
సాక్షి, అనంతపురం జిల్లా: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. అనంతపురంలో రాయలసీమ రైతు ఉత్పత్తి దారుల సమ్మేళనాన్ని ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కాకాణి.. సజ్జల రామకృష్ణారెడ్డికి నేను ఎలాంటి లబ్ధి చేకూర్చలేదని ప్రమాణం చేస్తా... కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రమాణం చేసే దమ్ము, ధైర్యం ఉందా.. అని మంత్రి సవాల్ విసిరారు.
కోటంరెడ్డి నమ్మకద్రోహి అని.. మంత్రి పదవి రాలేదనే.. ఇప్పుడు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కోటంరెడ్డి పచ్చి అబద్ధాల కోరు. విశ్వాస ఘాతకుడు, నమ్మక ద్రోహి అని కాకాణి దుయ్యబట్టారు.
చదవండి: వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదు: నారాయణ స్వామి షాకింగ్ కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment