kotamReddy Sridhar Reddy
-
కోటంరెడ్డి వ్యాఖ్యలపై అనిల్ కుమార్ యాదవ్ రియాక్షన్
-
దోపిడీ ఆరోపణలపై కోటంరెడ్డికి ఛాలెంజ్..!
-
ఏపీ: ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, అమరావతి: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై వైఎస్సార్సీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలను అనర్హులుగా చేయాలని అసెంబ్లీ స్పీకర్‌కు, మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ, సీ రామచంద్రయ్యపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసింది. పార్టీ తరపున మండలి కార్యదర్శికి ఎమ్మెల్సీలు మేరుగు మురళి, లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. -
అభివృద్ధికు ఇచ్చిన ప్రతి రూపాయి. తన జోబులో వేసుకున్న శాడిస్ట్
-
స్పీకర్ ఎదుట ఎమ్మెల్యే కోటంరెడ్డి ఓవరాక్షన్..!
-
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్..!
-
కోటంరెడ్డికి ఆనం విజయకుమార్ రెడ్డి దిమ్మతిరిగే కౌంటర్
-
గిరిధర్‌రెడ్డి రాక.. టీడీపీలో చిచ్చు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి చేరిక తెలుగుదేశంలో కొత్త సమస్యలు తెచ్చింది. ఆయన్ను టీడీపీలోకి ఆహ్వానించడాన్ని వ్యతిరేకించినా పట్టించుకోకుండా చేర్చుకోవడంతో వర్గాల మధ్య విభేదాలు మరింత పెరిగాయి. గిరి చేరిక కార్యక్రమానికి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, జిల్లాలో సీనియర్ నేత అయిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, నెల్లూరు రూరల్ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్‌తోపాటు సీనియర్లు హాజరుకాకపోవడం చూస్తే ఆ పార్టీ లో పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. అన్నీ తానై.. జిల్లాలో లోకేశ్ టీంగా ప్రస్తుతం వ్యవహారాలు నడిపిస్తున్న మాజీ మంత్రి నారాయణ ముఖ్య అనుచరుడు పట్టాభి టీడీపీలోకి గిరిధర్‌రెడ్డి చేరిక విషయంలో అన్నీ తానై వ్యవహరించాడు. పార్టీ జిల్లా అధ్యక్షుడికే వ్యతిరేకంగా అంతర్గత విషయాల్లో పట్టాభి తలదూర్చడంపై కూడా సీనియర్లు గుర్రుమంటున్నారు. ఆయన గురించి నారాయణ వద్ద తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయంలో పంచాయితీ కూడా పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఎంట్రీకి ముందే ఫ్లెక్సీ వివాదం గిరిధర్‌రెడ్డి టీడీపీలో చేరికకు ముందే ఫ్లెక్సీల వివాదం మొదలైంది. కోటంరెడ్డి బ్రదర్స్ నగరంలో ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీల్లో ఎక్కడా జిల్లాలోని సీనియర్ నేతల ఫొటోలు వేయలేదు. కేవలం చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణ ఫొటోలు మాత్రమే పెట్టారు. సీనియర్ నేతలు లేకపోవడంతో ఆ పార్టీ కార్యకర్తలు నోరెళ్లబెట్టారు. ఇప్పటికే.. రానున్న ఎన్నికల్లో జిల్లాలో లోకేశ్ వర్గంగా చెప్పుకునే కొత్త ముఖాలే బరిలో ఉంటాయని చెబుతున్నారు. గతంలో పలుసార్లు పోటీ చేసి ఓటమి పాలైన వారిని పక్కన పక్కకు తప్పించేయత్నం జరుగుతున్నట్లు సమాచారం. దీంతో తమకు అవకాశం వస్తుందో రాదో తెలియక సీనియర్లు ఆందోళనలో ఉన్నారు. దీనికితోడు కోటంరెడ్డి బ్రదర్స్ విషయంలో వారి మాటను పట్టించుకోకపోవడంతో బాధలో మునిగిపోయారు. ► సోమవారం టీడీపీ సీనియర్ నాయకులు బీద రవిచంద్ర, నారాయణ, అబ్దుల్ అజీజ్ చంద్రబాబును హైదరాబాద్‌లో కలిశారు. ఈ పరిణామాలు ఇలా ఉండగానే గిరిధర్‌రెడ్డిని చినబాబు వర్గం యువగళం పాదయాత్రకు తీసుకెళ్లింది. ప్రత్యేకంగా లోకేశ్‌ను కలిపించడంతో సీనియర్లకు పుండు మీద కారం చల్లినట్లయింది. కీలకంగా చినబాబు వర్గం కోటంరెడ్డి బ్రదర్స్ వ్యవహారశైలి తెలిసిన టీడీపీ సీనియర్ నేతలు ఆది నుంచి వారిని పార్టీలోకి ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. ఎమ్మెల్యేగా రెండు దఫాలు అవకాశం కల్పించిన వైఎస్సార్సీపీకి వెన్నుపోటు పొడిచిన శ్రీధర్‌రెడ్డిని అక్కున చేర్చుకుంటే టీడీపీలో అదే సీన్ రిపీట్ చేయరని నమ్మకం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులను టార్గెట్ చేసి ముప్పుతిప్పలు పెట్టడమే కాకుండా ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టిన బ్రదర్స్‌ను సీనియర్, ద్వితీయ శ్రేణి నాయకులు వ్యతిరేకిస్తూ వచ్చారు. టీడీపీ అధికారంలో ఉన్నా, లేకున్నా కష్టపడిన వారి మాటను తోసిపుచ్చి కేవలం ఒక ఎమ్మెల్సీ ఓటు కోసం వారికి ఎంట్రీ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతోనే గిరి జాయినింగ్ కార్యక్రమానికి టీడీపీ కార్యకర్తలు ఎవరూ వెళ్లొద్దని సీనియర్ నేతలు హుకుం జారీ చేశారు. చాలావరకు టీడీపీ కార్యకర్తలు వెళ్లకపోవడంతో రోజువారీ పనులు చేసుకునే వారికి కోటంరెడ్డి బ్రదర్స్ రూ.500 చొప్పున పంపిణీ చేసి కార్యకర్తలుగా చూపించినట్లు నాయకులే చెబుతున్నారు. -
కోటంరెడ్డి హైడ్రామా అట్టర్‌ఫ్లాప్.. బెడిసికొట్టిన పొలిటికల్ ప్లాన్!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘ఏదో జరుగుతుంది అనుకుంటే.. ఇంకేదో జరుగుతోంది..’.. కోటంరెడ్డి బ్రదర్స్ విషయంలో ప్రస్తుతం అలాంటి పరిస్థితే నడుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ పేరుతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆడిన హైడ్రామా అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. ఆయన్ను తెలుగుదేశంలోకి తీసుకోవద్దని ఆ పార్టీ నేతలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో బ్రదర్స్‌కు మైండ్‌బ్లాక్ అయ్యింది. ఇద్దరి రాజకీయ భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. సంవత్సరంగా.. ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి ప్రణాళిక ప్రకారమే వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఇచ్చింది. ఎమ్మెల్యేకు అన్నివిధాలా స్వేచ్ఛ ఇచ్చింది. దీన్ని అలుసుగా తీసుకున్న కోటంరెడ్డి తన సోదరుడిని షాడో ఎమ్మెల్యేగా పెట్టారు. పారీ్టలతో సంబంధం లేకుండా దందాలు, దౌర్జన్యకాండ చేసి ఆర్థికంగా ఊహించని స్థాయికి వెళ్లారు. వైఎస్సార్సీపీలో ఉంటే టికెట్‌కే ఎసరొస్తుందని ఎమ్మెల్యే భావించారు. అప్పటికే ఎమ్మెల్యే వల్ల తీవ్ర ఇబ్బందులు పడిన టీడీపీ నాయకులు ఆయన్ను ఒంటరి చేయాలని ట్రాప్ చేశారు. ఇదంతా తన బలమేనని ఊహించుకున్న ఎమ్మెల్యే టీడీపీ వలలో చిక్కుకున్నాడు. ఫోన్ ట్యాపింగ్ జరిగితే కదా.. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్‌కు ముందే శ్రీధర్‌రెడ్డి జిల్లా మాజీ మంత్రి ప్రధాన అనుచరుడి ద్వారా చంద్రబాబును కలిశారు. అంతకు ముందే నారా లోకేశ్‌తో మంతనాలు చేశారు. ఎమ్మెల్యే సోదరుడు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డికి టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడితో వ్యాపార సంబంధాలు ఉండటంతో ఆయనతో మాట్లాడుకున్నారు. ఒకప్పుడు టీడీపీలో కీలకంగా ఉండి నేడు బీజేపీలో ఉన్న ఓ నాయకుడితో రహస్య చర్చలు జరిపారు. అంతా ఓకే అనుకున్న తర్వాత వాయిస్ రికార్డ్‌ను చూపించి నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ హైడ్రామా నడిపారు. కానీ ఎమ్మెల్యే స్నేహితుడు లంకా రామశివారెడ్డి ఇదంతా ఉత్తిదేనని, అది వాయిస్ రికార్డ్ అని తేల్చడంతో ఫ్లాప్ షోగా తేలిపోయింది. కాగా ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్రానికి లేఖ రాశానంటూ ఎమ్మెల్యే హడావుడి చేశారు. విచారణ జరిపించాలంటే వెంటనే సంబంధిత ఫోన్‌ను పోలీసులకు ఇవ్వాలి. అవసరమైతే కోర్టు ద్వారానైనా విచారణ చేయించుకోవాలి. కానీ అలా జరగలేదు. అదే కోటంరెడ్డి స్నేహితుడు రామశివారెడ్డి మాత్రం తన ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి వాస్తవాలు తేల్చండంటూ చెప్పినట్లుగా కూడా ఎమ్మెల్యే చెప్పలేకపోయాడు. ఇక ఈ ఎపిసోడ్ రక్తికట్టదని తెలుసుకుని విచారణ పేరుతో ఆ నెపం కేంద్రంపై నెట్టేశారు. ఆయనొస్తే మేం ఉండం ప్రణాళిక ప్రకారమే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేను ట్రాప్‌లోకి దించిన టీడీపీ ఇప్పుడు మాత్రం మాకేమీ తెలియదని చేతులెత్తేసింది. ఆయన రాకను జీరి్ణంచుకోలేని నేతలు తమ పార్టీ అ«ధినేత చంద్రబాబుకు ఏకంగా హెచ్చరికలే చేశారు. రెండురోజుల క్రితం చంద్రబాబు నెల్లూరు నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. ఈక్రమంలో టీడీపీ కీలక నేతలంతా కోటంరెడ్డి అరాచకాలపై ఏకరువు పెట్టారు. ఆయన టీఎన్ఎస్ఎఫ్ నేతపై హత్యాయత్నం నుంచి మరికొందరు నాయకులపై దాడులు చేయించడం, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఆర్థిక మూలాలపై కోలుకోలేని దెబ్బతీసిన వైనాన్ని వివరించారు. మూడన్నరేళ్లపాటు అష్టకష్టాలు పెట్టిన వ్యక్తికి మేమే ఎలా జేజేలు కొట్టాలంటూ బాబునే నిలదీశారని తెలిసింది. ఆయన పార్టీ కండువా కప్పుకోక ముందే నేనే అభ్యరి్థనని ఎలా ప్రకటించుకుంటారని ప్రశ్నించారని సమాచారం. శ్రీధర్‌రెడ్డి వస్తే మాత్రం మేం వెళ్లిపోతామని తెగేసి చెప్పడంతో కంగుతిన్న బాబు హామీ ఉత్తిదేనని అజీజ్‌నే ఇన్చార్జిగా కొనసాగిస్తానని చెప్పారని ప్రచారం జరుగుతోంది. అబ్దుల్ అజీజ్ త్వరలోనే నియోజకవర్గంలో పాదయాత్ర ద్వారా కార్యకర్తలను కలిసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడని తెలిసింది. అచ్చెన్నా.. మా సంగతి చూడు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో శ్రీధర్‌రెడ్డి తన సోదరుడు గిరిధర్‌రెడ్డిని రంగంలోకి దింపారు. అచ్చెన్నాయుడితో వ్యాపార సంబంధాల నేపథ్యంలో అతని ద్వారానైనా చంద్రబాబును ఒప్పించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలిసింది. మూడు రోజుల క్రితం గిరిధర్‌రెడ్డి అచ్చెన్నాయుడిని కలిసి చంద్రబాబుతో చెప్పి టికెట్ ఇప్పించాలని అడిగినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. నేనైతే హామీ ఇవ్వలేనని.. బాబుకు చెప్పి చూస్తానంటూ అచ్చెన్నాయుడు చెప్పినట్లు సమాచారం. ఏది ఏమైనా కోటంరెడ్డి ఎపిసోడ్ తేలిపోవడం జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. -
ఫోన్ ట్యాపింగ్ డ్రామాపై కోటంరెడ్డి స్నేహితుడు రామశివారెడ్డి క్లారిటీ
సాక్షి, నెల్లూరు జిల్లా: ఎమ్మెల్యే కోటం రెడ్డి ఫోన్ టాపింగ్ డ్రామాపై ఆయన స్నేహితుడు రామశివారెడ్డి స్పష్టత నిచ్చారు. ఆ ఆరోపణలపై మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘నాది ఆండ్రాయిడ్ ఫోన్. నా ఫోన్ లో ప్రతీకాల్ రికార్డవుతుంది. కోటంరెడ్డి చెప్పింది ట్యాపింగ్ కాదు.. రికార్డింగ్ మాత్రమే. కేవలం యాదృచ్చికంగా కాల్ రికార్డయింది’’ అని చెప్పారు. ‘‘ఉద్ధేశపూర్వకంగా రికార్డ్ చేసిన కాల్ కాదు. ట్యాపింగ్ అంటూ ఇంత వివాదం అవుతుందని ఊహించలేదు. ట్యాపింగ్ అంటూ కోటంరెడ్డి ఇంత హంగామా చేసినందుకే వాస్తవాలు చెబుతున్నా.. నా ఫోన్‌ను ఫోరెన్సిక్‌కు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా’’ అని రామశివారెడ్డి తేల్చి చెప్పారు. ‘‘నేను ఎవరో సీఎం జగన్‌కు తెలీదు. ఏదో ఊహించుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. మా ఇద్దరివీ ఐఫోన్లు అని కోటంరెడ్డి అబద్ధం చెప్పారు. నాపై ఎవరి ఒత్తిడీ లేదు.. వాస్తవం చెప్పేందుకే మీడియా ముందుకొచ్చా’’ అని రామశివారెడ్డి స్పష్టం చేశారు. తనకు 30 ఏళ్లుగా వైఎస్ కుటుంబంతో అనుబంధం ఉందన్నారు. వైఎస్ కుటుంబంపై విశ్వాసం ఉందని ఆయన అన్నారు. చదవండి: కోటంరెడ్డికి ఊహించని షాక్.. దెబ్బ అదుర్స్! -
కోటంరెడ్డికి మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి సవాల్
సాక్షి, అనంతపురం జిల్లా: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. అనంతపురంలో రాయలసీమ రైతు ఉత్పత్తి దారుల సమ్మేళనాన్ని ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కాకాణి.. సజ్జల రామకృష్ణారెడ్డికి నేను ఎలాంటి లబ్ధి చేకూర్చలేదని ప్రమాణం చేస్తా... కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రమాణం చేసే దమ్ము, ధైర్యం ఉందా.. అని మంత్రి సవాల్ విసిరారు. కోటంరెడ్డి నమ్మకద్రోహి అని.. మంత్రి పదవి రాలేదనే.. ఇప్పుడు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కోటంరెడ్డి పచ్చి అబద్ధాల కోరు. విశ్వాస ఘాతకుడు, నమ్మక ద్రోహి అని కాకాణి దుయ్యబట్టారు. చదవండి: వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదు: నారాయణ స్వామి షాకింగ్ కామెంట్స్ -
'కోటంరెడ్డి బ్రదర్స్ తినే ప్రతి మెతుకు సీఎం జగన్ పెట్టిన భిక్షే'
నెల్లూరు: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఆరోపణలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఆనం విజయ్‌కుమార్ రెడ్డి. జిల్లాలో అనవసరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. అధిష్టానం గుర్తిస్తేనే ఎవరైనా ఎమ్మెల్యే కాగలరని పేర్కొన్నారు. కోటంరెడ్డి పార్టీలో గుర్తింపు లేదనడం భావ్యం కాదన్నారు. పార్టీ నుంచి వెళ్లాలని కోటంరెడ్డికి ఎవరూ చెప్పలేదని విజయ్‌కుమార్ రెడ్డి తెలిపారు. నెల జీతాలిచ్చి రౌడీషీటర్లను పెట్టుకొని దందాలు చేసిన వ్యక్తి ఆయన అని వ్యాఖ్యానించారు. హింసా రాజకీయాలు చేసి నీచ సంస్కృతికి తెరలేపారని ధ్వజమెత్తారు. కోటంరెడ్డి సోదరులు రాక్షసులుగా వ్యవహరించారని ఫైర్ అయ్యారు. కౌన్సిలర్ స్థాయి కూడా లేని కోటంరెడ్డిని సీఎం జగన్ ఎమ్మెల్యేని చేశారని విజయ్‌కుమార్ రెడ్డి గుర్తు చేశారు. ఆయన ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. కోటంరెడ్డి బ్రదర్స్ తినే ప్రతి మెతుకు సీఎం జగన్ పెట్టిన భిక్షే అన్నారు. టీడీపీతో కుమ్మక్కై అన్నం పెట్టిన పార్టీపై అభాండాలు మోపుతారా అని ప్రశ్నించారు. తన సోదరుడు ఆనం రామనారాయణరెడ్డి కూడా ఏం తక్కువై పార్టీకి దూరమయ్యారో తెలియడం లేదని విజయ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్ తమ కుటుంబానికి అండగా నిలిచారని గుర్తు చేశారు. పార్టీ లైన్ దాటితే ఎంతటి వారికైనా చర్యలు తప్పవని తేల్చిచెప్పారు. రామనారాయణరెడ్డి తమ్ముడిగా కాకుండా సీఎం జగన్ మనిషిగా ఉంటానని పేర్కొన్నారు. చదవండి: ఇంకేం చర్యలు తీసుకుంటాం.. కోటంరెడ్డి వ్యవహారంపై స్పందించిన సజ్జల -
నెల్లూరు రూరల్‌లో టీడీపీకి షాక్..!
సాక్షి, నెల్లూరు : జిల్లాలో టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు ఊపందుకుంటున్నాయి. జిల్లా మంత్రి అనిల్ కుమార్ యాదవ్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అధ్వర్యంలో నెల్లూరు రూరల్ టీడీపీ మండల కన్వినర్ వేమిరెడ్డి అశోక్‌రెడ్డి, మాజీ మండల అధ్యక్షురాలు వేమిరెడ్డి కౌసల్యమ్మ, ఆమంచర్ల గ్రామనాయకులు వెంకటేశ్వర్లు నాయుడు, రూరల మండల ఉపాధ్యక్షులు పులి రామ్ గోపాల్‌తో పాటు పలువురు టీడీపీ కార్యకర్తలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, తాటి వెంకటేశ్వర రావు పాల్గొన్నారు. -
సేవా కార్యక్రమాలతో పెద్ద మనసు చాటుకున్న నేతలు
సాక్షి, వైఎస్సార్/నెల్లూరు/చిత్తూరు: నూతన సంవత్సరం సందర్భంగా పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తమ పెద్ద మనసును చాటుకున్నారు. పలు సేవా కార్యక్రమాల నిర్వహించి ప్రజలకు అండగా నిలబడ్డారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల సేవా కార్యక్రమాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు వద్ద రాజన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. పేద ప్రజల ఆకలి తీర్చేందుకు రెండు రూపాయలకే భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకంతో ఎంతో మంది పేద ప్రజల ఆకలి బాధలు తీరతాయని కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. వైఎస్సార్ సీసీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాల్లో ఒకటైన రాజన్న క్యాంటీన్‌ను రైల్వేకోడూరులో ప్రారంభించినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని ఆదుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఇచ్చిన పిలుపుకు అనూహ్య స్పందన వచ్చింది. పల్లపు సుధాకర్ అనే వ్యక్తి గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. అతన్ని ఆదుకోవాల్సిందిగా శ్రీధర్‌రెడ్డి పిలుపునివ్వగా.. 4 లక్షల 70 వేల రూపాయలు విరాళాలు వచ్చాయి. ఈ డబ్బును శ్రీధర్‌రెడ్డి ఆపరేషన్ నిమిత్తం బాధితుడికి అందజేశారు. చిత్తూరు జిల్లా నగిరిలో ఎమ్మెల్యే రోజా నూతన సంవత్సరం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అప్పలాయ గుంటలో ఆమె వైఎస్సార్ క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఇక్కడ ప్రతి మంగళవారం నాలుగు రూపాయలకే భోజనం అందించనున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా నగిరిలో కేక్ కట్ చేసిన రోజా కొత్త పేటలో వాటర్ ప్లాంటును ప్రారంభించారు. దీని ద్వారా ప్రజలకు రెండు రూపాయలకే 20 లీటర్ల మంచి నీరు అందించాలని నిర్ణయించారు. -
మంత్రిది ఉన్మాద పాలన
ఎమ్మెల్యేలు అనిల్, కోటంరెడ్డి ఆగ్రహం నెల్లూరు సిటీ: రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పాలన ఉన్మాది పాలనను తలపిస్తోందని నెల్లూరు నగర, రూరల్ ఎమ్మెల్యేలు పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం సాయంత్రం విలేకరులతో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడారు. అధికార పార్టీ నాయకుల తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అధికారులపై వేటేశారని ఆరోపించారు. ఐదేళ్లుగా టౌన్‌ప్లానింగ్ అధికారుల కారణంగా కార్పొరేషన్ భ్రష్టుపట్టిందని, ప్రక్షాళన చేసేందుకే సస్పెండ్ చేశారని చెప్పారని, అయితే ఒక్కరు తప్ప మిగిలిన వారందరూ ఆర్నెల్లు, ఏడాది క్రితం వచ్చిన వారేనని చెప్పారు. మంత్రి ఉన్మాద నిర్ణయాలతో తప్పులు చేయనివారు బలికావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సమ్మర్ స్టోరేజీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై విచారణ జరుపుతామన్న మంత్రి ఎందుకు వెనుకడుగు వేశారని ప్రశ్నించారు. చేతనైతే కార్పొరేషన్‌కు నిధులు తీసుకురావాలని హితవు పలికారు. జిల్లాలో సీనియర్ నేతలను కాదని నారాయణకు మంత్రి పదవి కట్టబెట్టడంతో ఆయన ఇష్టానుసారంగా పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా నారాయణను సాగనంపి, మంచి మంత్రిని ఎన్నుకోవాలని సూచించారు. కార్పొరేషన్‌లోని అన్ని వ్యవహారాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మేయర్ షాడో హోటల్లో దందా దేశంలో ఎక్కడా ఏడుగురు ఉద్యోగులపై విచారణ కూడా లేకుండా సస్పెండ్ చేసిన దాఖలాలు లేవని ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ ఆరోపించారు. మేయర్ షాడో హోటల్లో దందా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. దందా చేసే వారిపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మంత్రి నారాయణ ఎక్కడా అక్రమాలకు పాల్పడలేదని నిరూపించగలరానని ప్రశ్నించారు. ముందుగా మంత్రి వద్ద నుంచే ప్రక్షాళన మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు. మంత్రి నారాయణ ఆక్రమణలు చేసినట్లు నిరూపిస్తానని, మంత్రి నారాయణ రాజీనామా చేస్తారానని సవాల్ విసిరారు. తాను నిరూపించలేకపోతే రాజీనామా చేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించొద్దని అధికారులకు సూచించారు. డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ విప్ బొబ్బల శ్రీనివాసయాదవ్, కార్పొరేటర్లు ఓబిలి రవిచంద్ర, ఊటుకూరు మాధవయ్య, గోగుల నాగరాజు, ఖలీల్ అహ్మద్, దేవరకొండ అశోక్, నాయకులు వేలూరు మహేష్, కుంచాల శ్రీనివాసులు, పుల్లారెడ్డి, సత్తార్, తదితరులు పాల్గొన్నారు. -
జగనోత్సాహం
జై జగన్ .. జైజై జగన్ నినాదాలతో శుక్రవారం రేణిగుంట విమానాశ్రయం హోరెత్తింది. నెల్లూరులో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి విమానంలో హైదరాబాద్ నుంచి రేణిగుంటకు చేరుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అభిమానులు ఆయనతో కరచాలనం చేయడానికి ఉత్సాహం చూపారు. రేణిగుంట నుంచి నెల్లూరుకు రోడ్డుమార్గాన వెళ్లిన జగన్‌కు దారి పొడవునా ప్రజలు నీరాజనాలు పలికారు. రేణిగుంట: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డికి రేణిగుంట విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు జగన్మోహన్రెడ్డి విమానంలో శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి రేణిగుంటకు చేరుకున్నారు. పార్టీ నేత భూమా నాగిరెడ్డి కూడా ఆయనతో పాటు వచ్చారు. విమానాశ్రయం చేరుకున్న జగన్‌కు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి, చిత్తూ రు జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ గాయత్రిదేవి, సత్యవేడు నియోజకవర్గ ఇన్చార్జి ఆదిమూలం, నాయకులు జంగాలపల్లి శ్రీనివాసులు స్వాగతం పలికారు. విమానాశ్రయం వెలుపల పార్టీ నేతలు, కార్యకర్తలు పుష్పగుచ్ఛాలు, పార్టీ కండువాలతో జగన్‌ను ఘనంగా సన్మానించారు. జగన్మోహన్రెడ్డి నాయకత్వం వర్థిల్లాలి అంటూ నాయకులు, కార్యకర్తల నినాదాలతో విమానాశ్రయం హోరెత్తింది. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు వైఎస్ జగన్ ఫ్లెక్సీలతో వినూత్నంగా స్వాగతం పలికారు. జగ న్కు స్వాగతం పలికిన వారిలో పాలగిరి ప్రతాప్‌రెడ్డి, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, రైతు విభాగం నాయకుడు ఆదికేశవులురెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు పోకల అశోక్‌కుమార్, తిరుమలరెడ్డి, రెడ్డివారి చక్రపాణిరెడ్డి, విరూపాక్షి జయచంద్రారెడ్డి, సిరాజ్ బాషా, రేణిగుంట మండల నాయకులు అత్తూరు హరి, జువ్వల ధయాకర్రెడ్డి, నగరం భాస్కర్‌బాబు, గంగారి రమేష్, గురవరాజుపల్లి శంకర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, ఎం జీ రాజేష్‌రెడ్డి, షంషీర్, మోహన్నాయు డు, బాల సుబ్రమణ్యం శ్రీకాంత్ రా యల్ ఉన్నారు. అనంతరం జగన్ రోడ్డుమార్గంలో నెల్లూరు బయలుదేరి వెళ్లారు. ఘన వీడ్కోలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి రేణిగుంట విమానాశ్రయంలో శుక్రవారం మధ్యాహ్నం పార్టీ నేతలు ఘనంగా వీడ్కోలు పలికారు. నెల్లూరు వైఎస్సార్సీపీ ఎమ్మేల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కుమార్తె వివాహానికి హాజరై తిరుగు ప్రయాణంలో రేణిగుంట చేరుకున్నారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి, జిల్లా కన్వీనర్ నారాయణ స్వామి, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, అనిల్ కుమార్, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి, మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు వీడ్కోలు పలికారు.