రిటైర్డ్ తహశీల్దార్ ఇంటిపై దాడి | attack on retired mro house in ranga reddy district | Sakshi
Sakshi News home page

రిటైర్డ్ తహశీల్దార్ ఇంటిపై దాడి

Published Sun, Nov 22 2015 4:55 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

attack on retired mro house in ranga reddy district

తాండూర్: రంగారెడ్డి జిల్లాలో రిటైర్డ్ తహశీల్దార్ ఇంటిపై కొందరు గుర్తుతెలియని దుండగులు దాడికి తెగబడ్డారు. ఈ సంఘటన  తాండూర్ పట్టణంలోని మూన్ వసతి గృహం సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది.

ఆదివారం రిటైర్డ్ తహశీల్దార్ కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసుకుంటున్నారు. ఈ సమయంలో గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో రిటైర్డ్ ఎమ్మార్వోతో పాటు, ప్రభుత్వ ఉపాధ్యాయురాలైన ఆయన భార్యకి గాయాలయ్యాయి. దీంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారు. కాగా.. నూతనంగా కొనుగోలు చేసిన భూమి విషయంలో ఈ దాడి జరిగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement