
సాక్షి, నెల్లూరు : జిల్లాలో టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు ఊపందుకుంటున్నాయి. జిల్లా మంత్రి అనిల్ కుమార్ యాదవ్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అధ్వర్యంలో నెల్లూరు రూరల్ టీడీపీ మండల కన్వినర్ వేమిరెడ్డి అశోక్‌రెడ్డి, మాజీ మండల అధ్యక్షురాలు వేమిరెడ్డి కౌసల్యమ్మ, ఆమంచర్ల గ్రామనాయకులు వెంకటేశ్వర్లు నాయుడు, రూరల మండల ఉపాధ్యక్షులు పులి రామ్ గోపాల్‌తో పాటు పలువురు టీడీపీ కార్యకర్తలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, తాటి వెంకటేశ్వర రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment