సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘ఏదో జరుగుతుంది అనుకుంటే.. ఇంకేదో జరుగుతోంది..’.. కోటంరెడ్డి బ్రదర్స్ విషయంలో ప్రస్తుతం అలాంటి పరిస్థితే నడుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ పేరుతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆడిన హైడ్రామా అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. ఆయన్ను తెలుగుదేశంలోకి తీసుకోవద్దని ఆ పార్టీ నేతలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో బ్రదర్స్‌కు మైండ్‌బ్లాక్ అయ్యింది. ఇద్దరి రాజకీయ భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి.
సంవత్సరంగా..
ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి ప్రణాళిక ప్రకారమే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఇచ్చింది. ఎమ్మెల్యేకు అన్నివిధాలా స్వేచ్ఛ ఇచ్చింది. దీన్ని అలుసుగా తీసుకున్న కోటంరెడ్డి తన సోదరుడిని షాడో ఎమ్మెల్యేగా పెట్టారు. పారీ్టలతో సంబంధం లేకుండా దందాలు, దౌర్జన్యకాండ చేసి ఆర్థికంగా ఊహించని స్థాయికి వెళ్లారు. వైఎస్సార్‌సీపీలో ఉంటే టికెట్‌కే ఎసరొస్తుందని ఎమ్మెల్యే భావించారు. అప్పటికే ఎమ్మెల్యే వల్ల తీవ్ర ఇబ్బందులు పడిన టీడీపీ నాయకులు ఆయన్ను ఒంటరి చేయాలని ట్రాప్ చేశారు. ఇదంతా తన బలమేనని ఊహించుకున్న ఎమ్మెల్యే టీడీపీ వలలో చిక్కుకున్నాడు.
ఫోన్ ట్యాపింగ్ జరిగితే కదా..
ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్‌కు ముందే శ్రీధర్‌రెడ్డి జిల్లా మాజీ మంత్రి ప్రధాన అనుచరుడి ద్వారా చంద్రబాబును కలిశారు. అంతకు ముందే నారా లోకేశ్‌తో మంతనాలు చేశారు. ఎమ్మెల్యే సోదరుడు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డికి టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడితో వ్యాపార సంబంధాలు ఉండటంతో ఆయనతో మాట్లాడుకున్నారు. ఒకప్పుడు టీడీపీలో కీలకంగా ఉండి నేడు బీజేపీలో ఉన్న ఓ నాయకుడితో రహస్య చర్చలు జరిపారు. అంతా ఓకే అనుకున్న తర్వాత వాయిస్ రికార్డ్‌ను చూపించి నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ హైడ్రామా నడిపారు. కానీ ఎమ్మెల్యే స్నేహితుడు లంకా రామశివారెడ్డి ఇదంతా ఉత్తిదేనని, అది వాయిస్ రికార్డ్ అని తేల్చడంతో ఫ్లాప్ షోగా తేలిపోయింది.
కాగా ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్రానికి లేఖ రాశానంటూ ఎమ్మెల్యే హడావుడి చేశారు. విచారణ జరిపించాలంటే వెంటనే సంబంధిత ఫోన్‌ను పోలీసులకు ఇవ్వాలి. అవసరమైతే కోర్టు ద్వారానైనా విచారణ చేయించుకోవాలి. కానీ అలా జరగలేదు. అదే కోటంరెడ్డి స్నేహితుడు రామశివారెడ్డి మాత్రం తన ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి వాస్తవాలు తేల్చండంటూ చెప్పినట్లుగా కూడా ఎమ్మెల్యే చెప్పలేకపోయాడు. ఇక ఈ ఎపిసోడ్ రక్తికట్టదని తెలుసుకుని విచారణ పేరుతో ఆ నెపం కేంద్రంపై నెట్టేశారు.
ఆయనొస్తే మేం ఉండం
ప్రణాళిక ప్రకారమే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేను ట్రాప్‌లోకి దించిన టీడీపీ ఇప్పుడు మాత్రం మాకేమీ తెలియదని చేతులెత్తేసింది. ఆయన రాకను జీరి్ణంచుకోలేని నేతలు తమ పార్టీ అ«ధినేత చంద్రబాబుకు ఏకంగా హెచ్చరికలే చేశారు. రెండురోజుల క్రితం చంద్రబాబు నెల్లూరు నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. ఈక్రమంలో టీడీపీ కీలక నేతలంతా కోటంరెడ్డి అరాచకాలపై ఏకరువు పెట్టారు. ఆయన టీఎన్‌ఎస్‌ఎఫ్ నేతపై హత్యాయత్నం నుంచి మరికొందరు నాయకులపై దాడులు చేయించడం, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆర్థిక మూలాలపై కోలుకోలేని దెబ్బతీసిన వైనాన్ని వివరించారు. మూడన్నరేళ్లపాటు అష్టకష్టాలు పెట్టిన వ్యక్తికి మేమే ఎలా జేజేలు కొట్టాలంటూ బాబునే నిలదీశారని తెలిసింది. ఆయన పార్టీ కండువా కప్పుకోక ముందే నేనే అభ్యరి్థనని ఎలా ప్రకటించుకుంటారని ప్రశ్నించారని సమాచారం. శ్రీధర్‌రెడ్డి వస్తే మాత్రం మేం వెళ్లిపోతామని తెగేసి చెప్పడంతో కంగుతిన్న బాబు హామీ ఉత్తిదేనని అజీజ్‌నే ఇన్‌చార్జిగా కొనసాగిస్తానని చెప్పారని ప్రచారం జరుగుతోంది. అబ్దుల్ అజీజ్ త్వరలోనే నియోజకవర్గంలో పాదయాత్ర ద్వారా కార్యకర్తలను కలిసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడని తెలిసింది.
అచ్చెన్నా.. మా సంగతి చూడు
పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో శ్రీధర్‌రెడ్డి తన సోదరుడు గిరిధర్‌రెడ్డిని రంగంలోకి దింపారు. అచ్చెన్నాయుడితో వ్యాపార సంబంధాల నేపథ్యంలో అతని ద్వారానైనా చంద్రబాబును ఒప్పించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలిసింది. మూడు రోజుల క్రితం గిరిధర్‌రెడ్డి అచ్చెన్నాయుడిని కలిసి చంద్రబాబుతో చెప్పి టికెట్ ఇప్పించాలని అడిగినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. నేనైతే హామీ ఇవ్వలేనని.. బాబుకు చెప్పి చూస్తానంటూ అచ్చెన్నాయుడు చెప్పినట్లు సమాచారం. ఏది ఏమైనా కోటంరెడ్డి ఎపిసోడ్ తేలిపోవడం జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment