వీణవంక(హుజూరాబాద్): రైతు సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మండలంలోని చల్లూరు గ్రామంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. బేతిగల్ గ్రామానికి చెందిన దాసరి జయప్రకాశ్ మృతిచెంది ఆరు నెలలు గడిచినా.. ఇంతవరకు చర్యలు చేపట్టలేదని అన్నారు. జయప్రకాశ్‌ను హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చొప్పదండిలోని ఓ సర్పంచ్ సమస్యలపై నిలదీస్తే రౌడీషీట్ ఓపెన్ చేశారని, సమస్యలను కూడా అడిగే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేకుండాపోయిందని అన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇప్పటివరకు ప్రారంభించలేదని, కొందరు గత్యంతరం లేక దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. జిల్లా నాయకుడు చెన్నమాదవుని నరసింహారాజు, మండల అధ్యక్షుడు బత్తిని నరేశ్‌గౌడ్, యువ మోర్చా మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, జిల్లా నాయకులు సాగర్‌రెడ్డి, ఆదిరెడ్డి, దామోదర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment