సీబీఐతో విచారణ జరిపే దమ్ముందా? | ysrcp mla kakani govardhan reddy challenges tdp government | Sakshi
Sakshi News home page

సీబీఐతో విచారణ జరిపే దమ్ముందా?

Published Mon, Sep 1 2014 10:22 AM | Last Updated on Sat, Aug 18 2018 5:15 PM

సీబీఐతో విచారణ జరిపే దమ్ముందా? - Sakshi

సీబీఐతో విచారణ జరిపే దమ్ముందా?

హైదరాబాద్ : ఎన్నికల సందర్భంగా పట్టుబడిన మద్యంపై.. నమోదైన కేసులపై దమ్ముంటే సిబిఐతో దర్యాప్తు జరిపించాలని ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ సవాల్ చేసింది. అన్యాయంగా తమపై పదే పదే ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు తమను పరోక్షంగా వేధిస్తున్నారని ఆయన అన్నారు.

 ప్రశ్నోత్తరాల సందర్భంగా కాకాని గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ సంబంధం లేని వ్యక్తులపై బురద చల్లటం సరికాదన్నారు. ప్రభుత్వం మీ చేతుల్లో ఉందని,  మద్యం కేసుల్లో సంబంధం ఉన్నవారిని ఎవరినీ వదిలి పెట్టవద్దని, దమ్ము, ధైర్యం చిత్తశుద్ది ఉంటే సీబీఐతో ప్రభుత్వం విచారణ జరిపించాలని ఆయన అన్నారు. సీబీసీఐడీ విచారణపై తమకు నమ్మకం లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement