రిటైర్డ్ తహశీల్దార్ ఇంటిపై దాడి
తాండూర్: రంగారెడ్డి జిల్లాలో రిటైర్డ్ తహశీల్దార్ ఇంటిపై కొందరు గుర్తుతెలియని దుండగులు దాడికి తెగబడ్డారు. ఈ సంఘటన తాండూర్ పట్టణంలోని మూన్ వసతి గృహం సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది.
ఆదివారం రిటైర్డ్ తహశీల్దార్ కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసుకుంటున్నారు. ఈ సమయంలో గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో రిటైర్డ్ ఎమ్మార్వోతో పాటు, ప్రభుత్వ ఉపాధ్యాయురాలైన ఆయన భార్యకి గాయాలయ్యాయి. దీంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారు. కాగా.. నూతనంగా కొనుగోలు చేసిన భూమి విషయంలో ఈ దాడి జరిగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.