సాధ్వీ ప్రజ్ఞ కు చుక్కెదురు | Malegaon Accused Sadhvi Pragya Denied Bail, Court Questions Clean Chit | Sakshi
Sakshi News home page

సాధ్వీ ప్రజ్ఞ కు చుక్కెదురు

Published Tue, Jun 28 2016 7:26 PM | Last Updated on Mon, Sep 4 2017 3:38 AM

Malegaon Accused Sadhvi Pragya Denied Bail, Court Questions Clean Chit

ముంబై: మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో నిందితురాలిగా జైలులో ఉన్న సాధ్వి ప్రజ్ఞాసింగ్ కు కోర్టులో చుక్కెదురైంది. ఆమెకు బెయిల్ ఇవ్వడానికి ముంబై స్పెషల్ కోర్టు నిరాకరించింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)మాలెగావ్ పేలుళ్ల కేసు విచారణ నుంచి తప్పు కోవడాన్ని కోర్టు ప్రశ్నించింది. కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాతే బెయిల్ ఇస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది.

కాగా కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళతామని సాధ్వి కుటుంబ సభ్యులు తెలిపారు. 2008లో మహారాష్ట్ర్రలోని మాలెగావ్ లో బాంబు  పేలుళ్లలో ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇందులో నిందితులుగా పేర్కొంటూ సాధ్వితో పాటు మరికొంత మందిపై మోకా చట్టం కింద కేసును  విచారిస్తున్నజాతీయదర్యాప్తు సంస్థ సరైన సాక్షాదారాలు లేవనే కారణంతో  కేసునుంచి విత్ డ్రా అయింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement