లండన్: మధుమేహాన్ని నియంత్రించుకోవాలని అనుకుంటున్నారా? గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవాలని ఉందా? అయితే ఫుట్‌బాల్‌తో మైదానంలోకి దూకండి. ఫుట్‌బాల్ ఆటతో టైప్ 2 డయాబెటీస్‌ను, గుండెపోటు ముప్పును తగ్గించుకోవచ్చని డెన్మార్క్‌లోని కోపెన్‌హాగెన్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. హైబీపీ, టైప్ 2 మధుమేహంతో బాధపడుతున్న 53 మంది పురుషులకు (30 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కులు) వారానికి రెండుసార్లు చొప్పున 24 వారాలపాటు ఫుట్‌బాల్ శిక్షణా తరగతులు నిర్వహించగా వారిలో బ్లడ్ షుగర్ లెవెల్స్ (రక్తంలో చక్కెర స్థాయి) 20 శాతం మేర, పొట్టలోని కొవ్వు 12 శాతం మేర తగ్గిందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించి న ప్రొఫెసర్ జెన్స్ బంగ్స్‌బో తెలిపా రు. అలాగే హైబీపీ కూడా నియంత్రణలోకి వచ్చిందన్నారు. అంతిమంగా వారిలో మధుమేహం, హైబీపీ మందుల వాడకం అవసరం తగ్గిందని చెప్పారు. ఈ అధ్యయనం ఫలితాలను స్కాండనేవియన్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ అండ్ సైన్స్ ప్రచురించింది.
చిన్న లక్ష్యాలతో చిన్నారుల్లో ఊబకాయానికి చెక్!
వాషింగ్టన్: చిన్నపాటి లక్ష్యాలతో మీ చిన్నారి ఊబకాయాన్ని తగ్గించే అంశాలను లూసియానా స్టేట్ యూనివర్సిటీ హెల్త్ సైన్స్ సెంటర్ శాస్త్త్రవేత్తలు గుర్తిం చారు. మూడే మూడు లక్ష్యాలు నిర్దేశించుకుంటే చాలు.. చిన్నారుల్లో ఊబ కాయం, మానసిక సమస్యలను దూ రం చేయొచ్చు. ఎక్కువ కాలరీల పదార్థాలను తినకుండా నియంత్రించడం, తక్కువగా కూర్చోవడం, ఎలక్ట్రానిక్ పరికరాల వాడకాన్ని తగ్గించడం ద్వారా చిన్నారుల్లో ఊబకాయం వంటి సమస్యలను దూరం చేయవచ్చని శాస ్తవ్రేత్తలు తెలిపారు.
ఫుట్‌బాల్‌తో మధుమేహం దూరం!
Published Sun, Jun 15 2014 2:03 AM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM
Advertisement