కొపెన్‌హాగన్: గ్యాస్ లీకై కుటుంబం మొత్తం చనిపోయిన ప్రమాదానికి సంబంధించి మీడియాల్లో వచ్చిన కథనాలు సరికాదని తెలిసింది. ఈ ఘటనపై డెన్మార్క్ పోలీసులు విస్తుపోయే నిజాలు తెలిపారు. ఇంటి యజమానే తన భార్యను, నలుగురి పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పారు. డెన్మార్క్ రాజధాని కొపెన్‌హాగన్ కు 185 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామంలో ఓ కుటుంబం మొత్తం అనుమానాస్పద స్థితిలో చనిపోయింది.
అయితే, గ్యాస్ లీకై వారు చనిపోయనట్లు కథనాలు వచ్చాయి. ఈ ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. అయితే, వారిని ఎలా అతడు హత్య చేశాడనే విషయం మాత్రం పోలీసులు వివరించలేదు. చనిపోయిన చిన్నారుల్లో ఇద్దరు బాలురు, మరో ఇద్దరు బాలికలు ఉన్నారు. భార్య వయస్సు 42 సంవత్సరాలు ఉంటుందని, పిల్లల వయస్సు మూడు నుంచి 16సంవత్సరాలలోపు ఉంటుందని డెన్మార్క్ పోలీసులు స్పష్టం చేశారు.
ప్రమాదం కాదు.. పక్కాప్లాన్‌తోనే చేశాడు
Published Wed, Jan 11 2017 6:06 PM | Last Updated on Wed, Aug 29 2018 8:36 PM
Advertisement