రాహుల్‌ సిప్లిగంజ్‌తో లవ్.. రతికా పేరేంట్స్ ఏమన్నారంటే? | Bigg Boss Contestant Rathika Rose Parents About Rahul Silpliganj And Pallavi Prashanth - Sakshi

Rathika Rose: 'మా అమ్మాయి పెళ్లికి రాహుల్ వచ్చాడు.. కానీ ఇలా అవుతుందనుకోలేదు'

Nov 3 2023 6:09 PM | Updated on Nov 3 2023 6:33 PM

Bigg Boss Contestant Rathika Rose Parents About Rahul Silpliganj - Sakshi

రతికా రోజ్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో రీ ఎంట్రీ ఇచ్చి అలరిస్తోంది. అయితే బిగ్‌ బాస్‌తో ఎంత ఫేమ్ తెచ్చుకుందో.. ఆమె వ్యక్తిగత విషయాలతోనూ అంతేస్థాయిలో వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా సింగర్ ‍రాహుల్‌ సిప్లిగంజ్‌తో ప్రేమ వ్యవహారంతో ఎక్కువగా వార్తల్లో నిలిచింది. 

ఆమెది వికారాబాద్ జిల్లా జనగామ గ్రామం కాగా.. ప్రస్తుతం వీరు తాండూరులో నివాసముంటున్నారు. రతికా రోజ్.. రాములు, అనితలకు రెండో సంతానం కాగా.. వీరికి ముగ్గురు కుమార్తెలున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రతికా రోజ్ తల్లిదండ్రులు ఆమె గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 

(ఇది చదవండి: బోరున ఏడ్చేసిన రతిక తల్లిదండ్రులు.. అందరినీ కదిలిస్తున్న వ్యాఖ్యలు)

రతికా నాన్న రాములు మట్లాడుతూ.. 'మాది చాలా చిన్న ఊరు. కేవలం 2 వేల జనాభా ఉంది. మొదట మా అమ్మాయికి పటాస్ షో అవకాశం వచ్చింది. అందులో ఏదో నాలుగు ఉంటుందని అనుకున్నా. ఇంతవరకు వస్తుందని అనుకోలేదు. ఒకసారి రతికా ఇంటర్ సెకండియర్‌లో విజయ నిర్మలమ్మ తీసిన ఈ జన్మ నీకే అనే సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా కావాలని ఫోన్ వచ్చింది. కానీ సినిమాల గురించి మాకు పెద్దగా తెలియదు. మహేశ్ బాబు వాళ్ల అమ్మనే ఫోన్ చేసి అడిగింది. మా అమ్మాయి నాకు సినిమా ఛాన్స్ వచ్చింది.. నేను పోతా పట్టు పట్టింది. అయితే ఆ సినిమా రిలీజ్ కాలేదు. మాకు ముగ్గురు కుమార్తెలు సంతానం. రతిక రెండో అమ్మాయి. మిగిలిన ఇద్దరికీ పెళ్లి చేశాం. ఇప్పుడు మాకు కొడుకు రూపంలో ఉన్నది రతికనే.' అంటూ చెప్పుకొచ్చారు. 

(ఇది చదవండి: బిగ్‌ బాస్ విన్నర్‌కు బిగ్ షాక్!)

రతికా నాన్న మాట్లాడుతూ..' రాహుల్ సిప్లిగంజ్‌ వాళ్ల ఇంటికి కూడా పోయినా. మా అమ్మాయితో రెండు, మూడు పాటలు చేసిండు. యూట్యూబ్‌లో పెడితే పైసలు వస్తాయి కదా అని అనుకున్నాం. మా చిన్నపాప పెళ్లికి కూడా రాహుల్ వచ్చిండు. మా వరకైతే పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదు. అయితే మా పాపకు పెళ్లి కావాలే.. మా అమ్మాయితో ఇలా సినిమా పాటలు తీస్తే ఎలా? అని ఒకసారి రాహుల్‌ను బెదిరించా. మా ఊర్లో వాళ్లయితే వాడితోనే డ్యాన్స్ చేసి.. వాడితోనే పోతుంది అనేవారు. మేం వాటిని పట్టించుకోలేదు. రాహుల్ కూడా అందరిలాగే పెళ్లికి వచ్చిండు.. కానీ ఇలా జరుతుందని మేం కూడా అనుకోలేదు. రతికా అందరినీ ఫ్రెండ్‌లాగే భావిస్తుంది. బిగ్‌ బాస్‌లో పల్లవి ప్రశాంత్‌తో ఒక స్నేహితుడిలాగే మాట్లాడింది. బయట కావాలనే కొందరు రూమర్స్ తెచ్చారు.' అని అన్నారు.

అనంతరం రతికా తల్లి అనితా మాట్లాడుతూ..' రతికా నాతో కలిసి ఇంట్లో వంటలు కూడా చేస్తుంది. మటన్, పాయసం అంటే ఇష్టం. నాకు ఎప్పుడు సపోర్ట్‌గా ఉంటుంది.' అని చెప్పుకొచ్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement