కోటంరెడ్డికి ఊహించని షాక్‌.. దెబ్బ అదుర్స్‌! | TDP Chandrababu Gave Twist To Kotam Reddy Sridhar Reddy | Sakshi
Sakshi News home page

కోటంరెడ్డికి ఊహించని షాక్‌.. దెబ్బ అదుర్స్‌!

Published Wed, Feb 8 2023 10:19 AM | Last Updated on Wed, Feb 8 2023 11:10 AM

TDP Chandrababu Gave Twist To Kotam Reddy Sridhar Reddy - Sakshi

తనకు రాజకీయ భిక్ష పెట్టి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన పార్టీపై టీడీపీ ట్రాప్‌లో పడి నిందారోపణలు చేసిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా మారింది. టీడీపీతో లాలూచీ పడి ప్రభుత్వంపై ‘ఫోన్‌ ట్యాపింగ్‌’ నిందలు వేసి సొంత పార్టీపై ధిక్కార స్వరం వినిపించిన ఆయనకు తెలుగు తమ్ముళ్లు అడ్డుపడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం జిల్లా టీడీపీ నేతల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని కోటంరెడ్డికి ముఖం చాటేసిట్లు తెలిసింది.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పరిస్థితి ప్రస్తుతం రెంటికీ చెడ్డ రేవడిలా తయారయింది. నిందారోపణలతో సొంత పార్టీలో స్థానం కోల్పోయిన ఆయన టీడీపీలో ఎంట్రీకి గేట్లు పడినట్లు తెలుస్తోంది. ‘అయటగ్యయ్యో.. కోటంరెడ్డి.. పుట్టింట్లోళ్లు తరిమేశారు.. నమ్ముకున్నోళ్లు వదిలేశారు..’ అన్నట్లు మారింది. నిన్నటి వరకు వెన్నంటి ఉంటామన్న కొందరు కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు తమకు వైఎస్సార్‌సీపీయే ముఖ్యమని కోటంరెడ్డికి ఝలక్‌ ఇచ్చారు.

తనకు తానుగా టీడీపీ నుంచి రూరల్‌ అభ్యర్థిగా పోటీ చేస్తానని బాహాటంగా చెప్పుకున్న ఆయన్ను టీడీపీలోకి రానివ్వద్దంటూ జిల్లా తమ్ముళ్లు చంద్రబాబు వద్ద మొర పెట్టుకోవడంతో కోటంరెడ్డి పరిస్థితి రివర్స్‌ అయినట్లు తెలుస్తోంది. నిన్న.. మొన్నటి వరకు అధికార మదంతో ఘీంకరించి రౌడీమూకలతో దాడులు చేయించిన కోటంరెడ్డిని టీడీపీలోకి తీసుకుంటే పార్టీ పరువు పోతుందని, తర్వాత రాజకీయ పరిస్థితులను చంద్రబాబుకు వివరించడంతో ఆయన సైతం పార్టీ నేతల అభిప్రాయాలను పరిగణిలోకి తీసుకుని సరే అన్నట్లు సమాచారం.  దీంతో టీడీపీ కోటంరెడ్డిని అక్కున చేర్చుకునే పరిస్థితి కనిపించడం లేదు.    

ముందుగానే నో ఎంట్రీ 
పార్టీ కండువా మారకముందే తానే టీడీపీ అభ్యర్థినని ప్రకటించుకోవడంపై టీడీపీ యకులు మూకుమ్మడిగా చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వారం రోజులుగా కోటంరెడ్డి ఎపిసోడ్‌ పరిశీలిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు కూడా నో ఎంట్రీ అన్నట్లు తెలిసింది. కోటంరెడ్డి రాకను ఆ పార్టీ నాయకులే అడ్డుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. నిన్నటి వరకు నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో దౌర్జన్యకాండతో టీడీపీ నేతలను అల్లాడించాడని, కోటంరెడ్డిని పారీ్టలోకి ఆహా్వనిస్తే పార్టీ నేతలు ఆయనతో కలిసి పనిచేయరని, పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోతుందని నేతలు తమ పార్టీ అధినేత వద్ద మొరపెట్టుకున్నట్లు తెలుస్తోంది. మూడున్నర ఏళ్లుగా కోటంరెడ్డి చేసిన అవినీతి, అరాచకాలపై ప్రెస్‌మీట్లు పెట్టి దుమ్మెత్తి పోసిన అజీజ్, అతని మిత్రబృందం, పార్టీ కేడర్‌ ప్రస్తుతం కోటంరెడ్డిని పారీ్టలోకి అహా్వనిస్తే వీరంతా దూరమవుతారని సీనియర్‌ నేతల ద్వారా చంద్రబాబుకు చెప్పించినట్లు సమాచారం. దీంతో చంద్రబాబు సైతం కోటంరెడ్డి ఆశలకు బ్రేక్‌ వేసినట్లు తెలుస్తోంది.   

కోటంరెడ్డికి కార్పొరేటర్ల షాక్‌ 
నెల్లూరు రూరల్‌ పరిధిలో 26 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అందరూ తన అడుగుజాడల్లో నడుస్తారని భ్రమించిన కోటంరెడ్డికి ఇప్పటికే 18 మంది కార్పొరేటర్లు ఝలక్‌ ఇచ్చారు. స్థానిక ప్రజాప్రతినిధులు వైఎస్సార్‌సీపీని వీడమని స్పష్టం చేశారు. మా జెండా, అజెండా పారీ్టనే అంటూ కోటంరెడ్డికి తెగేసి చెప్పారు. తాజాగా నియోజకవర్గ సమన్వయకర్తగా ఎంపికైన ఆదాల ప్రభాకర్‌రెడ్డికి జై కొట్టారు. మరికొందరు జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ త్వరలోనే గుర్తింపు ఇచ్చిన పారీ్టతోనే పయనించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అటు కార్పొరేటర్లే కాదు రూరల్‌ పరిధిలో ఉండే సర్పంచ్‌లు, ఎంపీటీసీలు సైతం పార్టీతోనే పయనిస్తుండడంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి ఏకాకి అయ్యారు. నిన్న మొన్నటి వరకు వాపును బలుపుగా భావించిన కోటంరెడ్డికి షాక్‌ల మీద షాక్‌లు తగిలి దిమ్మతిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయిందని పరిశీలకులు భావిస్తున్నారు. ‘చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మా ఒంటరి నడకా.. తెలిసీ అడుగేసినావె ఎడారంటి ఆశల వెనకా..’ అంటూ ఆయన సన్నిహితులు, అభిమానులు విచార గీతం ఆలపిస్తున్నారు.   

ఆదరించిన పార్టీకే సున్నం 
2014 ఎన్నికల ముందు నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి రాజకీయంగా ఏ చిన్న పదవి లేదు. విద్యార్థి దశ నుంచి ఉద్యమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న శ్రీధర్‌రెడ్డి అప్పుడెప్పుడో బీజేపీ తరఫున ఎంపీపీ పదవికి పోటీచేసి ఓటమి చెందారు. ఆ పార్టీ నుంచే బహిష్కరణకు గురైన ఆయన సొంతంగా భగత్‌సింగ్‌ యువమోర్చా పార్టీని పెట్టి ఏడాది కూడా నడిపించలేక కాంగ్రెస్‌లోకి వెళ్లాడు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో స్టేట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలెప్‌మెంట్‌ డైరెక్టర్‌ పదవి పొందాడు. వైఎస్సార్‌ మరణం తర్వాత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడిచారు.

దీంతో ఏకంగా 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్యేగా అవకాశం కలి్పంచారు. దివంగత వైఎస్సార్‌ చరిష్మాతో పాటు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభతో రెండు దఫాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పార్టీ బలంతో గెలిచిన ఆయన తన బలంగా భ్రమించి మత్తగజంలా వ్యవహరించాడు. ఆదరించి... అందలమెక్కించిన పారీ్టకే సున్నం పెట్టడానికి ప్రయత్నించాడు. మూడున్నర ఏళ్లుగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎమ్మెల్యేగా కోటంరెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. ప్రజాసేవతో ప్రభుత్వానికి కీర్తిప్రతిష్టలు తీసుకురావాల్సిన ఆయన అధికార మదంతో రౌడీమూకలను నెలవారీ జీతాలతో ప్రోత్సహించి పార్టీలకు అతీతంగా తనకు గిట్టని వారిపై, ప్రత్యర్థులపై దాడులు చేయించి భయభ్రాంతులకు గురి చేశాడు. టీడీపీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీశాడు. ఆదరించిన పారీ్టకే సున్నం 

చీటీడీపీ ట్రాప్‌లో పడి.. 
కోటంరెడ్డి ఎపిసోడ్‌ గమనిస్తున్న టీడీపీకి చెందిన అబ్ధుల్‌అజీజ్‌ నుంచి మాజీమంత్రి సోమిరెడ్డి, బీద రవిచంద్ర, నారాయణ వంటి కీలక నేతలు అతన్ని రాజకీయ సమాధి చేయాలని వ్యూహాత్మకంగా పావులు కదిపారు. వైఎస్సార్‌సీపీలో కోటంరెడ్డి భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా ఉండడంతో టీడీపీ అధిష్టానం వ్యూహాత్మకంగా తమ ట్రాప్‌లో పడేలా చేసింది. గతేడాది నుంచి టీడీపీ అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగానే వ్యవహరిస్తూ వచ్చాడు. అమరావతి రైతులకు స్వాగతాల నుంచి తరచూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వచ్చి చివరకు పారీ్టపైనే నిందలు వేసి బయటకు వెళ్లాడు. అంతవరకు వ్యూహాత్మకంగా పావులు కదిపిన టీడీపీ తమ వలలో చిక్కుకున్న కోటంరెడ్డికి పారీ్టలో ఎంట్రీకి చెక్‌ పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement