![Assault On Denmark Prime Minister](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/06/8/denmarkpm.jpg.webp?itok=t4dbQWML)
కోపెన్‌హగన్: డెన్‌మార్క్ ప్రధాని ఫ్రెడ్రిక్సెన్‌పై దాడి జరిగింది. కోపెన్‌హాగన్ స్క్వేర్ వద్ద ప్రధానిపై దుండగుడు ఒక్కసారిగా దాడికి దిగాడు. ఈ ఘటనతో ప్రధాని షాక్‌కు గురైనట్లు ఆమె కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
దాడికి దిగిన వ్యక్తిని అరెస్టు చేశారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. దాడి జరిగిన వెంటనే ప్రధానిని సెక్యూరిటీ సిబ్బంది అక్కడి నుంచి తీసుకెళ్లారని ఘటనకు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
ప్రధానిపై దాడి తమను కలిచివేసిందని పర్యావరణ మంత్రి ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు. మూడు వారాల క్రితమే యూరప్ దేశం స్లొవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై దుండగులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment