తాండూరు రూరల్: గుర్తుతెలియని దుండగులు ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన పట్టణంలోని విలియం మూన్ హైస్కూల్ మైదానం వెనకాల గురువారం వెలుగుచూసింది. స్థానికులు, పట్టణ సీఐ వెంకట్రామయ్య తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు సమీపంలోని ఎన్‌టీఆర్ కాలనీకి చెందిన చాంద్‌పాషా కుమారుడు షేక్ సలీం అలియాస్ మత్తు(23) ఏపని చేయకుండా ఖాళీగా తిరుగుతుంటాడు. గురువారం ఉదయం ఎన్‌టీఆర్ కాలనీ సమీపంలోని విలియం మూన్ హైస్కూల్ మైదానం వెనకాల ఓ గుర్తుతెలియని యువకుడు మృతదేహంగా పడి ఉన్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పట్టణ సీఐ వెంకట్రామయ్య తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. స్థానికులను ఆరా తీసి హతుడు ఎన్‌టీఆర్ కాలనీకి చెందిన యువకుడు సలీంగా నిర్ధారించారు. దీంతో పోలీసులు మృతుడి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు సలీం రెండు చేతులను మెడకు చుట్టేసి పదునైన ఆయుధంతో తలపై దాడి చేసి చంపినట్లు పోలీసులు గుర్తించారు.
హతుడి కుటుంబీకులతో మాట్లాడి వివరాలు సేకరించారు. మృతదేహానికి జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. యువకుడిని దారుణంగా చంపేసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. సలీం హత్యతో గురువారం తాండూరులో తీవ్ర కలకలం రేగింది. హతుడి అన్న షేక్ మౌలనా ఫిర్యాదు మేరకు కే సు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకట్రామయ్య పేర్కొన్నారు.
యువకుడి దారుణ హత్య
Published Fri, May 29 2015 12:46 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
Advertisement
Advertisement