శ్రీనివాస్‌ హత్యతో సంబంధం లేదు: ఎమ్మెల్యే వీరేశం | no connection to Srinivas murder: MLA Veeresham | Sakshi
Sakshi News home page

శ్రీనివాస్‌ హత్యతో సంబంధం లేదు: ఎమ్మెల్యే వీరేశం

Jan 30 2018 12:39 PM | Updated on Aug 29 2018 4:18 PM

సాక్షి, నల్లగొండ: నల్లగొండ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో తనకెలాంటి సంబంధం లేదని స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి బ్రదర్స్ శవ రాజకీయాలు చేస్తున్నారని, సీబీఐ విచారణ జరిపించినా అభ్యంతరం లేదని అన్నారు. నమ్మిన వారే హత్య చేశారని మృతుడి భార్యే చెప్పిందన్నారు. అదనపు గన్‌మెన్‌లు కావాలని డీజీపీని కోరిన కోమటిరెడ్డి శ్రీనివాస్‌ కుటుంబానికి రక్షణ కావాలని ఎందుకు కోరలేదని ఆయన ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న ఈ మూడున్నరేళ్ల తన ఫోన్‌ కాల్ డేటా బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. హత్యా రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌ కాం​గ్రెస్సేనని, నయీమ్‌ను పెంచి పోషించింది కాంగ్రెస్‌ పార్టీనే అని వేముల ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement