
తాండూరు - పాలమూరుల మధ్య నిలిచిపోయిన రాకపోకలు
రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండలంలోని గాజీపూర్ వాగు పొంగి ప్రవహస్తుంది. దాంతో వాగులోని నీరు రోడ్లపైకి వచ్చి ప్రవహిస్తుంది.
రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండలంలోని గాజీపూర్ వాగు పొంగి ప్రవహస్తుంది. దాంతో వాగులోని నీరు రోడ్లపైకి వచ్చి ప్రవహిస్తుంది. దీంతో తాండూరు - రంగారెడ్డి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తాండూరు నుంచి కోకట్ వెళ్లే మార్గంలో చిలకవాగు పొంగి ప్రవహిస్తుంది. ఇళ్లలోకి భారీగా నీరు వచ్చి చేసింది. అధికారులు వెంటనే అప్రమత్తమై స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
అలాగే తాండూరులోని కాగ్నా నది పొంగి ప్రవహిస్తుంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. అధికారులు వెంటనే అప్రమత్తమై లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను అప్రమత్తం చేశారు. దాంతో తాండూరు - మహబూబ్నగర్ రహదారిపైకి భారీగా నదీ నీరు వచ్చి చేరింది. దీంతో తాండూరు - మహబూబ్నగర్ల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.