counselors
-
ఢిల్లీ కాంగ్రెస్‌లో అర్ధరాత్రి హైడ్రామా.. పెద్ద పొరపాటు చేశానంటూ..!
న్యూఢిల్లీ: ఢిల్లీ కాంగ్రెస్‌లో శుక్రవారం అర్ధరాత్రి హైడ్రామా అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే పార్టీకి షాక్ ఇస్తూ ఢిల్లీ ఉపాధ్యక్షుడు అలీ మెహది, పార్టీ నుంచి కొత్తగా ఎన్నికైన ఇద్దరు కౌన్సిలర్లు సబిలా బేగం, నాజియా ఖాటూన్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పనితీరు నచ్చడం వల్లే వాళ్లు తాము ఆప్‌లో చేరాలని నిర్ణయించుకున్నామని అలీ మెహది చెప్పారు. రాజధాని అభివృద్ధిలో తామూ భాగస్వాములవుతామన్నారు. కార్పొరేషన్ ఎన్నికలకు ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదని పేర్కొన్నారు. పెద్ద పొరపాటు చేశానంటూ క్షమాపణలు ఆ తర్వాత కొద్ది గంటల్లోనే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు అలీ మెహది. తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు శుక్రవారం అర్ధరాత్రి ప్రకటించారు. తాను పెద్ద పొరపాటు చేశానంటూ క్షమాపణలు చెబుతూ ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. తాను రాహుల్ గాంధీ నమ్మకస్తుడినైన కార్మికుడిగా పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన ముస్తఫాబాద్, బ్రిజ్‌పురి కౌన్సిలర్లు సబిలా బేగం, నాజియా ఖాటూన్‌లు సైతం తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చినట్లు వీడియో ద్వారా వెల్లడించారు. అర్ధరాత్రి 1.25 గంటలకు వీడియో పోస్ట్ చేశారు అలీ మెహది.. చేతులు జోడించి ‘నేను పెద్ద పొరపాటు చేశాను. కాంగ్రెస్ పార్టీకి ఎంతో నమ్మకస్తుడిగా ఉన్నాను. నా తండ్రి 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు’ అంటూ పేర్కొన్నారు. పలుమార్లు పార్టీ అధిష్ఠానానికి, కార్యకర్తలకు క్షమాపణలు చెప్పారు. తనతో వచ్చిన కౌన్సిలర్లు సైతం క్షమాపణలు చెబుతూ వీడియోలు విడుదల చేయాలని కోరారు. వీడియో విడుదల చేసిన గంటన్నర తర్వాత మరో ట్వీట్ చేశారు అలీ మెహది. ‘బ్రిజ్‌పురి కౌన్సిలర్ నాజియా ఖాటూన్, ముస్తఫాబాద్ కౌన్సిలర్ సబిలా బేగం, 300 ఓట్ల మార్క్‌తో ఓడిపోయిన బ్లాక్ ప్రెసిడెంట్ అలీమ్ అన్సారీ ఇప్పటికీ రాహుల్ జీ, ప్రియాంక జీలకు నమ్మకమైన కార్మికులు. రాహుల్ గాంధీ జిందాబాద్.’ అని పేర్కొన్నారు. వీడియోలో కనిపించిన మరో ముగ్గురు సైతం ఆప్‌ను కలిశారు. श्री @RahulGandhi जी के जो सच्चे सिपाही होते हैं उन्हें कुछ समय के लिए दिग्भ्रमित किया जा सकता है लम्बे समय के लिए नहीं। शुक्रिया भाई @alimehdi_inc जी का जिन्होंने कुछ पल में ही गलती सुधार ली। आप कांग्रेस के जन्मजात सच्चे सिपाही हो, गलती इंसान से हो जाती है। @INCDelhi pic.twitter.com/UaqMUQGjMZ — Minnat Rahmani (@MRahmaniINC) December 10, 2022 ఇదీ చదవండి: Manneguda Young Woman Kidnap Case: రహస్య ప్రాంతంలో వైశాలి.. జాడలేని నవీన్ రెడ్డి -
ప్రాణాలు తీస్తున్న ఒత్తిడి, పోలిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మార్కుల భూతం మరో విద్యార్థిని బలితీసుకుంది. 20 రోజుల కిందట ఇంటర్లో తనకు వచ్చిన మార్కులు చూసుకొని కలత చెంది పురుగుల మందు తాగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మానస (17) అనే టీనేజర్ మంగళవారం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. దీంతో ఇప్పటివరకూ చనిపోయిన ఇంటర్ విద్యార్థుల సంఖ్య 24 వరకు చేరిందని సమాచారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏ ఏడాదిలోనూ ఇంత భారీ సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడలేదు. ఐదేళ్లలో ఒకసారి కూడా ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు రెండంకెలు దాటిన దాఖలాలూ లేవు. కానీ ఈసారి ఏకంగా 24 మంది విద్యార్థులు కేవలం ఇంటర్లో ఫెయిలయ్యామన్న కారణంతో ప్రాణాలు తీసుకోవడం వారి తల్లిదండ్రులను తీవ్రంగా కలిచివేస్తోంది. ఒత్తిడి, పోలికే ప్రధాన కారణాలు.. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటకలో ఇంటర్, ఆ తర్వాత ఇంజనీరింగ్ మాత్రమే చదవాలన్న ధోరణి అధికం. ఎంసెట్, జేఈఈ, నీట్ అంటూ రకరకాల ఎంట్రన్స్‌లు రాస్తూ విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సులో జాయిన్ అవ్వాలని అనుకుంటారు. వారికి ఇష్టం ఉన్నా లేకున్నా తల్లిదండ్రులు, సమాజం వారిని ఇంజనీరింగ్ వైపు నడిపిస్తున్నారు. ర్యాంకుల కోసం బలవంతంగా రోజుకు 18 గంటలపాటు చదివించే అనుమతి లేని కార్పొరేట్ హాస్టళ్లలో ఉంచుతున్నారు. ఫలితంగా విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవు తున్నారు. పోటీ ప్రపంచంలో కొట్టుకుపోతూ 90% మార్కులు సాధించినా రోజుల తరబడి విలపించేంతగా మానసికంగా కుంగిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం పక్కవారితో తమను తాము పోల్చుకోవడం, తల్లిదండ్రులు కూడా ఇతర విద్యార్థులతో పోల్చి వారిని కించపరచడం. ఇవి చాలవన్నట్లు కుటుంబంలో, కాలేజీల్లో ఉన్న ఒత్తిడితో పిల్లలు ఫెయిలవడాన్ని తీవ్ర అవమానంగా భావిస్తూ ప్రాణాలు తీసుకుంటున్నారు. రైతులు, మహిళల తరువాత విద్యార్థులే.. దేశంలో జరిగే ఆత్మహత్యల్లో రైతులు, మహిళలు తొలి రెండు స్థానాల్లో ఉండగా మూడోస్థానం విద్యార్థులదేనని గణాంకాలు చెబుతున్నాయి. 2016లో నేషనల్ క్రైమ్‌బ్యూరో రికార్డ్స్ (ఎన్సీఆర్బీ) ప్రకారం దేశంలో 1,34,000 మందికిపైగా భారతీయులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో 15 నుంచి 39 ఏళ్లలోపు వారే అధికం. వారిలో రైతులు, మహిళల తరువాత విద్యార్థులే నిలవడం గమనార్హం. ఏటేటా పెరుగుతున్న ఆత్మహత్యలు... పోలీసుల గణాంకాల ప్రకారం తెలంగాణలో ఇప్పటివరకు 42 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారిలో 18 మంది బాలురు కాగా, 24 మంది బాలికలు కావడం గమనార్హం. ఏటేటా ఈ సంఖ్య పెరుగుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఒక్క ఈ ఏడాదిలోనే ఏప్రిల్ 24 వరకు 15 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈ సంఖ్య 24 దాటిందని సమాచారం. గత ఐదేళ్లలో 50 మందికిపైగా ఇంటర్ విద్యార్థులు అర్ధంతరంగా తనువు చాలించారు. కాలేజీల్లో కౌన్సెలర్లు ఎక్కడ? ప్రతి ఇంటర్ కాలేజీలోనూ విద్యార్థుల మానసిక పరిస్థితిని గమనించేందుకు కౌన్సెలర్ ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ ఎక్కడా ఈ నిబంధనను పట్టించుకున్న దాఖలాలు లేవు. తక్కువ మార్కులు వచ్చిన లేదా ఇంటి బెంగ, ఇష్టంలేని కోర్సు చదువుతున్న విద్యార్థులను గుర్తించి కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల మానసిక పరిస్థితిపై తల్లిదండ్రులకు వివరించాల్సిన అవసరం ఉంది. కానీ ఇలాంటి నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. ఒత్తిడి సరికాదు ఏ విద్యార్థినీ ఇతరులతో పోల్చడం సరికాదు. ఒక్కొక్కరిలో ఒక్కో టాలెంట్ దాగి ఉంటుంది. గానం, సంగీతం, క్రీడలు ఇవన్నీ ప్రతి భారంగాలే కదా! వాటిని వదిలి అందరినీ ఇంజనీర్లు, డాక్టర్లు కావాలంటూ ఒత్తిడి చేయడం సబబుకాదు. పిల్లలపై ఇలా ఒత్తిడి తీసుకురావడంతో తీవ్ర అవమాన భారంతో కుంగిపోతున్నారు. అలాంటి వారికి తల్లిదండ్రులు బాసటగా నిలిచి ధైర్యం చెప్పాలి. వారు అభిరుచి ఉన్న రంగంలో రాణించేలా ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయి. – స్వాతి లక్రా, ఐజీ, విమెన్స్ ప్రొటెక్షన్ వింగ్ -
కాంగ్రెస్ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి అవమానం
సాక్షి, వికారాబాద్: తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి అవమానం ఎదురైంది. ఆయన మంగళవారం తాండూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి హాజరు కాగా.. ఆయన రాకపై టీఆర్ఎస్ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. కనీసం ఎమ్మెల్యేగా కూడా ప్రమాణం చేయకుండా రోహిత్ రెడ్డి మున్సిపల్ సమావేశానికి ఎలా హాజరవుతారని ప్రశ్నించారు. ఆయన తీరును తప్పుబడుతూ.. టీఆర్ఎస్ కౌన్సిలర్లు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా నోరుజారిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి.. ఏ పిచ్చి నా కొడుకులు చెప్పారంటూ దురుసుగా వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ కమిషనర్‌కు సైతం ఆయన క్లాస్ తీసుకున్నారు. టీఆర్ఎస్ కౌన్సిలర్లు నాన్సెన్స్ క్రియేట్ చేశారంటూ మండిపడ్డారు. అంతకుముందు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి కౌన్సిలర్లు సన్మానం చేశారు. ఇంతవరకు బాగానే ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన తర్వాతే కౌన్సిల్ సమావేశాలకు రావాలంటూ టీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుతం కౌన్సిల్ సమావేశం కొనసాగుతోంది. -
కౌన్సిలర్లే అవినీతి పరులు
ఎమ్మెల్యే కురుగొండ్ల వివాదాస్పద వ్యాఖ్యలు వెంకటగిరి: వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో జరిగిన అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టర్లు ఇచ్చిన కమీషన్లు తమ పార్టీ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్పర్సన్లకే అందాయని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. శనివారం ఆయన పట్టణంలోని పాలకేంద్రం సెంటర్లో ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పత్రికలు, టీవీ చానళ్లలో తనను అవినీతి పరుడిగా చిత్రిస్తూ వచ్చిన కథనాలపై ఆయన ఘాటుగా స్పందించారు. నాలుగేళ్లలో వెంకటగిరిలో గణనీయమైన అభివృద్ధి జరిగిందని, వీటికి సంబంధించి కాంట్రాక్టర్ల నుంచి తానేమీ తీసుకోలేదన్నా రు. అనంతరం అక్కడే ఉన్న మున్సిపల్ కాంట్రాక్టర్ సుబ్రహ్మణ్యంనాయుడుతో కమీషన్లు తీసుకున్న వ్యక్తుల పేర్ల చెప్పాలని హుకుం జారీ చేశారు. దీంతో సుబ్రహ్మణ్యంనాయుడు తటపటాయిస్తూ కౌన్సిల ర్లు, చైర్పర్సన్లకు కమీషన్లు ఇచ్చానని వెల్లడించారు. కాగా ఎవరెంత తీసుకున్న విషయాన్ని త్వరలో తేల్చేస్తానని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడే ఉన్న మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు. అయితే అక్కడే ఉన్న మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు, పలువురు కౌన్సిలర్లు మిన్నకుండిపోయారు. ‘సాక్షి’పై అక్కసు ‘సాక్షి’ టీవీలో గురువారం ప్రసారమైన ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ కథనం, ‘సాక్షి’ దినపత్రికలో నీరు–చెట్టు పథకంలో జరి గిన అవినీతిపై వస్తున్న కథనాలపై ఎమ్మె ల్యే అక్కసు వెళ్లగక్కారు. తప్పు జరిగి ఉంటే తనను ప్రశ్నించాలన్నారు. కార్యక్రమంలో వెంకటగిరి ఏఎంసీ చైర్మన్ పులి కొల్లు రాజేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ సి.గంగాప్రసాద్, కౌన్సిలర్ పి.విశ్వనాథ్, ఆవుల ప్రహ్లాద, కె.చెంగారావ్, కె.రమేష్, ఎం.బాబు పాల్గొన్నారు. -
కప్పులు తీశారు.. కౌన్సిలర్‌గా ఎదిగారు
కష్టాలను దాటిన కన్నమనాయుడు తాడేపల్లిగూడెం : ఈయన పేరు చుక్కా కన్నమనాయుడు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం చుక్కపేటలో నిరుపేద కుటుంబానికి చెందిన అతని తల్లిదండ్రులు అప్పలనాయుడు, సింహా చలం పొట్టకూటి కోసం తాడేపల్లిగూడెం పట్టణానికి వలస వచ్చారు. కన్నమనాయుడు రెండేళ్ల ప్రాయంలో వారితోపాటే ఇక్కడకు చేరుకున్నారు. జిల్లాలు దాటివచ్చిన కన్నమ నాయుడు బతుకుదెరువు కోసం కష్టాన్ని నమ్ముకున్నారు. కృషే ఫలి అన్నట్టుగా అంచెలంచెలుగా ఎదిగారు. ప్రస్తుతం 60 కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నారు. తాను ఇంత స్థాయికి ఎదగడం వెనుక తల్లిదండ్రుల కృషి ఎంతో ఉందంటున్న కన్నమనాయుడు విజయగాథ ఆయన మాటల్లోనే... ‘నా తల్లిదండ్రులు అప్పలనాయుడు, సింహాచలం పొట్టచేత పట్టుకుని ఈ ఊరు బయలుదేరగా.. రెండేళ్ల వయసులో వారి చేతులు పట్టుకుని నేనూ బయలుదేరాను. ఆ వయసులో నాకు ఊహ తెలియదు గానీ.. ఎలాంటి ఇబ్బందులు పడ్డామో ఇట్టే ఊహకందుతుంది. ఊరుకాని ఊరు. ఏంచేయూలో తెలీదు. నడిసంద్రంలో చిక్కుకున్న నావ మాదిరిగా ఉంది అప్పట్లో మా కుటుంబ పరిస్థితి. అమ్మానాన్న నాలుగు మెతుకులు సంపాదించడానికి కష్టపడుతున్నారు. పలకా, బలపం పట్టుకుని నేను బళ్లోకి వెళ్లేవాడిని. ఆ సమయంలోనే మా చెల్లి పుట్టింది. కుటుంబ సభ్యుల సంఖ్య నాలుగుకు చేరింది. అమ్మానాన్న రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా కుటుంబం గడిచేది కాదు. ఆ పరిస్థితుల్లో నేను తణుకు రోడ్డులో గల సూర్రావు హోటల్లో చాలాకాలం కప్పులు తీశాను. చాలీచాలని ఆదాయంతో కుటుంబం గడవడం కష్టంగా మారింది. 15 ఏళ్ల వయసులో లారీ ఆఫీస్‌లో గుమాస్తాగా చేరాను. తర్వాత లారీ క్లీనర్‌గా.. డ్రైవర్‌గా పనిచేశాను. చెమటోడ్చి సంపాదించిన సొమ్ముతో ఒక లారీ కొన్నాను. అప్ప ట్లో అక్వా పరిశ్రమ ఉచ్ఛస్థితిలో ఉంది. అదే నాకు కలిసి వచ్చింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పేడ, కోళ్ల ఫారాల నుంచి పెంట కొనేవాడిని. వాటిని చేపల చెరువుల యజమానులకు అమ్మేవాడిని. ఇదే నా జీవితాన్ని మార్చింది. ఒక్కొక్కటిగా ఇప్పటివరకూ 25 లారీలు కొన్నాను. వీటితోపాటు మరో 35 లారీలను నేనే నిర్వహిస్తున్నాను. ఇప్పుడు నాతోపాటు మరో 60 కుటుంబాలకు ఉపాధి కల్పించగలుగుతున్నాను. నేను నివసిస్తున్న 15వ వార్డులో పరిచయూలు పెరగడంతో ముని సిపల్ ఎన్నికలలో పోటీ చేశాను. ప్రజలు దీవించారు. కౌన్సిలర్ అయ్యూను. కష్టం అంటే ఏమిటో నాకు తెలుసు. ఆకలి విలువ తెలిసిన వాడిని. భగవంతుడు కరుణించాడు. ఆక్వా పరిశ్రమ ఆదుకుంది. వీటన్నిటికీ మించి వెనుక నా తల్లిదండ్రుల ఆసరా, వారి దీవెనలు ఎంతో ఉన్నాయి. వారు నాకు ఇచ్చిన జన్మను సార్థకం చేసుకుంటాను’ అంటూ తన జీవిత గాథను వినమ్రంగా చెప్పుకొచ్చారు కన్నమనాయుడు.