నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
హైదరాబాద్ : నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఇందుకూరుపేట ఎంపీపీ కైలాసం రేణుకతో పాటు పలువురు ఎంపీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ సర్పంచ్ తదితరులకు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
కాగా జిల్లాకు చెందిన వైఎస్‌ఆర్ సీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వీరంతా వైఎస్‌ఆర్ సీపీలో చేరారు. ఈ కార్యక్రమానికి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు. కాగా హిందూ ధర్మ ప్రచార సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, రాష్ట్ర బీజేపీ నేత ఏలేశ్వరపు జగన్ మోహన్ రాజు సహా పలువురు బ్రాహ్మణ నేతలు నిన్న వైఎస్‌ఆర్ సీపీలో చేరిన విషయం తెలిసిందే.