
నెల్లూరు /బుచ్చిరెడ్డిపాళెం: టీడీపీ కంచుకోట బీటలు వారింది. కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం కమ్మపాళెం నుంచి 50 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి నాపా వెంకటేశ్వర్లునాయుడు ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తన నివాసంలో మంగళవారం వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే ఈ పంచాయతీలో వందమందికి పైగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
టీడీపీ కంచుకోటగా ఉన్న ఈ పంచాయతీలో గత పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని నాపా నాగభూషణమ్మ పోటీ చేసి విజయం సాధించిన విషయం విదితమే. నియోజకవర్గ సమన్వయకర్త నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి, మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి సహకారంతో కమ్మపాళెం పంచాయతీలో పార్టీ నాయకుడు నాపా వెంకటేశ్వర్లు నాయుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో తాజాగా అదే పంచాయతీ నుంచి మరో 50 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు చేరడం టీడీపీ కంచుకోటకు బ్రేక్ పడినట్లయింది.
ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంలో మంగళవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. కోవూరు నియోజకవర్గంతో పాటు జిల్లాలోని పలువురు నేతలు వచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నెల్లూరు మాజీ పార్లమెంట్ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డికి నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment