ఇంటి ముందు ఆడుకుంటున్న అక్కాచెల్లెళ్లను పాము కాటు వేసింది. ఇది గుర్తించిన కుటుంబసభ్యులు వారిని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా.. చెల్లెలు మృతిచెందింది.
తాండూరు రూరల్ (రంగారెడ్డి) : ఇంటి ముందు ఆడుకుంటున్న అక్కాచెల్లెళ్లను పాము కాటు వేసింది. ఇది గుర్తించిన కుటుంబసభ్యులు వారిని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా.. చెల్లెలు మృతి చెందింది. ప్రస్తుతం అక్క పరిస్థితి విషమంగా ఉంది.
ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా తాండూరులో గురువారం చోటుచేసుకుంది. పట్టణంలోని రహమత్‌నగర్‌కు చెందిన అబ్దుల్, ఫాతిమా దంపతుల కూతుళ్లు సనాబేగం(6), సౌలీబేగం(3)లు ఇంటి ముందు ఆడుకుంటుండగా.. పాము కాటు వేసింది. దీంతో ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నిస్తుండగా.. సౌలీబేగం మృతిచెందింది. సనాబేగంను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.