
వీఆర్వో కార్తీక్
సాక్షి, తాండూరు(వికారాబాద్): తన భార్యకు పిల్లలు పుట్టడంలేదని, రెండో పెళ్లి చేసుకుంటానని యువతికి మాయమాటలు చెప్పి లొంగదీసుకుని మోసం చేసిన వీఆర్వోపై తాండూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. బషీరాబాద్ మండలం దామర్‌చేడ్ గ్రామానికి చెందిన బోయ కార్తీక్ పెద్దేముల్ మండలంలో వీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయనకు ఇంతకుముందే వివాహం కాగా, సంతానం లేదు. దీంతో రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ యువతికి మాయమాటలు చెప్పి ఆమెపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు.
అయితే ఇటీవల తన భార్యకు సంతానం కలగడంతో, సదరు యువతితో మాట్లాడటం మానేశాడు. పెళ్లి చేసుకునేది లేదని ఆమెకు తేల్చి చెప్పాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు కార్తీక్, అతనికి సహకరించిన కుటుంబ సభ్యులపై పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు సీఐ కార్తీక్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు మరో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
చదవండి: బయటపడ్డ బండారం: అత్యాశకు పోయి.. ఆస్తి మొత్తం పోగొట్టుకుని..
Comments
Please login to add a commentAdd a comment