
సాక్షి, వికారాబాద్: తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి అవమానం ఎదురైంది. ఆయన మంగళవారం తాండూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి హాజరు కాగా.. ఆయన రాకపై టీఆర్ఎస్ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. కనీసం ఎమ్మెల్యేగా కూడా ప్రమాణం చేయకుండా రోహిత్ రెడ్డి మున్సిపల్ సమావేశానికి ఎలా హాజరవుతారని ప్రశ్నించారు. ఆయన తీరును తప్పుబడుతూ.. టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా నోరుజారిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి.. ఏ పిచ్చి నా కొడుకులు చెప్పారంటూ దురుసుగా వ్యాఖ్యలు చేశారు.
మున్సిపల్ కమిషనర్‌కు సైతం ఆయన క్లాస్ తీసుకున్నారు. టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు నాన్సెన్స్ క్రియేట్ చేశారంటూ మండిపడ్డారు. అంతకుముందు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి కౌన్సిలర్లు సన్మానం చేశారు. ఇంతవరకు బాగానే ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన తర్వాతే కౌన్సిల్ సమావేశాలకు రావాలంటూ టీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుతం కౌన్సిల్ సమావేశం కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment