
సాక్షి, తాండూరు టౌన్: టిక్‌టాక్ ఫేమ్ దుర్గారావు–గంగారత్నం దంపతులు ఆదివారం వికారాబాద్ జిల్లా తాండూరులో సందడి చేశారు. ఓ ఆల్బమ్ షూటింగ్ కోసం తాండూరుకు వచ్చిన వారితో పలువురు ఫొటోలు, సెల్ఫీలు దిగారు. డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ఉమాశంకర్ నేతృత్వంలో ‘దొంగచూపు చూడకే కొండముచ్చి’ అనే ఆల్బమ్‌లో పాట చిత్రీకరణకు తాండూరు పరిధిలోని నారాయణపూర్ బ్రిడ్జి వద్దకు వచ్చినట్లు దుర్గారావు తెలిపారు. కాగా టిక్ టాక్ యాప్ ద్వారా దుర్గారావు తన భార్యతో కలిసి ఫేమస్ అయిన విషయం తెలిసిందే. హావభావాలతో పాటుగా, తనదైన శైలిలో నటులను అనుకరిస్తూ చేసే వీడియోలకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. అంతేకాకుండా సినిమా పాటలకి, డైలాగ్స్‌ను తన భార్యతో కలిసి దుర్గారావు వీడియోలు చేయడం విశేషం.