వరల్డ్‌ బ్యాడ్మింటన్‌: సెమీఫైనల్లోకి ప్రవేశించిన సింధు | Sindhu entered semi finals in World Championship | Sakshi
Sakshi News home page

వరల్డ్‌ బ్యాడ్మింటన్‌: సెమీఫైనల్లోకి ప్రవేశించిన సింధు

Published Sat, Aug 30 2014 5:32 PM | Last Updated on Sat, Sep 2 2017 12:38 PM

పుసర్ల వెంకట సింధు

పుసర్ల వెంకట సింధు

కోపెన్‌హాగెన్‌లో జరుగుతున్న వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో తెలుగు తేజం వెల్లి విరిసింది.  పుసర్ల వెంకట సింధు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. చైనాకు చెందిన సెకండ్‌ సీడ్‌ వాంగ్‌ షిజియాన్‌పై 19-21, 21-19, 21-15 స్కోరుతో సింధు జయభేరి మోగించింది. పదకొండో సీడ్‌ సింధు ఫస్ట్‌ గేమ్‌లో పోరాడి స్వల్ప తేడాతో ఓడినప్పటికీ, మిగతా రెండు గేముల్లో  దుమ్ము రేపింది.

నిరుడు గ్వాంగ్జావులో జరిగిన వరల్డ్‌ కప్‌లో కాంస్య పతకాన్ని గెలిచిన సింధు, ఇప్పుడు మరో మెడల్‌ను గ్యారంటీ చేసుకుంది. అంతకుముందు జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో సైనా నెహ్వాల్‌ రెండు వరుస గేముల్లో 21-15, 21-15 స్కోరుతో టాప్‌ సీడ్‌ లీ షురాయ్‌ చేతిలో ఓడిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement