రంగారెడ్డి జిల్లా: తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) శుక్రవారం తొలిసారిగా కందుల కొనుగోళ్లను ప్రారంభించింది. కందుల కొనుగోలు కేంద్రంలో సగటు ధర రూ.11,800 చొప్పున రెండు క్వింటాళ్ల కందులను కొనుగోలు చేసింది.
వందకు ఒక శాతం మార్కెట్ ఫీజుతోపాటు, ఏజెంట్‌కు కమీషన్ ఒక శాతం చొప్పున మర్పల్లికి చెందిన రైతు లక్ష్మారెడ్డి నుంచి ఎఫ్‌సీఐ కందులు కొనుగోలు చేసింది. మార్కెట్‌లో కందుల విక్రయంపై చెల్లించాల్సిన రెండు శాతం కమీషన్ లేకపోవడంతో ఎఫ్‌సీఐ కొనుగోలు కేంద్రంలో విక్రయించేందుకు రైతులు ఆసక్తిని చూపుతున్నారు.