స్నేహితుడే నిందితుడు | The accused's friend | Sakshi
Sakshi News home page

స్నేహితుడే నిందితుడు

Published Fri, May 29 2015 11:51 PM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

The accused's friend

తాండూరు: యువకుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు 24 గంటల్లోనే నిందితుడి పట్టుకొని రిమాండుకు తరలించారు. స్నేహితుడే నిందితుడని తేల్చారు. శుక్రవారం తాండూరు అర్బన్ సీఐ వెంకట్రామయ్య తన కార్యాలయంలో ఎస్‌ఐ చతుర్వేదితో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు.
 
 బాల్య మిత్రులు..
 తాండూరు పట్టణంలోని ఎన్‌టీఆర్ కాలనీకి చెందిన చాంద్‌పాషా స్థానిక లారీ పార్కింగ్ వద్ద చిన్న హోటల్ నిర్వహిస్తున్నాడు. ఈయన కొడుకు షేక్ సలీం అలియాస్ మత్తు(23) వైట్నర్, కల్లుకు బానిసయ్యాడు. ఇందిరానగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం(22), షేక్ సలీం చిన్నప్పటి నుంచి స్నేహితులు. గతంలో పలు సెల్‌ఫోన్ చోరీలు, జేబు దొంగతనాలు చేశారు. కొన్ని నెలల క్రితం పట్టణంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలో లారీ బ్యాటరీని చోరీ చేసి ఇద్దరూ జైలుకు వెళ్లి ఇటీవలే బెయిల్‌పై తిరిగి వచ్చారు.  
 
 మళ్లీ చోరీలకు పట్టుబట్టిన సలీం..
 జైలుకు వెళ్లొచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ అయిన సలాం మంచిగా బతకాలని నిర్ణయించుకున్నాడు. కాగా వైట్నర్, కల్లుకు బానిసైన సలీం మళ్లీ చోరీలు చేద్దామని తరచూ సలాంతో చెబుతూ పట్టుబట్టేవాడు. ఇటీవల ఇందిరానగర్‌లోని ఓ మసీద్‌లో సలీం సెల్‌ఫోన్ చోరీ చేశారు. అతడిని స్థానికులు పట్టుకోగా సలామ్ పేరు కూడా చెప్పడంతో వారు ఇద్దర్నీ చితకబాదారు. ఁచోరీలు చేద్దాం, లేకపోతే నేను దొంగతనాలకు పాల్పడి నీ పేరు చెబుతాను* అంటూ సలీం తన స్నేహితుడు సలాంను బె దిరించసాగాడు. సలీంతో ఉంటే అనవసరంగా కేసుల్లో ఇరుక్కుంటానని భావించిన సలాం అతణ్ని ఎలాగైనా అంతమొందించేందుకు పథకం వేశాడు.  
 
 ఇలా చంపేశాడు..
 ఈక్రమంలో ఈనెల 27న రాత్రి సలాం తన ఆటోలో ప్రయాణికులను పాతతాండూరులో దించేశాడు. అనంతరం బస్వన్నకట్ట వద్దకు రాగా అక్కడ సలీం కనిపించాడు. ఇద్దరు కలిసి కల్లు తాగారు. పథకం ప్రకారం సలాం తక్కువ మోతాదులో కల్లు తాగాడు. అనంతరం ఈ రాత్రి చోరీ చేద్దామని సలీం మళ్లీ సలాంతో పట్టుబట్టాడు. ఇంటికి వెళ్దామని సలాం ఎంత చెప్పినా సలీం వినలేదు. అప్పటికే వైట్నర్, కల్లు తాగి నడవలేని స్థితిలో ఉన్న సలీంను సలాం తన ఆటోలో తీసుకొని విలియంమూన్ మైదానం వెనుకాల ఉన్న ఓ గుంతలోకి తీసుకెళ్లాడు. నిర్జన ప్రదేశమైన అక్కడ సలా.. సలీం చొక్కాతోనే అతని రెండు చేతులు కట్టేసి బండరాయితో తలపై బాదాడు. తీవ్రంగా గాయపడిన అతడిని గుంతలో పడేసి, మరోసారి బండరాయితో మోది అంతమొందించాడు. సలాం బండరాయిని చెట్లపొదల్లో పడేసి వెళ్లిపోయాడు. మరుసటి రోజు సలీ హత్య విషయం వెలుగుచూసింది. లారీ పార్కింగ్ వద్ద హోటల్‌లో ఉన్న సలీ సోదరుడు మౌలానా ఘటనా స్థలానికి వచ్చి చనిపోయింది తన సోదరుడు అని గుర్తించాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పలువురిని అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు.
 
 క్లూ దొరికిందిలా...
 హత్య జరిగిన రోజు చివరిసారిగా సలీంను సలాంతో చూసినట్లు కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈకోణంలో పోలీసులు సలాంను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ జరపగా హత్యానేరం అంగీకరించి పైవిషయాలు తె లిపాడు.
 
 ఈమేరకు నిందితుడిని రిమాండుకు తరలించినట్లు  సీఐ వెంకట్రామయ్య వివరించారు. కేసును ఒక్కరోజులోనే చేధించడంలో కృషి చేసిన కానిస్టేబుళ్లు దస్తప్ప, రామకృష్ణ్ణ, శివకుమార్ , అంజిలయ్య, కృష్ణారెడ్డి, రఫిక్‌లను సీఐ ఈసందర్భంగా అభినందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement