederiksen at Marienborg. The bonhomie between the two leaders mirrors the close ties between India and Denmark. pic.twitter.com/bdADrUpUUl— Arindam Bagchi (@MEAIndia) May 3, 2022 -
'బంగారు' వేదాంత్.. డానిష్ ఓపెన్‌లో రెండో పతకం సాధించిన మాధవన్ కొడుకు
కొపెన్‌హగెన్ (డెన్మార్క్): డానిష్ ఓపెన్ అంతర్జాతీయ స్విమ్మింగ్ టోర్నమెంట్లో భారత స్విమ్మర్ వేదాంత్ మాధవన్ మరోసారి మెరిశాడు. నిన్న (ఏప్రిల్ 17) పురుషుల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో రజతం సాధించిన వేదాంత్.. ఇవాళ (ఏప్రిల్ 18) 800 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో బంగారు పతకం సాధించాడు. వేదాంత్ 800 మీటర్ల లక్ష్యాన్ని 8 నిమిషాల 17:28 సెకెన్లలో పూర్తి చేశాడు. వేదాంత్ రజతం పతకం నెగ్గి రోజు తిరగకుండానే పసిడి సాధించడం విశేషం. సినీ నటుడు మాధవన్ కుమారుడైన వేదాంత్ (16) ఇటీవలి కాలంలో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై వరుస పతాకలు సాధిస్తూ సత్తా చాటుతున్నాడు. View this post on Instagram A post shared by R. Madhavan (@actormaddy) గతేడాది జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌లో నాలుగు రజతాలు, మూడు కాంస్య పతకాలు సాధించిన వేదాంత్.. లాత్వియా ఓపెన్‌లో కాంస్యం, తాజాగా డానిష్ ఓపెన్‌లో బంగారు, రజత పతకాలు సాధించాడు. వేదాంత్ అంతర్జాతీయ వేదికలపై వరుస పతకాలు సాధిస్తుండటంతో అతని తండ్రి మాధవన్ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు. మరోవైపు వేదాంత్ సాధించిన విజయాల పట్ల యావత్ భారత చలనచిత్ర సీమ ఆనందం వ్యక్తం చేస్తుంది. దక్షిణాదికి చెందిన మాధవన్.. తెలుగు, తమిళ చిత్రాలతో పాటు బాలీవుడ్‌లోనూ టాప్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు. కాగా, డానిష్ ఓపెన్‌లో కొడుకు సాధించిన ఘనతకు సంబంధించిన వీడియోను మాధవన్ స్వయంగా ఇన్‌స్టాలో షేర్ చేశాడు. చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంప్‌లో కరోనా కల్లోలం.. విదేశీ ఆటగాడికి పాజిటివ్..? -
సజన్‌కు స్వర్ణం... వేదాంత్‌కు రజతం
కొపెన్‌హగెన్ (డెన్మార్క్): డానిష్ ఓపెన్ అంతర్జాతీయ స్విమ్మింగ్ టోర్నమెంట్లో భారత స్విమ్మర్లు సజన్ ప్రకాశ్, వేదాంత్ మెరిశారు. పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ విభాగంలో కేరళకు చెందిన సజన్ ప్రకాశ్ స్వర్ణ పతకం సాధించగా... పురుషుల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో తమిళనాడుకు చెందిన వేదాంత్ రజత పతకం సొంతం చేసుకున్నాడు. సజన్ 200 మీటర్ల లక్ష్యాన్ని ఒక నిమిషం 59.27 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. సినీ నటుడు మాధవన్ కుమారుడైన వేదాంత్ 1500 మీటర్ల లక్ష్యాన్ని 15 నిమిషాల 57.86 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. 16 ఏళ్ల వేదాంత్ గత ఏడాది లాత్వియా ఓపెన్‌లో కాంస్యం నెగ్గగా... జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌లో నాలుగు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం ఏడు పతకాలు సాధించాడు. -
కేజ్రీవాల్ విదేశీ పర్యటనకు అనుమతి నిరాకరణ
న్యూఢిల్లీ: వాతావరణ మార్పుపై డెన్మార్క్‌లో జరుగుతున్న సీ –40 క్లైమేట్ సదస్సులో పాల్గొనాలనుకున్న ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ కేజ్రీవాల్‌కు చుక్కెదురైంది. ఆయన పర్యటనకు విదేశాంగ శాఖ రాజకీయ అనుమతి నిరాకరించిందని అధికార వర్గాలు మంగళవారం తెలిపాయి. దాంతో మంగళవారం కోపెన్‌హెగన్‌కు బయల్దేరాల్సిన ఆయన తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట దెబ్బతింటుందని, ఆప్ అంటే కేంద్రానికి ఎందుకు అంత కోపమని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ విషయమై కేంద్రప్రభుత్వం స్పందించింది. క్లైమేట్ సదస్సు మేయర్ స్థాయి ప్రతినిధులు పాల్గొంటున్న కార్యక్రమం కాబట్టే అనుమతి ఇవ్వలేదని కేంద్రం వివరణ ఇచ్చింది. -
డెన్మార్క్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కోపెన్‌హెగెన్: తెలంగాణా సంప్రదాయ పండుగ అయిన బతుకమ్మ సంబరాలను విదేశాల్లో వైభవంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ సంస్కృతి ఉట్టి పడేలా డెన్మార్క్‌లో తెలంగాణ అసోషియేషన్ ఆఫ్ డెన్మార్క్(టాడ్) అధ్వర్యంలో యూరప్‌లోనే అతిపెద్ద బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారత రాయబారి అజిత్ గుప్త దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సంబరాలకు ఆడపడుచులు అధిక సంఖ్యలో బతుకమ్మలను తీసుకువచ్చి ఆట పాటలతో, కోలాటాల విన్యాసాలతో ఆనందంగా పాల్గొన్నారు. స్థానికంగా దొరికే వివిధ రకాల పుష్పాలతో బతుకమ్మలను అలంకరించి, సంప్రదాయ పరంగా బతుకమ్మల చుట్టూ ఆడపడుచులు తిరుగుతూ పాటలు పాడారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టాడ్ అధ్యక్షుడు సామ సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రకృతిని, పూలను, పూలలో దేవతలను పూజించే ఆడపడుచుల పండగ బతుకమ్మ అని, పాల్గొన్న ప్రతీ ఒక్కరికి బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలిపారు. బ్రెగ్జిట్ తర్వాత యూరప్‌లో టాడ్ అతిపెద్ద అసోషియేషన్‌గా అవతరించి 4 వసంతాలు పూర్తి చేసుకొని, తెలంగాణ పండగలను పెద్ద ఎత్తున జరుపుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టాడ్ బోర్డు సభ్యులు సంగమేష్వర్ రెడ్డి, రమేష్ పగిల్ల, జయచందర్ రెడ్డి కంది, వాసు నీల, దాము లట్టుపల్లి, వెంకటేష్, రాజారెడ్డి, రఘు కంకుంట్ల, రాజు ముచంతుల, కర్నాకర్, నర్మద దేరెడ్డి, ఉష, ప్రీమియం సభ్యులు, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు. -
డెన్మార్క్‌లో టాడ్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
కోపెన్ హాగెన్: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ డెన్మార్క్(టాడ్) ఆధ్వర్యంలో డెన్మార్క్ రాజధాని నగరం కోపెన్ హాగెన్‌లో శ్రీ విళంబినామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంప్రదాయ పద్ధతులలో పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి, భక్షాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డెన్మార్క్‌లో ఉన్న ప్రవాస తెలుగు వారు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉగాది పర్వదినాన్ని జరుపుకొన్నారు. ఈ ఉత్సవాలు టాడ్ అధ్యక్షులు సామ సతీష్ రెడ్డి, ఉపాధ్యక్షులు సంగమేశ్వర్ రెడ్డి, సెక్రటరీ రమేష్ పగిళ్ళ, కోశాధికారి జయచందర్ రెడ్డి, టెక్నికల్ మేనేజర్ వెంకటేష్, కార్యవర్గ సభ్యులు వాసు, దాము, రాజారెడ్డి, శివసాగర్, శ్రీనివాస్, రఘు, కరుణాకర్, రాజు, నర్మద, ఉష, ప్రీమియం సభ్యులు, తదితరుల సహకారంతో వేడుక ఘనంగా జరిగింది. -
ప్రమాదం కాదు.. పక్కాప్లాన్‌తోనే చేశాడు
కొపెన్‌హాగన్: గ్యాస్ లీకై కుటుంబం మొత్తం చనిపోయిన ప్రమాదానికి సంబంధించి మీడియాల్లో వచ్చిన కథనాలు సరికాదని తెలిసింది. ఈ ఘటనపై డెన్మార్క్ పోలీసులు విస్తుపోయే నిజాలు తెలిపారు. ఇంటి యజమానే తన భార్యను, నలుగురి పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పారు. డెన్మార్క్ రాజధాని కొపెన్‌హాగన్ కు 185 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామంలో ఓ కుటుంబం మొత్తం అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. అయితే, గ్యాస్ లీకై వారు చనిపోయనట్లు కథనాలు వచ్చాయి. ఈ ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. అయితే, వారిని ఎలా అతడు హత్య చేశాడనే విషయం మాత్రం పోలీసులు వివరించలేదు. చనిపోయిన చిన్నారుల్లో ఇద్దరు బాలురు, మరో ఇద్దరు బాలికలు ఉన్నారు. భార్య వయస్సు 42 సంవత్సరాలు ఉంటుందని, పిల్లల వయస్సు మూడు నుంచి 16సంవత్సరాలలోపు ఉంటుందని డెన్మార్క్ పోలీసులు స్పష్టం చేశారు. -
ఈ బస్సును చూస్తే.. కళ్లు గిరగిరా తిరిగేస్తాయ్!
కళ్లు గిరగిరా తిరగడం.. చాలామందికి అనుభవం ఉండి ఉంటుంది. కానీ డెన్మార్క్‌లో ఓ బస్సును చూస్తే చాలామందికి కళ్లు గిరగిరా తిరుగుతున్నాయి. అందుకు కారణం లేకపోలేదు. ఆ బస్సుకు ఉన్న రెండు కళ్లు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అవి ఎవరి కళ్లో కాదు.. సాక్షాత్తు అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్ కళ్లు... డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగ్‌లో నిత్యం తిరుగుతూ ఈ బస్సు హల్చల్ చేస్తోంది. ఇంతకు అసలు విషయమేమిటంటే డెన్మార్క్‌కు చెందిన వామపక్ష పార్టీ అయిన సోషలిస్ట్ పీపుల్స్ పార్టీ డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేపట్టాలని నిర్ణయించింది. విదేశాల్లో ఉన్న అమెరికన్ ఓటర్లు ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరాలనుకుంది. ఇందుకోసమే ఈ విచిత్రమైన బస్సును రోడ్లమీదకు దిపింది. ’అమెరికన్స్ అబ్రాడ్ వోట్’ అని రాసి.. ప్రత్యేకంగా డిజైన్ చేసింది. అంతేకాకుండా అందరినీ ఆకట్టుకునేలా బస్సుపై డొనాల్డ్ ట్రంప్ బొమ్మ సగం వరకు వేసి.. వెనుకవైపు ఉన్న రెండు టైర్లను ఆయన కనుగుడ్లరూపంలో చిత్రించింది. దీంతో బస్సు నడిచినప్పుడు ట్రంప్ కళ్లు గిరగిరా తిగిరినట్టు కనిపించి చూపరులను ఆకట్టుకుంటోంది. ట్రంప్ వ్యతిరేకంగా చేపడుతున్న ఈ బస్సు ప్రచారం బాగానే జనాలకు చేరుతున్నదని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారట. -
వరల్డ్ బ్యాడ్మింటన్: సెమీఫైనల్లోకి ప్రవేశించిన సింధు
కోపెన్‌హాగెన్‌లో జరుగుతున్న వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలుగు తేజం వెల్లి విరిసింది. పుసర్ల వెంకట సింధు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. చైనాకు చెందిన సెకండ్ సీడ్ వాంగ్ షిజియాన్‌పై 19-21, 21-19, 21-15 స్కోరుతో సింధు జయభేరి మోగించింది. పదకొండో సీడ్ సింధు ఫస్ట్ గేమ్‌లో పోరాడి స్వల్ప తేడాతో ఓడినప్పటికీ, మిగతా రెండు గేముల్లో దుమ్ము రేపింది. నిరుడు గ్వాంగ్జావులో జరిగిన వరల్డ్ కప్‌లో కాంస్య పతకాన్ని గెలిచిన సింధు, ఇప్పుడు మరో మెడల్‌ను గ్యారంటీ చేసుకుంది. అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్లో సైనా నెహ్వాల్ రెండు వరుస గేముల్లో 21-15, 21-15 స్కోరుతో టాప్ సీడ్ లీ షురాయ్ చేతిలో ఓడిపోయింది. -
ఫుట్‌బాల్‌తో మధుమేహం దూరం!
లండన్: మధుమేహాన్ని నియంత్రించుకోవాలని అనుకుంటున్నారా? గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవాలని ఉందా? అయితే ఫుట్‌బాల్‌తో మైదానంలోకి దూకండి. ఫుట్‌బాల్ ఆటతో టైప్ 2 డయాబెటీస్‌ను, గుండెపోటు ముప్పును తగ్గించుకోవచ్చని డెన్మార్క్‌లోని కోపెన్‌హాగెన్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. హైబీపీ, టైప్ 2 మధుమేహంతో బాధపడుతున్న 53 మంది పురుషులకు (30 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కులు) వారానికి రెండుసార్లు చొప్పున 24 వారాలపాటు ఫుట్‌బాల్ శిక్షణా తరగతులు నిర్వహించగా వారిలో బ్లడ్ షుగర్ లెవెల్స్ (రక్తంలో చక్కెర స్థాయి) 20 శాతం మేర, పొట్టలోని కొవ్వు 12 శాతం మేర తగ్గిందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించి న ప్రొఫెసర్ జెన్స్ బంగ్స్బో తెలిపా రు. అలాగే హైబీపీ కూడా నియంత్రణలోకి వచ్చిందన్నారు. అంతిమంగా వారిలో మధుమేహం, హైబీపీ మందుల వాడకం అవసరం తగ్గిందని చెప్పారు. ఈ అధ్యయనం ఫలితాలను స్కాండనేవియన్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ అండ్ సైన్స్ ప్రచురించింది. చిన్న లక్ష్యాలతో చిన్నారుల్లో ఊబకాయానికి చెక్! వాషింగ్టన్: చిన్నపాటి లక్ష్యాలతో మీ చిన్నారి ఊబకాయాన్ని తగ్గించే అంశాలను లూసియానా స్టేట్ యూనివర్సిటీ హెల్త్ సైన్స్ సెంటర్ శాస్త్త్రవేత్తలు గుర్తిం చారు. మూడే మూడు లక్ష్యాలు నిర్దేశించుకుంటే చాలు.. చిన్నారుల్లో ఊబ కాయం, మానసిక సమస్యలను దూ రం చేయొచ్చు. ఎక్కువ కాలరీల పదార్థాలను తినకుండా నియంత్రించడం, తక్కువగా కూర్చోవడం, ఎలక్ట్రానిక్ పరికరాల వాడకాన్ని తగ్గించడం ద్వారా చిన్నారుల్లో ఊబకాయం వంటి సమస్యలను దూరం చేయవచ్చని శాస ్తవ్రేత్తలు తెలిపారు.