nellore district tdp leaders
-
ఎన్నికల తర్వాత గ్లాసు కనిపించేనా..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పొత్తు పేరుతో టీడీపీ జిల్లాలో జనసేన పార్టీ జెండా పీకేసే పనిలో ఉంది. క్యాడర్ అంతంత మాత్రంగా ఉన్న జనసేన పార్టీ ఉనికి నెల్లూరు, కావలిలో మాత్రమే కనిపిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను బరిలోకి దింపింది. ఈ దఫా ఎన్నికల నాటికి కావలి, నెల్లూరు సిటీ, రూరల్‌లో మాత్రమే నియోజకవర్గ స్థాయి లీడర్ల హడావుడి కొంత కనిపించింది. తాజాగా టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకోవడంతో జిల్లాలో మిగతా నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ కేడర్ పూర్తిగా కనుమరుగైందనే చెప్పాలి. పాతాళంలోకి పడిపోయి గత సార్వత్రిక ఎన్నికల తర్వాత నెల్లూరు సిటీలో కేతంరెడ్డి వినోద్‌రెడ్డి, నెల్లూరు రూరల్‌లో మనుక్రాంత్‌రెడ్డి, కావలి నుంచి అలహరి సుధాకర్ జనసేన పార్టీని కనిపెట్టుకుని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉనికి చాటుకుంటూ వచ్చారు. అయితే జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ టీడీపీకి మద్దతుగా నిలిచి పొత్తు పెట్టుకోవడంతో నెల్లూరు సిటీ నుంచి నారాయణ టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని గ్రహించిన కేతంరెడ్డి వినోద్‌రెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి తన భవిష్యత్ కోసం వైఎస్సార్సీపీలో చేరిపోయారు. దీంతో మనుక్రాంత్‌రెడ్డి నెల్లూరు రూరల్ నుంచి సిటీకి మారిపోయారు. పొత్తులో భాగంగా నెల్లూరు సిటీ నుంచి తనకు అవకాశం వస్తుందని భావించిన మనుక్రాంత్‌రెడ్డి సిటీ పరిధిలో డివిజన్ల వారీగా పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేశారు. పార్టీ కార్యాలయాలను కూడా ప్రారంభించారు. అయితే నెల్లూరు సిటీ నుంచి టీడీపీ అభ్య ర్థిగా నారాయణ పేరు ఖరారు కావడంతో కనీసం నెల్లూరు రూరల్ సీటు అయినా వస్తుందని ఆశించిన మనుక్రాంత్‌కు భంగపాటు తప్పలేదు. దీంతో పార్టీ క్యాడర్ సైతం చెల్లాచెదురై పరిస్థితి పాతాళానికి పడిపోయింది. మిగతా నియోజకవర్గాల్లో పార్టీ ఇన్చార్జిలు ఉన్నప్పటికీ టీడీపీ అభ్యర్థులు వారిని కనీసం దరిచేరనీయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీతో కలిసి పనిచేయడం అవసరమా? అని లోలోన మదనపడుతున్నారు. ఎన్నికల తర్వాత గ్లాసు కనిపించేనా.. ప్రస్తుతం జిల్లాలో 8 నియోజకవర్గాలు ఉన్నప్పటికీ పొత్తులో భాగంగా ఒక్క స్థానం కూడా జనసేనకు కేటాయించలేదు. అయినప్పటికీ నియోజకవర్గ ఇన్చార్జిలు టీడీపీ విజయం కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా.. టీడీపీ అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా జనసేన జెండా పీకేసేందుకు కంకణం కట్టుకున్నారు. నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థి నారాయణ తన బినామీ అయిన గునుకుల కిషోర్‌ను జనసేనలోకి పంపి ఆయన్ను ముందుంచి మనుక్రాంత్‌రెడ్డిని ఎన్నికల క్షేత్రంలో లేకుండా చేశారు. నారాయణ తన పార్టీ కేడర్‌తో జనసేన జెండాలు మోయిస్తూ ఆ పార్టీని దాదాపు లేకుండా చేశారు. కావలిలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి అలహరి సుధాకర్ టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి కోసం పనిచేస్తున్నారు. అయితే కావ్య కృష్ణారెడ్డి తనదైన ధోరణిలో జనసేన క్యాడర్‌ను టీడీపీ కండువా కప్పుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు అలహరి సుధాకర్ ఇటీవల నాగబాబు, నాదెండ్ల మనోహర్‌లను కలిసి గోడు వెళ్లబోసుకున్నారని తెలిసింది. జిల్లాలో ఎక్కడైతే జనసేన ఉనికి ఉందో అక్కడ ఆ పార్టీ క్యాడర్‌ను సైతం టీడీపీలో కలిపేసుకుని ఆ పార్టీ జెండా పీకేసే పనిలో పచ్చనేతలు నిమగ్నమయ్యారు. ఇదంతా టీడీపీ అధినేత సూచనల మేరకే జరుగుతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే సార్వత్రిక ఎన్నికల తర్వాత జనసేన జెండా కనిపించకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
నారాయణ మాటలతో కంగుతిన్న జనసేన కార్యకర్తలు
అధికారమే పరమావధిగా ఏర్పడిన టీడీపీ, జనసేన కూటమిలో లుకలుకలు అప్పుడే స్టార్టయ్యాయి. జనసేన నిర్వీర్య లక్ష్యంగా టీడీపీ నెల్లూరు నగర అభ్యర్థి నారాయణ తన రాజకీయ వ్యూహంతో పావులు కదుపుతుండ గా, ఈ యత్నాలు సక్సెసయ్యాయి. ఆ పార్టీ నాయకులతో పాటు చిరంజీవి అభిమాన సంఘ నేతలనూ దూరం పెడుతున్నారు. తన కాంపౌండ్‌లోని ఓ చోటా నేతను ఆ పార్టీలోకి పంపి.. ఆయనే కీలక వ్యక్తిగా చూపించి.. ఓ బలమైన సామాజికవర్గానికి చెందిన నేతలకు ప్రాధాన్యం లేకుండా చేశారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో జనసేన పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మారిన రాజకీయ పరిస్థితులతో ఆ పార్టీకి జిల్లాలో సీట్ల కేటాయింపులో టీడీపీ రిక్తహస్తం చూపింది. మరోవైపు టీడీపీ నెల్లూరు నగర అభ్యర్థి నారాయణ తన పోకడలతో ఆ పార్టీని ఖాళీ చేయిస్తున్నారు. జిల్లాలో జనసేన అంటే మనుక్రాంత్రెడ్డే గుర్చొచ్చేవారు. ఆవిర్భావం నుంచే పార్టీలో ఉంటూ జిల్లా బాధ్యతలను తన భుజస్కంధాలపై మోశారు. జిల్లాలో పార్టీ కార్యక్రమాలు.. రాష్ట్రస్థాయి వ్యవహారాల్లో ఆర్థికంగా చేయూతనిచ్చేవారు. జిల్లాలో పార్టీకి బలమైన కేడర్ లేకపోయినా అందులోనే ఉంటూ.. తనకు పార్టీ ద్వారా ఏదో రోజు సరైన గుర్తింపు, ప్రాధాన్యం లభిస్తుందని ఆశించారు. పొత్తులో భాగంగా జిల్లాలో ఒక సీటును జనసేనకు కేటాయిస్తే.. అది తనకే లభిస్తుందని ధీమాగా ఉన్నారు. అంతా.. వారే..! తన సామాజికవర్గానికి చెందిన క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వ్యక్తిని జనసేనలోకి నారాయణ రెండేళ్ల క్రితం పంపారు. రాష్ట్ర స్థాయిలో వేములపాటి అజయ్‌కుమార్‌కు దగ్గర చేశారు. ముఖ్య అనుచరుడిగా ఉన్న చోటా నేత ద్వారా మరో కుంపటి పెట్టించి రాజకీయ కార్యకలాపాలను చేయసాగారు. ఇదంతా ఓ ఎత్తయితే.. ఎన్నికల వేళ మనుక్రాంత్ను పూర్తిగా పక్కన పెట్టేసి తన సామాజికవర్గానికి చెందిన వ్యక్తినే తెరపైకి తీసుకొచ్చారు. దీనికి వేములపాటి వెనుక నుంచి అధిష్టానం ద్వారా గ్రీన్‌సిగ్నల్ ఇప్పించారు. జిల్లాలో జనసేన అంటే ఆ చోటా నేతే అనే తరహాలో బిల్డప్ ఇచ్చారు. పరిచయ కార్యక్రమాల్లోనూ అంతే.. నెల్లూరు సిటీ, కోవూరు నియోజకవర్గాల్లో ఉమ్మడి అభ్యర్థులతో జనసేన పరిచయ కార్యక్రమాలను ఇటీవల నిర్వహించారు. అయితే ఇందులోనూ జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమాన సంఘ నేతలు కనిపించలేదు. వేములపాటి అజయ్‌కుమార్, గునుకుల కిశోరే ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఆ కార్యక్రమానికి వచ్చిన వారంతా టీడీపీ కార్యకర్తలే కావడం విశేషం. గత అనుభవాల నేపథ్యంలో.. గత ఎన్నికల్లో తన ఓటమికి ఓ సామాజికవర్గమే కారణమని భావిస్తున్న నారాయణ.. తాజాగా జరగనున్న ఎన్నికల్లో తన కార్యకలాపాల్లో వారిని దూరం పెట్టేశారు. గత ఎన్నికల్లో టీడీపీ నేతలు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, రమేష్‌రెడ్డి తదితరులు డబ్బులు పంచకపోవడంతోనే తాను ఓటమి పాలయ్యాయని తన అనుచరుల వద్ద వాపోయారని తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని భావించిన నారాయణ.. ఆ సామాజికవర్గాన్ని పూర్తిగా పక్కనబెట్టేశారనే ప్రచారం జరుగుతోంది. అభిమాన సంఘాలకు చోటేదీ..? చిరంజీవి, పవన్ కల్యాణ్ అభిమాన సంఘాల నేతలు, జనసేన క్యాడర్ టీడీపీ ప్రచార కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొన్న దాఖలాల్లేవు. టీడీపీ నేతలతోనే జనసేన జెండాలను గునుకుల కిశోర్ మోయించి.. ప్రచారం చేయిస్తున్నారని అభిమాన సంఘాల నేతలు వాపోతున్నారు. క్రమక్రమంగా దూరం తన సొంత నిధులను పెద్ద మొత్తంలో వెచ్చించి పార్టీ కేడర్‌ను మనుక్రాంత్‌రెడ్డి పెంచుకుంటూ వచ్చారు. నగర నియోజకవర్గ పరిధిలో డివిజన్ల వారీగా జనసేన కార్యాలయాలను తెరిచి ప్రచారం చేసుకున్నారు. అయితే పొత్తులో భాగంగా నెల్లూరు సిటీని టీడీపీకి కేటాయించడంతో రూరల్ స్థానం నుంచి పోటీ చేసేందుకు నిధులను నారాయణ సమకూర్చుతారంటూ బుజ్జగించారు. అయితే అక్కడా ఆయనకు సీటు లభించలేదు. అయినా పార్టీ ఆదేశాల మేరకు టీడీపీ కోసం పనిచేస్తుండగా.. నారాయణ క్రమక్రమంగా దూరం పెట్టారు. -
టీడీపీ నాయకుల అరాచకం
ఆత్మకూరు: టీడీపీ నాయకులు అరాచకం సృష్టించారు. సంక్రాంతి సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలను అడ్డుకుని మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని చేజర్ల మండలం మడపల్లి గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు మడపల్లి గ్రామంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఆదివారం సంక్రాంతి సంబరాలు జరిగాయి. స్థానిక రామాలయం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో టీడీపీకి చెందిన పెద్దిరెడ్డి కిరణ్, కిషోర్, నవీన్, వినయ్, పూర్ణచంద్ర తదితరులు అడ్డుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గ్రామస్తులందరూ కలిసి ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని, నిలిపివేయమనడం సరికాదని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు చెప్పారు. దీంతో చెలరేగిపోయిన టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు. ఫలితంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. గ్రామపెద్దలు ఇరువర్గాలకు సర్దిచెప్పి పంపారు. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో టీడీపీకి చెందిన కిరణ్, కిషోర్ తదితరులు వైఎస్సార్ సీపీకి చెందిన ఇనకల్లు ప్రసాద్‌రెడ్డి, పెంచలరెడ్డి, మాజీ సర్పంచ్ గుండుబోయిన నారాయణయాదవ్ ఇళ్లపై రాళ్లు, కర్రలు, కొడవలి తదితర మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. దాడిలో ప్రసాద్‌రెడ్డికి గాయాలు కాగా, పైదంతాలు రెండు ఊడిపోయాయి. పెంచలరెడ్డి, నారాయణయాదవ్లకూ గాయాలయ్యాయి. స్థానికులు గట్టిగా కేకలు వేయడంతో టీడీపీ నాయకులు పరారయ్యారు. గాయపడిన వారిని తొలుత చేజర్ల పీహెచ్‌సీకి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆత్మకూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎస్సై ప్రభాకర్ సిబ్బందితో కలిసి ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి చేరుకుని బాధితుల నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. -
టీడీపీకి ఆనం షాక్.. అయోమయ స్థితిలో కోటంరెడ్డి
వైఎస్సార్సీపీ కంచుకోటగా పేరొందిన నెల్లూరు జిల్లాలో పాగా వేయడానికి టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు ఆది నుంచి బెడిసి కొడుతున్నాయి. పార్టీ సీనియర్లకు టికెట్ ఇస్తే ఓటమి తప్పదని, కొత్త వారికి ఇద్దామంటే అభ్యర్థులు దొరకడం లేదని అధిష్టానం తలలు పట్టుకుంటోంది. నెల్లూరు ఎంపీతో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల నియామకం ఒక సమస్య అయితే జనసేనతో పొత్తు పచ్చనేతల్లో వర్గపోరుకు దారితీస్తోంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి పార్లమెంట్ నుంచి అసెంబ్లీ స్థానం వరకు ఎవరూ బరిలో దిగేందుకు ఆసక్తి చూపని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో నెల్లూరు పార్లమెంట్ స్థానానికి కొత్త అభ్యర్థి కోసం అధిష్టానం అన్వేషణ చేస్తోంది. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు ఓటమి చెందారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉండడంతో నెల్లూరు పార్లమెంట్ సీటుకు టీడీపీ తరఫున ఎవరు పోటీ చేసినా ఓటమి తప్పదనేది భయంతో పలాయనం చిత్తగిస్తున్నారు. జిల్లాలో ఇలా.. జిల్లాలో పలు నియోజకవర్గాల నుంచి కొత్త ముఖాలను బరిలోకి దింపాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. జనసేన పొత్తులో భాగంగా ఆ పార్టీ నేతలు నెల్లూరు సిటీ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి ప్యాకేజీ ఇచ్చి రూరల్ నియోజకవర్గం వైపు మళ్లించే ప్రయత్నాలు చేయిస్తున్నారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. దీంతో నెల్లూరు రూరల్ తనకే అని అనుకుంటున్న వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. టికెట్ ఇస్తే టీడీపీ తరఫున... లేకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని శ్రీధర్‌రెడ్డి నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. ► సర్వేపల్లి నుంచి పోటీ చేసేందుకు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సిద్ధంగా ఉన్నప్పటికీ వరుసగా ఐదుసార్లు ఓటమి చెందిన నేపథ్యంలో ఈసారి కొత్త వ్యక్తిని నిలబెట్టాలని టీడీపీ భావిస్తోంది. అందుకే ఇప్పటి వరకు సోమిరెడ్డి అభ్యర్థిత్వంపై స్పష్టత లేదని సమాచారం. ► కోవూరులో మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ దఫా ఆయన కుమారుడు దినేష్‌రెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో వైఎస్సార్సీపీకి ఉన్న బలంతో పాటు పోలంరెడ్డిపై ఉన్న వ్యతిరేకత కారణంగా ఇక్కడ కూడా కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ► కావలిలో ఇప్పటికే నలుగురు నేతలు టికెట్ అడుగుతున్నప్పటికీ వీరందరూ మండలస్థాయి నాయకులే. కొత్తగా మైనింగ్ మాఫియా డాన్ డి.వెంకటకృష్ణారెడ్డికి సీటు ఇవ్వాలనుకున్నా ఓటమి తప్పదని సర్వేల్లో తేలింది. దీనికి తోడు క్షేత్రస్థాయిలో టీడీపీ క్యాడర్ కూడా సహకరించే పరిస్థితి లేదు. దీంతో ఇక్కడి అభ్యర్థి ఎవరనేది తేలకుండా ఉంది. ► ఉదయగిరిలో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని, ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ టికెట్ మాదే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. పనిలో పనిగా వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నాడు. ఇక బీసీ మార్కుతో చెంచలబాబు యాదవ్ సీటు ఆశిస్తున్నాడు. మరి చంద్రబాబు బ్యాగ్ బరువున్న వ్యక్తుల వైపే చూస్తాడా? సామాజిక న్యాయం వైపు చూస్తాడా అనేది తేలాల్సి ఉంది. ► ఆత్మకూరు నుంచి వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని దింపాలని యోచిస్తున్న టీడీపీకి ఆయన బిగ్‌షాక్ ఇచ్చినట్లు తెలిసింది. ఆత్మకూరు నుంచి పోటీలో ఉండబోనని తెగేసి చెప్పినట్లు సమాచారం. ఇటీవల వరుసగా రెండు దఫాలు ఆయన సొంతంగా సర్వే నిర్వహిస్తే ప్రజాదరణ తక్కువగా ఉన్నట్లు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆనం సైతం ముఖం చాటేస్తున్నట్లు తెలుస్తోంది. ► కందుకూరు నుంచి ఇంటూరి బ్రదర్స్ మధ్య పోటీ ఉంది. ఇందులో ఇంటూరు నాగేశ్వరరావుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారనే ప్రచారం నడుస్తోంది. అయితే వైఎస్సార్సీపీ బలంగా ఉన్న కందుకూరులో టీడీపీ ఓటమి తప్పదని, దీంతో కొత్త వారికి టికెట్ ఇవ్వాలనే ఆలోచనతో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఎదురు పెట్టుబడికి సిద్ధంగా అధిష్టానం మొత్తంగా అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలా ఉండడంతో ఆ పార్టీ అధినేత తల పట్టుకున్నట్లు సమాచారం. సీట్ల కోసం డబ్బు మూటలతో వస్తారని ఆశించిన చంద్రబాబుకు పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువు కావడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. అయితే సర్వేపల్లి, కోవూరు, కావలి, కందుకూరు, ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల నుంచి ఆ పార్టీకి అభ్యర్థులు ఉన్నప్పటికీ కనీసం అధికార పార్టీకి ఏ మాత్రం పోటీ ఇచ్చే స్థాయి నేతలు కాకపోవడంతో వీరి స్థానంలో కొత్త వారిని రంగంలోకి దింపాలని టీడీపీ అధినేత యోచన. ఇందుకు బడాబాబులను ఆహ్వానిస్తున్నప్పటికీ పోటీకి వారు కూడా సిద్ధంగా లేకపోవడంతో కొంచెం పెట్టుబడి మీరు పెట్టండి.. మిగతాది పార్టీ చూసుకుంటుందని హామీ ఇస్తున్నారంట. కొత్త వారు దొరక్కపోతే కోవూరు, కందుకూరు, ఉదయగిరిలో పాత వారికే టికెట్లు కేటాయించే అవకాశం ఉంది. సర్వేపల్లి, కావలి, ఆత్మకూరులో కచ్చితంగా కొత్త అభ్యర్థులు వస్తారని తెలుస్తోంది. -
40 ఏళ్ళలో నెల్లూరు సిటీలో టీడీపీ గెలిచింది రెండుసార్లే
-
కోటంరెడ్డికి ఊహించని షాక్..!
సాక్షి, నెల్లూరు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి మరో షాక్ తగిలింది. కోటంరెడ్డిపై టీడీపీ దళిత నేత మాతంగి కృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. శ్రీధర్‌రెడ్డిని పార్టీలోకి రానిచ్చే ప్రసక్తే లేదంటూ సంచలన కామెంట్స్ చేశారు. కాగా, మాతంగి కృష్ణ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. నన్ను హత్య చేయించడానికే కోటంరెడ్డి ప్రయత్నించాడు. 25 మంది అనుచరులను నాపైకి దాడికి పంపాడు. ఈ ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశాను. అసలు సూత్రధారి కోటంరెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి. కోటంరెడ్డిని పార్టీలోకి రానిచ్చే ప్రసక్తే లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే.. నెల్లూరులో నాలుగు నెలల క్రితం మాతంగి కృష్ణపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనపై వేదాయపాళెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అప్పట్లో సాక్ష్యాలు లభ్యం కాలేదు. తాజాగా పలువురు ప్రత్యక్ష సాక్షులు ముందుకొచ్చి సాక్ష్యం చెప్పడంతో గత రాత్రి తాటి వెంకటేశ్వర రావు, మన్నేపల్లి రఘు, జావెద్ అనే ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇంకా ఏడుగురు నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉందని, వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి తెలియజేశారు. -
కోటంరెడ్డి హైడ్రామా అట్టర్‌ఫ్లాప్.. బెడిసికొట్టిన పొలిటికల్ ప్లాన్!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘ఏదో జరుగుతుంది అనుకుంటే.. ఇంకేదో జరుగుతోంది..’.. కోటంరెడ్డి బ్రదర్స్ విషయంలో ప్రస్తుతం అలాంటి పరిస్థితే నడుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ పేరుతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆడిన హైడ్రామా అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. ఆయన్ను తెలుగుదేశంలోకి తీసుకోవద్దని ఆ పార్టీ నేతలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో బ్రదర్స్‌కు మైండ్‌బ్లాక్ అయ్యింది. ఇద్దరి రాజకీయ భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. సంవత్సరంగా.. ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి ప్రణాళిక ప్రకారమే వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఇచ్చింది. ఎమ్మెల్యేకు అన్నివిధాలా స్వేచ్ఛ ఇచ్చింది. దీన్ని అలుసుగా తీసుకున్న కోటంరెడ్డి తన సోదరుడిని షాడో ఎమ్మెల్యేగా పెట్టారు. పారీ్టలతో సంబంధం లేకుండా దందాలు, దౌర్జన్యకాండ చేసి ఆర్థికంగా ఊహించని స్థాయికి వెళ్లారు. వైఎస్సార్సీపీలో ఉంటే టికెట్‌కే ఎసరొస్తుందని ఎమ్మెల్యే భావించారు. అప్పటికే ఎమ్మెల్యే వల్ల తీవ్ర ఇబ్బందులు పడిన టీడీపీ నాయకులు ఆయన్ను ఒంటరి చేయాలని ట్రాప్ చేశారు. ఇదంతా తన బలమేనని ఊహించుకున్న ఎమ్మెల్యే టీడీపీ వలలో చిక్కుకున్నాడు. ఫోన్ ట్యాపింగ్ జరిగితే కదా.. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్‌కు ముందే శ్రీధర్‌రెడ్డి జిల్లా మాజీ మంత్రి ప్రధాన అనుచరుడి ద్వారా చంద్రబాబును కలిశారు. అంతకు ముందే నారా లోకేశ్‌తో మంతనాలు చేశారు. ఎమ్మెల్యే సోదరుడు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డికి టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడితో వ్యాపార సంబంధాలు ఉండటంతో ఆయనతో మాట్లాడుకున్నారు. ఒకప్పుడు టీడీపీలో కీలకంగా ఉండి నేడు బీజేపీలో ఉన్న ఓ నాయకుడితో రహస్య చర్చలు జరిపారు. అంతా ఓకే అనుకున్న తర్వాత వాయిస్ రికార్డ్‌ను చూపించి నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ హైడ్రామా నడిపారు. కానీ ఎమ్మెల్యే స్నేహితుడు లంకా రామశివారెడ్డి ఇదంతా ఉత్తిదేనని, అది వాయిస్ రికార్డ్ అని తేల్చడంతో ఫ్లాప్ షోగా తేలిపోయింది. కాగా ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్రానికి లేఖ రాశానంటూ ఎమ్మెల్యే హడావుడి చేశారు. విచారణ జరిపించాలంటే వెంటనే సంబంధిత ఫోన్‌ను పోలీసులకు ఇవ్వాలి. అవసరమైతే కోర్టు ద్వారానైనా విచారణ చేయించుకోవాలి. కానీ అలా జరగలేదు. అదే కోటంరెడ్డి స్నేహితుడు రామశివారెడ్డి మాత్రం తన ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి వాస్తవాలు తేల్చండంటూ చెప్పినట్లుగా కూడా ఎమ్మెల్యే చెప్పలేకపోయాడు. ఇక ఈ ఎపిసోడ్ రక్తికట్టదని తెలుసుకుని విచారణ పేరుతో ఆ నెపం కేంద్రంపై నెట్టేశారు. ఆయనొస్తే మేం ఉండం ప్రణాళిక ప్రకారమే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేను ట్రాప్‌లోకి దించిన టీడీపీ ఇప్పుడు మాత్రం మాకేమీ తెలియదని చేతులెత్తేసింది. ఆయన రాకను జీరి్ణంచుకోలేని నేతలు తమ పార్టీ అ«ధినేత చంద్రబాబుకు ఏకంగా హెచ్చరికలే చేశారు. రెండురోజుల క్రితం చంద్రబాబు నెల్లూరు నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. ఈక్రమంలో టీడీపీ కీలక నేతలంతా కోటంరెడ్డి అరాచకాలపై ఏకరువు పెట్టారు. ఆయన టీఎన్ఎస్ఎఫ్ నేతపై హత్యాయత్నం నుంచి మరికొందరు నాయకులపై దాడులు చేయించడం, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఆర్థిక మూలాలపై కోలుకోలేని దెబ్బతీసిన వైనాన్ని వివరించారు. మూడన్నరేళ్లపాటు అష్టకష్టాలు పెట్టిన వ్యక్తికి మేమే ఎలా జేజేలు కొట్టాలంటూ బాబునే నిలదీశారని తెలిసింది. ఆయన పార్టీ కండువా కప్పుకోక ముందే నేనే అభ్యరి్థనని ఎలా ప్రకటించుకుంటారని ప్రశ్నించారని సమాచారం. శ్రీధర్‌రెడ్డి వస్తే మాత్రం మేం వెళ్లిపోతామని తెగేసి చెప్పడంతో కంగుతిన్న బాబు హామీ ఉత్తిదేనని అజీజ్‌నే ఇన్చార్జిగా కొనసాగిస్తానని చెప్పారని ప్రచారం జరుగుతోంది. అబ్దుల్ అజీజ్ త్వరలోనే నియోజకవర్గంలో పాదయాత్ర ద్వారా కార్యకర్తలను కలిసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడని తెలిసింది. అచ్చెన్నా.. మా సంగతి చూడు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో శ్రీధర్‌రెడ్డి తన సోదరుడు గిరిధర్‌రెడ్డిని రంగంలోకి దింపారు. అచ్చెన్నాయుడితో వ్యాపార సంబంధాల నేపథ్యంలో అతని ద్వారానైనా చంద్రబాబును ఒప్పించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలిసింది. మూడు రోజుల క్రితం గిరిధర్‌రెడ్డి అచ్చెన్నాయుడిని కలిసి చంద్రబాబుతో చెప్పి టికెట్ ఇప్పించాలని అడిగినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. నేనైతే హామీ ఇవ్వలేనని.. బాబుకు చెప్పి చూస్తానంటూ అచ్చెన్నాయుడు చెప్పినట్లు సమాచారం. ఏది ఏమైనా కోటంరెడ్డి ఎపిసోడ్ తేలిపోవడం జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. -
కోటంరెడ్డికి ఊహించని షాక్.. దెబ్బ అదుర్స్!
తనకు రాజకీయ భిక్ష పెట్టి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన పార్టీపై టీడీపీ ట్రాప్‌లో పడి నిందారోపణలు చేసిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా మారింది. టీడీపీతో లాలూచీ పడి ప్రభుత్వంపై ‘ఫోన్ ట్యాపింగ్’ నిందలు వేసి సొంత పార్టీపై ధిక్కార స్వరం వినిపించిన ఆయనకు తెలుగు తమ్ముళ్లు అడ్డుపడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం జిల్లా టీడీపీ నేతల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని కోటంరెడ్డికి ముఖం చాటేసిట్లు తెలిసింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పరిస్థితి ప్రస్తుతం రెంటికీ చెడ్డ రేవడిలా తయారయింది. నిందారోపణలతో సొంత పార్టీలో స్థానం కోల్పోయిన ఆయన టీడీపీలో ఎంట్రీకి గేట్లు పడినట్లు తెలుస్తోంది. ‘అయటగ్యయ్యో.. కోటంరెడ్డి.. పుట్టింట్లోళ్లు తరిమేశారు.. నమ్ముకున్నోళ్లు వదిలేశారు..’ అన్నట్లు మారింది. నిన్నటి వరకు వెన్నంటి ఉంటామన్న కొందరు కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు తమకు వైఎస్సార్సీపీయే ముఖ్యమని కోటంరెడ్డికి ఝలక్ ఇచ్చారు. తనకు తానుగా టీడీపీ నుంచి రూరల్ అభ్యర్థిగా పోటీ చేస్తానని బాహాటంగా చెప్పుకున్న ఆయన్ను టీడీపీలోకి రానివ్వద్దంటూ జిల్లా తమ్ముళ్లు చంద్రబాబు వద్ద మొర పెట్టుకోవడంతో కోటంరెడ్డి పరిస్థితి రివర్స్ అయినట్లు తెలుస్తోంది. నిన్న.. మొన్నటి వరకు అధికార మదంతో ఘీంకరించి రౌడీమూకలతో దాడులు చేయించిన కోటంరెడ్డిని టీడీపీలోకి తీసుకుంటే పార్టీ పరువు పోతుందని, తర్వాత రాజకీయ పరిస్థితులను చంద్రబాబుకు వివరించడంతో ఆయన సైతం పార్టీ నేతల అభిప్రాయాలను పరిగణిలోకి తీసుకుని సరే అన్నట్లు సమాచారం. దీంతో టీడీపీ కోటంరెడ్డిని అక్కున చేర్చుకునే పరిస్థితి కనిపించడం లేదు. ముందుగానే నో ఎంట్రీ పార్టీ కండువా మారకముందే తానే టీడీపీ అభ్యర్థినని ప్రకటించుకోవడంపై టీడీపీ యకులు మూకుమ్మడిగా చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వారం రోజులుగా కోటంరెడ్డి ఎపిసోడ్ పరిశీలిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు కూడా నో ఎంట్రీ అన్నట్లు తెలిసింది. కోటంరెడ్డి రాకను ఆ పార్టీ నాయకులే అడ్డుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. నిన్నటి వరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దౌర్జన్యకాండతో టీడీపీ నేతలను అల్లాడించాడని, కోటంరెడ్డిని పారీ్టలోకి ఆహా్వనిస్తే పార్టీ నేతలు ఆయనతో కలిసి పనిచేయరని, పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోతుందని నేతలు తమ పార్టీ అధినేత వద్ద మొరపెట్టుకున్నట్లు తెలుస్తోంది. మూడున్నర ఏళ్లుగా కోటంరెడ్డి చేసిన అవినీతి, అరాచకాలపై ప్రెస్మీట్లు పెట్టి దుమ్మెత్తి పోసిన అజీజ్, అతని మిత్రబృందం, పార్టీ కేడర్ ప్రస్తుతం కోటంరెడ్డిని పారీ్టలోకి అహా్వనిస్తే వీరంతా దూరమవుతారని సీనియర్ నేతల ద్వారా చంద్రబాబుకు చెప్పించినట్లు సమాచారం. దీంతో చంద్రబాబు సైతం కోటంరెడ్డి ఆశలకు బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. కోటంరెడ్డికి కార్పొరేటర్ల షాక్ నెల్లూరు రూరల్ పరిధిలో 26 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అందరూ తన అడుగుజాడల్లో నడుస్తారని భ్రమించిన కోటంరెడ్డికి ఇప్పటికే 18 మంది కార్పొరేటర్లు ఝలక్ ఇచ్చారు. స్థానిక ప్రజాప్రతినిధులు వైఎస్సార్సీపీని వీడమని స్పష్టం చేశారు. మా జెండా, అజెండా పారీ్టనే అంటూ కోటంరెడ్డికి తెగేసి చెప్పారు. తాజాగా నియోజకవర్గ సమన్వయకర్తగా ఎంపికైన ఆదాల ప్రభాకర్‌రెడ్డికి జై కొట్టారు. మరికొందరు జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ త్వరలోనే గుర్తింపు ఇచ్చిన పారీ్టతోనే పయనించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అటు కార్పొరేటర్లే కాదు రూరల్ పరిధిలో ఉండే సర్పంచ్‌లు, ఎంపీటీసీలు సైతం పార్టీతోనే పయనిస్తుండడంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి ఏకాకి అయ్యారు. నిన్న మొన్నటి వరకు వాపును బలుపుగా భావించిన కోటంరెడ్డికి షాక్‌ల మీద షాక్‌లు తగిలి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయిందని పరిశీలకులు భావిస్తున్నారు. ‘చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మా ఒంటరి నడకా.. తెలిసీ అడుగేసినావె ఎడారంటి ఆశల వెనకా..’ అంటూ ఆయన సన్నిహితులు, అభిమానులు విచార గీతం ఆలపిస్తున్నారు. ఆదరించిన పార్టీకే సున్నం 2014 ఎన్నికల ముందు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి రాజకీయంగా ఏ చిన్న పదవి లేదు. విద్యార్థి దశ నుంచి ఉద్యమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న శ్రీధర్‌రెడ్డి అప్పుడెప్పుడో బీజేపీ తరఫున ఎంపీపీ పదవికి పోటీచేసి ఓటమి చెందారు. ఆ పార్టీ నుంచే బహిష్కరణకు గురైన ఆయన సొంతంగా భగత్‌సింగ్ యువమోర్చా పార్టీని పెట్టి ఏడాది కూడా నడిపించలేక కాంగ్రెస్‌లోకి వెళ్లాడు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలెప్మెంట్ డైరెక్టర్ పదవి పొందాడు. వైఎస్సార్ మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట నడిచారు. దీంతో ఏకంగా 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యేగా అవకాశం కలి్పంచారు. దివంగత వైఎస్సార్ చరిష్మాతో పాటు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభతో రెండు దఫాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పార్టీ బలంతో గెలిచిన ఆయన తన బలంగా భ్రమించి మత్తగజంలా వ్యవహరించాడు. ఆదరించి... అందలమెక్కించిన పారీ్టకే సున్నం పెట్టడానికి ప్రయత్నించాడు. మూడున్నర ఏళ్లుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎమ్మెల్యేగా కోటంరెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. ప్రజాసేవతో ప్రభుత్వానికి కీర్తిప్రతిష్టలు తీసుకురావాల్సిన ఆయన అధికార మదంతో రౌడీమూకలను నెలవారీ జీతాలతో ప్రోత్సహించి పార్టీలకు అతీతంగా తనకు గిట్టని వారిపై, ప్రత్యర్థులపై దాడులు చేయించి భయభ్రాంతులకు గురి చేశాడు. టీడీపీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీశాడు. ఆదరించిన పారీ్టకే సున్నం చీటీడీపీ ట్రాప్‌లో పడి.. కోటంరెడ్డి ఎపిసోడ్ గమనిస్తున్న టీడీపీకి చెందిన అబ్ధుల్అజీజ్ నుంచి మాజీమంత్రి సోమిరెడ్డి, బీద రవిచంద్ర, నారాయణ వంటి కీలక నేతలు అతన్ని రాజకీయ సమాధి చేయాలని వ్యూహాత్మకంగా పావులు కదిపారు. వైఎస్సార్సీపీలో కోటంరెడ్డి భవిష్యత్ ప్రశ్నార్థకంగా ఉండడంతో టీడీపీ అధిష్టానం వ్యూహాత్మకంగా తమ ట్రాప్‌లో పడేలా చేసింది. గతేడాది నుంచి టీడీపీ అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగానే వ్యవహరిస్తూ వచ్చాడు. అమరావతి రైతులకు స్వాగతాల నుంచి తరచూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వచ్చి చివరకు పారీ్టపైనే నిందలు వేసి బయటకు వెళ్లాడు. అంతవరకు వ్యూహాత్మకంగా పావులు కదిపిన టీడీపీ తమ వలలో చిక్కుకున్న కోటంరెడ్డికి పారీ్టలో ఎంట్రీకి చెక్ పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. -
డబ్బు పంచుతూ దొరికిపోయిన ‘నారాయణ’ సిబ్బంది
సాక్షి, నెల్లూరు: వచ్చే ఎన్నికల్లో డబ్బుతో గెలిచేందుకు మంత్రి నారాయణ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. నెల్లూరు నగరంలోని చిన్న బజార్లో ‘నారాయణ’ విద్యాసంస్థల సిబ్బంది, టీడీపీ నాయకులు ఓటర్లకు డబ్బులు పంచుతుండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, స్థానికులు వాళ్లను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. వీరి వద్ద భారీ నగదు ఉన్నట్లు తెలిసింది. ఇక, నారాయణ విద్యాసంస్థ ఏజీఎం రమణారెడ్డి, మరో జూనియర్ లెక్చరర్ ఓటర్లకు నగదు పంపిణి చేస్తుండగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న వారి నుంచి సుమారు రు. 15 లక్షలు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. రమణా రెడ్డి నేతృత్వంలోనే నగదు పంపిణి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వైఎస్సార్సీపీ ఓటు బ్యాంక్ ఉన్న ప్రాంతాల్లో డబ్బుతో ఓట్లను కొనేందుకు నారాయణ ప్రయత్నిస్తున్నారని నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. నారాయణ విద్యా సంస్థల ఉద్యోగులతో ఈ విధంగా డబ్బును పంపిణీ చేయిస్తున్నారన్నారని ఆయన అన్నారు. దీనిపై వెంటనే ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
రండి బాబూ..రండి! టీడీపీలో ఎంపీ అభ్యర్థులు కరువు..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీ నుంచి నెల్లూరు ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు బిగ్ షాట్స్ ఎవరూ దొరక్క ఆ పార్టీ నేతలు అయోమయంలో ఉన్నారు. సరైన అభ్యర్థిని నిలబెట్టలేకపోతే ఈ ప్రభావం అసెంబ్లీ స్థానాలపై పడుతుందని ఆ పార్టీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా అధికార పార్టీలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. పార్టీ ఎంపీ టికెటట్ను బలంగా డిమాండ్ చేసే నేతలే లేకపోవటంతో మీరు పోటీకి ఆసక్తిగా ఉన్నారా? అంటూ పలువురు బడా పారిశ్రామిక వేత్తలకు ఆఫర్లు ఇస్తున్నారు. క్షేత్రస్థాయిలో సమీకరణాలు. బలాబలాలను బేరీజు వేసుకొని గెలుపు అవకాశాలు లేకపోవడంతో ఎవరూ సాహించని పరిస్థితి కొనసాగుతోంది. అసెంబ్లీ టికెట్లు ఆశించి భంగపడిన నేతలకు పార్లమెంట్ టికెట్ అవకాశం ఇస్తామంటూ పార్టీ ముఖ్యులు వారిని కొత్తగా మభ్య పెడుతున్నారు. గతంలో నెల్లూరు పార్లమెంట్ నుంచి టీడీపీ అభ్యర్థిగా మాజీమంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి పోటీ చేసి వైఎస్సార్సీపీ తాజా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి చేతుల్లో ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో ఆయన పార్లమెంట్ ఇన్చార్జిగా ఉన్నప్పటికి పార్టీలో తగ్గిన ప్రాధాన్యం, గౌరవం లేదని నెల్లూరు రూరల్‌కే పరిమితం అయ్యారు. మళ్లీ ఎన్నికలు రావడంతో జనవరి నుంచి వేగంగా రాజకీయ సమీకరణాలు మొదలు కావటంతో ఎంపీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తానని ప్రకటించుకున్నారు. అయితే తాజాగా టికెట్ల కేటాయింపుల విషయం వచ్చే సరికి నెల్లూరు రూరల్ అసెంబ్లీ స్థానానికే ఆయన పరిమితమయ్యారు. పార్టీ టికెట్ ఆశించిన నేతలు అసమ్మతి గళం వినిపించిన క్రమంలో పార్టీ అధినేత నిర్ణయం మేరకు రూరల్ నుంచి పోటీ చేయాల్సి వస్తుందని చెప్పి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. దీంతో నెల్లూరు పార్లమెంట్‌కు అభ్యర్థి లేకుండా పోయారు. వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి టీడీపీలో కావలి అసెంబ్లీ సీటు ఇస్తే తాను పోటీకి సుముఖంగా ఉన్నానని, మంతనాలు నిర్వహించడానికి వచ్చిన మంత్రి సోమిరెడ్డి, మాజీ మంత్రి ఆదాలకు సృష్టం చేశారు. అయితే కావలి సీటును మాజీ ఎమ్మెల్యే బీద మస్తానరావుకు కేటాయించటంతో కావలి సీటు ఆశలు గల్లంతయ్యాయి. జిల్లాకు చెందిన ఒక బడా పారిశ్రామిక వేత్త కుమారుడిని రంగంలోకి దించాలని సీఎం పేషి అధికారులు భావించి ఆ మేరకు వారికి సమాచారం ఇచ్చారు. సదరు పారిశ్రామికవేత్త సర్వే నిర్వహించుకోని తమకు సీటు, రాజకీయాలు వద్దని సున్నితంగా తిరస్కరించారు. ఎంపీ టికెట్ ఇప్పిస్తామని స్థానిక నేతలు అయితే హామీలు ఇచ్చారు కానీ పార్టీ పెద్దల నుంచి పిలుపు రాకపోవటంతో కాటంరెడ్డి మౌనంగా ఉండిపోయారు. అసలు ఆయన పార్లమెంట్‌కు పోటీ చేయడానికి సుముఖంగా లేరనే ప్రచారం కూడా బలంగా సాగుతోంది. ఉదయగిరి, ఆత్మకూరు టికెట్ల ఆశించి భంగపడిన డీసీసీబీ బ్యాంకు చైర్మన్ మెట్టుకూరు ధనుంజయరెడ్డి తనకు అవకాశం ఇస్తే పార్లమెంట్ నుంచి పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నానని అధిష్టానానికి చెప్పి ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే పార్టీ నుంచి ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించిన సమావేశానికి ఆహ్వానించి, మళ్లీ తర్వాత కలవమని మెట్టుకూరుకు చెప్పినట్లు సమాచారం. కోవూరు టికెట్ ఆశించి భంగపడిన పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి అసమ్మతి రాగం వినిపించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవిలో నియమించారు. ఎంపీగా తనకు అవకాశం ఇస్తే పోటీకి సిద్ధం అని ప్రకటించుకుని తన అభ్యర్థిత్వం పరిశీలించాల్సిదిగా జిల్లా ముఖ్యుల ద్వారా లాబీయింగ్ నడుపుతున్నారు. ఈ క్రమంలో 9న వచ్చి కలవాలని సీఎం కార్యాలయం నుంచి సమాచారం అందినట్లు సమాచారం. వైఎస్సార్సీపీలో జెడ్పీ చైర్మన్‌గా గెలుపొంది ఇటీవలే పార్టీ నుంచి జంప్ అయిన బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి కూడా తనకు పార్లమెంట్ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మొత్తం మీద అసెంబ్లీ టికెట్లు ఆశించి భంగపడిన నేతలు అందరూ పార్లమెంట్ టికెట్ అడుగుతుండటంతో ఏమీ తేల్చుకోలేని స్థితిలో పార్టీ నేతలు పడటం గమనార్హం. -
ఓట్..అవుట్!
విచ్చలవిడి అవినీతి, అక్రమాలతో ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న అధికార తెలుగుదేశం పార్టీ రానున్న ఎన్నికల్లో అడ్డదారులు తొక్కైనా మళ్లీ గెలవాలనే లక్ష్యంతో పౌరుల ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోంది. గత ఎన్నికల్లో వెంట్రుక వాసిలో అధికారాన్ని చేజిక్కించుకున్న టీడీపీ ఈ దఫా ఓటమి తప్పదని భావించి కుట్రలు చేస్తోంది. వైఎస్సార్సీపీ సానుభూతిపరులు, అభిమానుల ఓట్ల తొలగింపే లక్ష్యంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. రెవెన్యూ అధికారులు (ఎన్నికల అధికారులు) వద్ద ఉండాల్సిన ‘కీ’ తమ పార్టీ కార్యకర్తల చేతికిచ్చి క్షేత్రంలోకి సర్వేల పేరుతో పంపించి రెప్పపాటులో ఓట్లను తొలగించేస్తున్నారు. ఓటర్లకు తెలియకుండా వారి ఓట్లు తొలగించమని ఆన్లైన్ ద్వారా అధికంగా ఫారం–7 దరఖాస్తులు చేస్తున్నారు. నెల్లూరు(పొగతోట): అధికార పార్టీపై ప్రజా వ్యతిరేకత, వైఎస్సార్సీపీపై ప్రజాదరణ రోజు రోజుకు పెరుగుతుండడంతో టీడీపీ నేతలు భారీ సంఖ్యలో ఓట్లు తొలగించే కుట్రకు క్షేత్రస్థాయిలో కుట్రలు పన్నుతున్నారు. ముఖ్యంగా నిరక్షరాస్యులైన పేదలతో పాటు వైఎస్సార్సీపీ అభిమానులు, కార్యకర్తల ఓట్లను అడ్డదారిలో తొలగిస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఓట్ల చేర్పులు, మార్పుల కోసం ఇచ్చిన అవకాశాన్ని అధికార పార్టీ నాయకులు దుర్వినియోగం చేస్తున్నారు. ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా ఓట్లు తొలగించమని 10 వేల ఫారం–7 దరఖాస్తులు వచ్చాయి. సుమారు 3 వేల ఫారం–7 దరఖాస్తులు బీఎల్ఓలకు అందజేశారు. కావలి నియోజకవర్గంలో 3,800, ఆత్మకూరులో 2,900 ఫారం–7 దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా అధికంగా వచ్చాయి. అధికార పార్టీ బోగస్ ఏజెంట్లను నియమించి వారి ద్వారా ఓట్లు తొలగించేలా ఆన్లైన్లో దరఖాస్తులు చేయిస్తున్నారు. చదువుకున్న వారు ఓటు ఉందో లేదో పరిశీలించుకునే అవకాశం ఉంది. చదువు రాని పేద ప్రజలు గుర్తింపు కార్డు ఉందని, ఓటు ఉంటుందనే ఆలోచనతో ఉంటారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే పేద వర్గాలకు మేలు చేకూర్చే విధంగా ఆ పార్టీ ప్రణాళికలు ప్రకటించడంతో నిరక్షరాస్యులు, పేదలు వైఎస్సార్సీపీకి ఓట్లు వేస్తారనే భయంతో ఆయా వర్గాల ఓట్లు తొలగించేలా అధికార పార్టీ కుటిలయత్నాలు చేస్తోంది. అధికార పార్టీకి తొత్తుల్లా అధికారులు అధికార పార్టీ నాయకుల ప్రయత్నాలకు అధికారులకు సహకారం అందించడంతో ఓట్ల తొలగింపు ప్రక్రియ చాపకింద నీరులా జరిగిపోతుంది. జిల్లా జనాభా 32 లక్షలకు పైగా ఉన్నారు. సుమారు 8.50 లక్షల కుటుంబాలు ఉన్నాయి. కుటుంబానికి మూడు ఓట్ల చొప్పున వేసుకున్న జిల్లాలో 25.50 లక్షల ఓట్లు ఉండాల్సి ఉంది. ప్రస్తుతం జిల్లాలో ఓటర్ల సంఖ్య 22,06,652 మాత్రమే ఉన్నాయి. 2015లో 22,78,313 మంది ఓటర్లు ఉంటే.. ప్రస్తుతం అధికారులు ప్రకటించిన జాబితాలను పరిశీలిస్తే 71,661 ఓట్లు తక్కువగా ఉన్నాయి. ఆ ప్రకారం పరిశీలిస్తే ఓటర్ల శాతం తక్కువగా ఉంది. ఒక పక్క ఓట్ల సంఖ్య పెంచేందుకు ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. అర్హులైన వయోజనులు, 18 ఏళ్ల వయస్సు నిండిన వారందరూ ఓటు హక్కుకు దరఖాస్తులు చేసుకోమని ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. పోలింగ్ కేంద్రాల్లో ఓటు నమోదుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో బీఎల్ఓలు అందుబాటులో ఉండి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ ప్రక్రియను అవకాశంగా తీసుకుని టీడీపీ జిల్లాలో 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. వీరు నిత్యం ప్రజలతో ఉంటూ వారి వివరాలు సేకరిçస్తూ ఓట్లు తొలగించేలా ఫారం–7ను ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేస్తున్నారు. ఇందుకు అధికారులు కూడా వారికి సహకరిస్తున్నారు. ఓట్లు కొల్లగొడుతున్న టీడీపీ సైబర్ దొంగలు క్షేత్రస్థాయిలో కొన్ని బృందాలు ఇలా తిరిగి ఓట్లు గల్లంతు చేస్తుంటే.. ఇంకొన్ని టీడీపీ సైబర్ దొంగలు బృందాలుగా ఐవీఆర్ఎస్ (ఇంట్రాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) ప్రక్రియ ద్వారా ఓట్లు కొల్లగొట్టుతున్నారు. రాజధాని అమరావతి నుంచి ప్రజలకు ఐవీఆర్ఎస్ ఫోన్లు వస్తున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన బాగుంటే 1 నొక్కండి.. లేదంటే 2 నొక్కండని వాయిస్ వినిపిస్తున్నారు. రెండు నంబర్ నొక్కిన వారి చిరునామా, డోర్ నంబర్లు సేకరించి ఓట్లు గల్లంతు చేస్తున్నారు. ఓట్లు తొలగిస్తున్నారనే సమాచారం బయటకు రావడంతో ఓటు పోతుందనే భయంతో కొందరు 1 నొక్కుతున్నామని చెబుతుండడం విశేషం. ఇలా జరగాలి.. కానీ ఇలా చేస్తున్నారు.. ఓట్ల చెర్పులు, తొలగింపుల కోసం వచ్చిన దరఖాస్తులను ఆయా మండలాల తహసీల్దార్లకు పంపుతారు. వాటిని డేటా ఎంట్రీ చేయాలి. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో వీఆర్ఓలు, ఆర్ఐలు పరిశీలించి అర్హులు అయితే ఓటు హక్కు కల్పిస్తారు. తొలగింపు దరఖాస్తులు వస్తే.. వాటిని కొన్ని స్థాయిల్లో పరిశీలించి ఓటర్ల జాబితాల నుంచి పేర్లు తొలగిస్తారు. ఇటువంటి ప్రక్రియ చేయకుండానే ఓట్లు తొలగిస్తున్నారు. విషయం తెలియని వారు ఓటు ఉందని భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు అడిగితే అధికారులు లేదని సమాధానం ఇస్తారు. ఓటు హక్కు కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి ఇంత వరకు ఓటు ఇవ్వలేదు. ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు కాలేదు. -
టీడీపీలో రాజకీయ డ్రామా!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికార పార్టీలో ఎన్నికల హీట్ నెల్లూరును పూర్తిస్థాయిలో తాకింది. సీట్ల సర్దుబాట్లు, అసంతృప్తులకు బుజ్జగింపులు, అలకలు హడావుడి తారస్థాయికి చేరింది. పార్టీలో నెలకొన్న అసమ్మతిని చల్లార్చేందుకు శుక్రవారం రాజకీయ డ్రామాకు తెర తీశారు. నగర మేయర్ అబ్ధుల్ అజీజ్‌ను ఎమ్మెల్సీ హామీతో టికెట్ రేస్ నుంచి చక్కగా తప్పించారు. సర్వేపల్లి నుంచి పోటీకి సిద్ధమవుతున్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మరో మంత్రి నారాయణ పదవీ కాలం కూడా కొద్ది రోజుల్లోనే ముగియనుంది. ఆయన కూడా నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసేందుకు దాదాపు ఖరారు కావడంతో ఈ రెండు ఎమ్మెల్సీ పదవులను ఒకటి అజీజ్, మరొకటి ఇంకో నేతకు ఇచ్చి అసంతృప్తులను శాంతింప చేసే అవకాశం ఉందనే ప్రచార బలంగా సాగుతోంది. మరో తిరుగుబాటు నేత పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి పార్టీ నేతలతో నిమిత్తం లేకుండా కోవూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార పర్వం మొదలు పెట్టారు. మొత్తం మీద టీడీపీలో జిల్లా రాజకీయం పూర్తి స్థాయిలో వేడెక్కింది. రెండు రోజులుగా అధికార పార్టీలో కీలకంగా సాగుతున్న పరిణామాలు శుక్రవారం ఒక కొలిక్కి వచ్చాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అసమ్మతి నేతల్ని బుజ్జగించటమే లక్ష్యంగా పదవుల ఎర వేస్తున్నారు. రెండు రోజుల క్రితం కొందరు నేతలకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టారు. కొందరు ద్వితీయశ్రేణి నేతలు తమ సంగతి ఏంటని పార్టీ ముఖ్యుల్ని నిలదీశారు. దీని కొనసాగింపులో భాగంగా శుక్రవారం అమరావతిలో నెల్లూరు రాజకీయ మంత్రాంగం బలంగా నడిచింది. మరో వైపు పదవీ కాలం రెండేళ్లు ఉన్న సర్వేపల్లి టికెట్‌కు పదవీ గండంగా మారుతుందనే యోచనతో మంత్రి సోమిరెడ్డి రాజీనామా చేశారు. అయితే జిల్లాలో మరి కొందరికి ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాల్సి ఉన్నందున సీఎం రాజీనామా చేయించారనే ప్రచారం బలంగా సాగుతోంది. రాజీనామా చేసిన తర్వాత సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన పదవి వేరే నేతలకు ఉపయోగపడితే మంచిది కదా అని వ్యాఖ్యానించటం గమనార్హం. మైనార్టీ కోటాలో ఎమ్మెల్సీ నగర మేయర్‌గా ఉన్న అబ్దుల్ అజీజ్ నగర ఎమ్మెల్యే టికెట్ హామీతో వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయి మేయర్‌గా కొనసాగుతున్నారు. నగర టికెట్ మంత్రి నారాయణకు, రూరల్ టికెట్ మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డికి కేటాయించిన క్రమంలో నగర మేయర్ అనుచరగణం, మైనార్టీ నేతలు నగరంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించి టీడీపీ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సీఎంను కలవాల్సిందిగా నగర మేయర్‌కు పిలుపు వచ్చింది. సీఎంను కలిసినప్పుడు ఎన్నికల ముందే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే దీనికి అనుగణంగా మంత్రి సోమిరెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం, మరో 20 రోజుల్లో మంత్రి నారాయణ పదవీ కాలం ముగియడంతో అజీజ్‌కు దక్కే అవకాశం ఉందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే ఎమ్మెల్సీగా అవకాశం రాగానే అజీజ్ నగర మేయర్ పదవికి రాజీనామా చేయాలి. మేయర్ పదవి ఎవరికి దక్కుతుందనే దానిపై చర్చ మొదలైంది. ప్రచార పర్వంలో అసమ్మతి నేత మరో వైపు శుక్రవారం కోవూరు టీడీపీ నేత పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి విలేకరుల సమావేశ నిర్వహించి కోవూరు నుంచి పోటీకి సిద్ధమైనట్లు ప్రకటించారు. ఇక్కడ టీడీపీ సిటింగ్ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డికి తనకు మధ్య పార్టీ నేతలు చేసిన ఒప్పందం ప్రకారం అవకాశం ఇవ్వాలని రాని పక్షంలో అయినా తాను పోటీలో నిలుస్తానని ప్రకటించుకున్నారు. దీని కొనసాగింపుగా జొన్నవాడలో పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. దీంతో కోవూరు టీడీపీలో రాజకీయ గందరగోళం రేగింది. -
టీడీపీ కంచుకోటకు బ్రేక్
నెల్లూరు /బుచ్చిరెడ్డిపాళెం: టీడీపీ కంచుకోట బీటలు వారింది. కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం కమ్మపాళెం నుంచి 50 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి నాపా వెంకటేశ్వర్లునాయుడు ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తన నివాసంలో మంగళవారం వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే ఈ పంచాయతీలో వందమందికి పైగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీడీపీ కంచుకోటగా ఉన్న ఈ పంచాయతీలో గత పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని నాపా నాగభూషణమ్మ పోటీ చేసి విజయం సాధించిన విషయం విదితమే. నియోజకవర్గ సమన్వయకర్త నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి, మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి సహకారంతో కమ్మపాళెం పంచాయతీలో పార్టీ నాయకుడు నాపా వెంకటేశ్వర్లు నాయుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో తాజాగా అదే పంచాయతీ నుంచి మరో 50 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు చేరడం టీడీపీ కంచుకోటకు బ్రేక్ పడినట్లయింది. ఘనంగా నూతన సంవత్సర వేడుకలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంలో మంగళవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. కోవూరు నియోజకవర్గంతో పాటు జిల్లాలోని పలువురు నేతలు వచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నెల్లూరు మాజీ పార్లమెంట్ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డికి నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. -
నన్నే టార్గెట్ చేస్తారా!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘నియోజకవర్గంలో గ్రూప్ మీటింగ్‌లు ఏంటి.. దీని వెనుక ఎవరున్నారు.. ఎవరి ప్రోత్సాహంతో ఇవన్నీ చేస్తున్నారో అన్నీ తెలుసు.. ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నారో అందరికీ తెలుసు.. కావాలని నన్నే టార్గెట్ చేస్తుంటే చూస్తూ ఉరుకోను.. నేరుగా సీఎం చంద్రబాబునాయుడు వద్దే పంచాయితీ పెట్టి వీళ్లందరి వ్యవహారం చూస్తా’నంటూ మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి ఘాటుగా హెచ్చరించారు. సోమవారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రకు ఫోన్ చేసి సీరియస్ అయినట్లు సమాచారం. ఆదివారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కిలారి వెంకటస్వామినాయుడు నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ సమావేశం పేరుతో అసమ్మతి గళం తారాస్థాయిలో వినిపించిన విషయం తెలిసిందే. సమావేశానికి నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డితోపాటు నామినేట్ పదవుల్లో ఉన్న పలువురు నేతలు హాజరయ్యారు. మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డిని టార్గెట్ చేస్తూ సమావేశం జరగడంపై రాజకీయంగా జిల్లాలో చర్చ జరిగింది. దీనిపై ఆదాల శిబిరం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జిల్లాలో పార్టీ ముఖ్యనేతల తీరుపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం వద్ద తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. మంత్రి సోమిరెడ్డి ప్రోత్సాహంతోనే కిలారి సమావేశం నిర్వహించారని రగిలిపోతున్నారు. నాలుగున్నరేళ్లుగా ఆయనకు గుర్తురాని పార్టీ ఇప్పుడే ఎందుకు గుర్తువచ్చిందని ప్రశ్నిస్తున్నారు. కిలారి బంధువులకు కాంట్రాక్ట్ వర్కులు ఇవ్వకపోవడంతోనే ఇదంతా చేశాడని ఆదాల శిబిరంలో జోరుగా ప్రచారం సాగుతోంది. అలాగే 2000లో పార్టీలోకి వచ్చిన వాళ్లకి పార్టీ బాగా ఉపయోగపడుతోందని, పదవులన్నీ వారికే ఇస్తున్నారని, వారు పార్టీ కోసం చేసింది తక్కువేనని విమర్శిస్తున్నారు. మంత్రులు సైతం ఇలాంటి వారినే ప్రోత్సహిస్తున్నారని, వారి సహకారంతోనే కులరాజకీయాలను సైతం సాగిస్తున్నారని ఫైర్ అవుతున్నారు. అన్నింటికీ ఆయన్నే అడగాలంటే ఎలా? కనీసం వీఆర్ఓ బదిలీ కూడా చేయించుకోలేని పరిస్థితి.. అన్నింటికీ పట్టాభి చెప్పాలంటే ఇక మనం ఏం చేయాలి.. కానీ మమ్మల్నే టార్గెట్ చేసి పనులు, బదిలీలు, ఇళ్ల స్థలాలు అన్నీ చేసుకుంటున్నట్లు ప్రచారం చేస్తున్నారు.. దీనిపై సీఎంతో మాట్లాడి ఎవరెవరు ఏంచేశారో అన్నీ ఆధారాలతో సహా అందజేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే సమావేశం నిర్వహించిన కిలారి వెంకటస్వామినాయుడుతోపాటు అందరిపై చర్యలు తీసుకోవాలని, రెండు మూడు రోజుల్లోనే దీనిపై తేల్చుకుంటామని అనుచరులకు ఆదాల చెప్పినట్లు తెలిసింది. -
నారాయణా.. అంతా మీ ఇష్టమేనా?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలకు కనీస విలువ లేదా.. ఎవరి మనోభావాలతో మీకు పనిలేదా.. మంత్రి నారాయణ, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఇద్దరి మాట మినహా మిగిలిన వారిని కనీసం పట్టించుకోరా’ అంటూ రూరల్ తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడ్డారు. ఆదివారం నగరంలోని కిలారి తిరుపతినాయుడు కల్యాణ మండపంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, రూరల్ టీడీపీ మాజీ అధ్యక్షుడు కిలారి వెంకటస్వామి నాయుడు సమావేశం నిర్వహించారు. సమావేశానికి 130 మంది వరకు సీనియర్ టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ కార్యకర్తలు మంత్రి నారాయణ, మాజీ మంత్రి ఆదాల తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తల మనోభావాలకు సంబంధం లేకుండా మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి అనుచరులకే అన్ని పనులు, పదవులు కట్టబెట్టారని విమర్శించారు. ముఖ్యంగా ఇళ్ల పట్టాలు మొదలుకొని అభివృద్ధి పనుల కాంట్రాక్ట్ వరకు ఆదాల అనుచరుడు, విజయ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి పార్టీ వ్యక్తులకు కాకుండా ఇతర రాజకీయ పార్టీలకు చెందినవారికి కట్టబెడుతున్నారని మండిపడ్డారు. అలాగే మంత్రి నారాయణకు నియోజకవర్గంలో పట్టుమని 10 మందితో పరిచయాలు ఉండవు. అయితే ఆయన నెల్లూరు రూరల్ అభ్యర్థిని నిర్ణయిస్తారు. పనిచేసుకోమని చెబుతారు. ఇలా అయితే పాత వారందరూ పార్టీని వీడిపోవటం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జన్మభూమి కమిటీల్లో పాతవారికి చోటు దక్కలేదని, నీరు–చెట్టు పనులు కూడా పాతవర్గంలో ఒక్కరికీ ఇవ్వలేదని, మంత్రి నారాయణ అన్నీ అతనికి కావల్సిన వారికి, మాజీ మంత్రి ఆదాల తనకు కావల్సిన వారికే ఇస్తుంటే కార్యకర్తలు ఆర్థికంగా ఎలా నిలదొక్కుకుంటారని ప్రశ్నించారు. మా పరిస్థితేంటి? నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జిగా నగర మేయర్ అబ్దుల్ అజీజ్‌ను మంత్రి నారాయణ ప్రకటించడానికి అంతా సిద్ధం చేస్తుంటే మాలాంటి వారి పరిస్థితి ఏంటని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కిలారి వెంకటస్వామి నాయుడు మండిపడ్డారు. 135 మందికి ఇళ్ల పట్టాలు ఇప్పించారు. వారిలో ఒక్కరైనా టీడీపీ కార్యకర్తలు ఉన్నారా అని ప్రశ్నించారు. పింఛన్లు మొదలుకొని రేషన్ డిపోల వరకు ఒక్కదానిలో కూడా మొదటి నుంచి టీడీపీలో ఉన్న వారికి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రూరల్ టీడీపీలో జరుగుతున్న పరిణామాలు, మంత్రి నారాయణ, మాజీ మంత్రి ఆదాల తీరుపై మొదట తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రకు ఫిర్యాదు చేస్తామని, అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్‌కు ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. అలాగే సభ ముగింపు సమయంలో నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసురెడ్డి హాజయ్యారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేతలు పాముల రమణయ్య, కార్పొరేటర్ మన్నెం పెంచలయ్య, నేతలు రామమూర్తి, బద్దేపూడి రవీంద్ర, జలదంకి సుధాకర్, ఉరందుల సురేంద్రబాబు, జానా గిరిబాబు, ఎస్కే ఆసీఫ్, రాఘవప్పనాయుడు, సుబ్బరాజు, శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
పిలిచి అవమానిస్తారా?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి హర్ట్ అయ్యారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి రమ్మని అవమానిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమం మధ్యలోనే ఇంటికి వచ్చేశారు. వెంట నే మంత్రి నారాయణ ఆదాల ఇంటికి వెళ్లి బుజ్జగింపుల పర్వం మొదలు పెట్టారు. ఈ ఘటన అధికార పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. శనివారం నగరంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి నేతృత్వంలో స్వర్ణాల చెరువు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఇరుగాళమ్మ గుడి వద్ద నిర్వహించారు. నుడా నిధులతో చేపట్టే ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి మంత్రి అమర్నాథ్రెడ్డి, జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పి. నారాయణతోపాటు పార్టీ నెల్లూరురూరల్ ఇన్చార్జి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, నగర మేయర్ అబ్దుల్ అజీజ్, పార్టీ నగర ఇన్చార్జి ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి తదితరులు హాజరయ్యారు. శంకుస్థాపన శిలాఫలకంలో ఇన్చార్జి హోదాలో ఉన్న ఆదాల పేరు లేకపోవడం.. ఆనంతరం నిర్వహించిన సభలో వేదిక పైకి ఆదాలను ఆలస్యంగా పిలవడంపై ఆయన హర్ట్ అయ్యారు. దీంతో ఆదాల వేదికపైకి వెళ్లకుండానే తిరిగి ఇంటికి వచ్చేశారు. పిలిచి అవమానించారని ఆదాల అనుచరులు కూడా అక్కడి నుంచి వచ్చేశారు. ఈ వ్యవహారం చర్చనీయాంశం కావడంతో మంత్రి నారాయణ సమావేశం పూర్తికాగానే నేరుగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు. బుజ్జగింపుల పర్వానికి తెర తీశారు. ఇద్దరు ఏకాంతంగా గంటకు పైగా సమావేశమయ్యారు. కాసేపటికి కురుగొండ్ల రామకృష్ణ వచ్చి ఆదాలతో మంతనాలు నిర్వహించారు. మొత్తం మీద ఆదాల ఆగ్రహించిన వ్యవహారం అధికార పార్టీలో చర్చనీయాశంగా మారింది. నుడా చైర్మన్ కోటంరెడ్డి తీరుపై ఆదాల మంత్రి నారాయణ వద్ద ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఉద్దేశపూర్వకంగా పిలిచి అవమానించారని ఆదాల అనుచరులు మంత్రి ఎదుట వాపోయారు. నేలటూరు ఎపిసోడ్‌కు ప్రతీకారం నెల్లూరు రూరల్ వావిలేటిపాడు, మాధరాజుగూడురు వద్ద నేలూటూరు పునరావసా కాలనీ శంకుస్థాపన కార్యక్రమం ఈ నెల 12న జరిగింది. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాజీ మంత్రి ఆదాల నివాసానికి వచ్చి ఇరువురు మాట్లాడుకొని మరీ వెళ్లి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. నేలటూరు పునరావాస కాలనీ కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి పేరు వేయలేదు. అది నెల్లూరు రూరల్ పరిధిలో జరగటం మాజీ మంత్రి ఆదాల తన పేరు వేయించలేదనే భావనతో నుడా చైర్మన్ ఆదాల పేరును శిలాఫలకంలో వేయకుండా, వేదికపైకి ఆలస్యం పిలిచేలా చేశారని ఇదంతా నేలటూరు ఎపిసోడ్‌కు ప్రతీకారం అని ప్రచారం సాగుతోంది. -
దోచుకోవడానికే దుబారా
కావలి : కావలి నియోజకవర్గంలో టీడీపీకి చెందిన పెద్ద తలకాయలు బినామీ కాంట్రాక్టర్ల అవతారమెత్తి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. వివిధ రకాల పనులు కోసమంటూ పలు శాఖలు ద్వారా నిధులను మంజూరు చేసుకొని, మొక్కుబడిగా పనులు చేస్తూ నిధులు స్వాహా జైత్రయాత్ర చేపడుతున్నారు. కావలి పట్టణ పరిధిలో ట్రంక్‌రోడ్డును ఆనుకుని ఉత్తర శివారు ప్రాంతంలో మున్సిపాలిటీకి చెందిన కంపోస్ట్ డంపింగ్ యార్డ్ ఉండేది. అయితే పట్టణం విస్తరిస్తుండడంతో దీన్ని మండలంలోని మోర్లవారిపాళెం ప్రాంతానికి తరలించారు. పాత డంపింగ్ యార్డ్ ఉన్న సర్వే నంబర్ 789లో మొత్తం 8 ఎకరాల స్థలం ఉంది. ఇందులో పార్క్ నిర్మించడానికి 3.2 ఎకరాలను ‘నుడా’కు అప్పగించారు. ఈ స్థలానికి ప్రహరీ లక్షణంగా ఉంది. అయితే ఈ స్థలంలో చెత్తచెదారం ఉండటంతో వాటిని పూర్తిగా తొలగించి, గ్రావెల్ పోసి ఎత్తు లేపాలని ‘నుడా’ అధికారులు స్థానిక మున్సిపాలిటీకి సూచించారు. అయితే ఈ పనులకు సంబంధించిన ప్రక్రియను మున్సిపాలిటీ నేటి వరకు ప్రారంభించనే లేదు. ఈ పనులు పూర్తి కావడానికి కనీసం రెండు నెలలు పడుతుందని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాతనే నుడా నిర్మించ తలపెట్టిన పార్క్ పనులపై దృష్టి పెట్టాల్సి ఉంది. అయితే మున్సిపాలిటీ చేయాల్సిన ప్రాథమిక పనులకు నిధులు లేక మిన్నకుండిపోయింది. అసెంబ్లీ ఎన్నికలు వచ్చే లోగా ప్రభుత్వ నిధులు దిగమింగడానికి టీడీపీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. నుడా ఏర్పడిన తర్వాత కావలికి ఎలాంటి నిధులు కేటాయించలేదు. దీంతో వీరి కన్ను నుడాపై పడింది. నుడా ద్వారా కావలిలో పార్క్ నిర్మాణం చేపట్టాల్సి ఉండడంతో అందుకు సంబంధించి ముందుగానే ప్రహరీని నూతనంగా నిర్మాణం చేపట్టాలనే పేరుతో రూ.50 లక్షలకు అంచనాలు తయారు చేయాలని నుడా అధికారులకు సూచించారు. టీడీపీ నాయకుల కనుసన్నల్లో ఉండే అధికారులు రూ.43,73,605 వ్యయంతో ప్రహరీ నిర్మించేందుకు అంచనాలు రూపొందించారు. అన్ని సాంకేతిక ప్రక్రియలను పూర్తిచేసి టెండరు కూడా పిలిచారు. ఈ టెండరు ఎవరి కంటే వారికి దక్కనీయకుండా టీడీపీ నాయకులే బినామీ పేర్లతో దక్కించుకోవడానికి అంతా సిద్ధం చేశారు. అసలు పార్క్ నిర్మాణ పనులకు నిధులే మంజూరు కాలేదు. ఆ పనులు ప్రారంభం కాకుండానే టీడీపీ నాయకులు ఆ ప్రదేశంలో ఉన్న ప్రహరీ కూల్చేసి కొత్త ప్రహరీ పేరుతో నిధులను లూటీ చేస్తున్న వైనం అధికార వర్గాలే విస్తుపోతున్నాయి. నిధులను అధికార పార్టీ నేతలకు కట్టబెట్టేందుకు ‘నుడా’ పాలక వర్గం ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అనవసరమైన పనులు చేపడుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
వైఎస్ఆర్ సీపీలోకి నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు
-
వైఎస్ఆర్ సీపీలోకి నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు
హైదరాబాద్ : నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఇందుకూరుపేట ఎంపీపీ కైలాసం రేణుకతో పాటు పలువురు ఎంపీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ సర్పంచ్ తదితరులకు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాగా జిల్లాకు చెందిన వైఎస్ఆర్ సీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వీరంతా వైఎస్ఆర్ సీపీలో చేరారు. ఈ కార్యక్రమానికి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు. కాగా హిందూ ధర్మ ప్రచార సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, రాష్ట్ర బీజేపీ నేత ఏలేశ్వరపు జగన్ మోహన్ రాజు సహా పలువురు బ్రాహ్మణ నేతలు నిన్న వైఎస్ఆర్ సీపీలో చేరిన విషయం తెలిసిందే.