రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం
Published Tue, Aug 26 2014 8:47 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
వికారాబాద్: రంగారెడ్డి జిల్లాలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా పలు రూట్లలో బస్సుల సర్వీసులను రద్దు చేశారు. జిల్లాలోని పరిగి, వికారాబాద్, తాండూర్‌లో భారీవర్షం నమోదైంది. భారీ వర్షానికి వాగులు పొంగాయి.
భారీ వర్షం కారణంగా పరిగి-మహబూబ్‌నగర్, పరిగి-షాద్‌నగర్, తాండూర్-మహబూబ్‌నగర్ రూట్లలో బస్సులు సర్వీసులు రద్దు చేశారు. దాంతో ప్రయాణికులు ఇబ్బందికి లోనవుతున్నారు.
Advertisement
Advertisement