ఈ బస్సును చూస్తే.. కళ్లు గిరగిరా తిరిగేస్తాయ్‌! | Copenhagen bus has Trump rolling his eyes | Sakshi
Sakshi News home page

ఈ బస్సును చూస్తే.. కళ్లు గిరగిరా తిరిగేస్తాయ్‌!

Published Sat, Oct 29 2016 2:26 PM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

ఈ బస్సును చూస్తే.. కళ్లు గిరగిరా తిరిగేస్తాయ్‌! - Sakshi

ఈ బస్సును చూస్తే.. కళ్లు గిరగిరా తిరిగేస్తాయ్‌!

కళ్లు గిరగిరా తిరగడం.. చాలామందికి అనుభవం ఉండి ఉంటుంది. కానీ డెన్మార్క్‌లో ఓ బస్సును చూస్తే చాలామందికి కళ్లు గిరగిరా తిరుగుతున్నాయి. అందుకు కారణం లేకపోలేదు. ఆ బస్సుకు ఉన్న రెండు కళ్లు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అవి ఎవరి కళ్లో కాదు.. సాక్షాత్తు అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న డొనాల్డ్‌ ట్రంప్‌ కళ్లు... డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హాగ్‌లో నిత్యం తిరుగుతూ ఈ బస్సు హల్‌చల్‌ చేస్తోంది.

ఇంతకు అసలు విషయమేమిటంటే డెన్మార్క్‌కు చెందిన వామపక్ష పార్టీ అయిన సోషలిస్ట్‌ పీపుల్స్‌ పార్టీ డొనాల్డ్‌ ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేపట్టాలని నిర్ణయించింది. విదేశాల్లో ఉన్న అమెరికన్‌ ఓటర్లు ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరాలనుకుంది. ఇందుకోసమే ఈ విచిత్రమైన బస్సును రోడ్లమీదకు దిపింది. ’అమెరికన్స్‌ అబ్రాడ్‌ వోట్‌’ అని రాసి.. ప్రత్యేకంగా డిజైన్‌ చేసింది. అంతేకాకుండా అందరినీ ఆకట్టుకునేలా బస్సుపై డొనాల్డ్‌ ట్రంప్‌ బొమ్మ సగం వరకు వేసి.. వెనుకవైపు ఉన్న రెండు టైర్లను ఆయన కనుగుడ్లరూపంలో చిత్రించింది. దీంతో బస్సు నడిచినప్పుడు ట్రంప్‌ కళ్లు గిరగిరా తిగిరినట్టు కనిపించి చూపరులను ఆకట్టుకుంటోంది. ట్రంప్‌ వ్యతిరేకంగా చేపడుతున్న ఈ బస్సు ప్రచారం బాగానే జనాలకు చేరుతున్నదని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement