శరత్ చంద్రారెడ్డి(ఎడమ), విజయ్ నాయర్(కుడి)
సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన నిందితులకు ఊరట దక్కలేదు. మనీలాండరింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయిన ఐదుగురికి గురువారం బెయిల్ నిరాకరించింది కోర్టు.
లిక్కర్ స్కాంలో విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, సమీర్ మహేంద్రు, శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబులను దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. అయితే బెయిల్ కోసం వీళ్లు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ Rouse Avenue Court కోర్టును ఆశ్రయించగా.. కోర్టు బెయిల్‌కు తిరస్కరించింది.
123 పేజీలతో కూడిన తీర్పును వెలువరించారు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నాగ్‌పాల్. ఐదుగురు నిందితులపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి. నిందితులు మనీలాండరింగ్ చట్టంలోని సెక్షన్ 3 కింద.. ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు. కాబట్టి, ఈ ఐదుగురు నిందితులు బెయిల్‌కు అర్హులు కాదు. అందుకే బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తున్నాం అని స్పెషల్ కోర్టు న్యాయమూర్తి వెల్లడించారు.
Delhi's Rouse Avenue Court dismisses bail petitions of Vijay Nair, Abhishek Bonipally, Sameer Mahendru, Sarath P Reddy and Binoy Babu who were arrested in the money laundering probe emerging out of the Delhi govt new excise policy case
— ANI (@ANI) February 16, 2023
Comments
Please login to add a commentAdd a comment