సాక్షి, నెల్లూరు: వచ్చే ఎన్నికల్లో డబ్బుతో గెలిచేందుకు మంత్రి నారాయణ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. నెల్లూరు నగరంలోని చిన్న బజార్‌లో ‘నారాయణ’ విద్యాసంస్థల సిబ్బంది, టీడీపీ నాయకులు ఓటర్లకు డబ్బులు పంచుతుండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, స్థానికులు వాళ్లను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. వీరి వద్ద భారీ నగదు ఉన్నట్లు తెలిసింది. ఇక, నారాయణ విద్యాసంస్థ ఏజీఎం రమణారెడ్డి, మరో జూనియర్ లెక్చరర్ ఓటర్లకు నగదు పంపిణి చేస్తుండగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న వారి నుంచి సుమారు రు. 15 లక్షలు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది.
రమణా రెడ్డి నేతృత్వంలోనే నగదు పంపిణి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వైఎస్సార్‌సీపీ ఓటు బ్యాంక్ ఉన్న ప్రాంతాల్లో డబ్బుతో ఓట్లను కొనేందుకు నారాయణ ప్రయత్నిస్తున్నారని నెల్లూరు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. నారాయణ విద్యా సంస్థల ఉద్యోగులతో ఈ విధంగా డబ్బును పంపిణీ చేయిస్తున్నారన్నారని ఆయన అన్నారు. దీనిపై వెంటనే ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment