జగనోత్సాహం | grand welcome to ys jaganmohan reddy | Sakshi
Sakshi News home page

జగనోత్సాహం

Published Sat, Feb 28 2015 1:55 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

జగనోత్సాహం - Sakshi

జగనోత్సాహం

జై జగన్ .. జైజై జగన్ నినాదాలతో శుక్రవారం రేణిగుంట విమానాశ్రయం హోరెత్తింది. నెల్లూరులో ఎమ్మెల్యే    కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి విమానంలో హైదరాబాద్ నుంచి రేణిగుంటకు చేరుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ఆయనకు   ఘన స్వాగతం పలికారు. అభిమానులు ఆయనతో కరచాలనం చేయడానికి ఉత్సాహం చూపారు. రేణిగుంట నుంచి నెల్లూరుకు రోడ్డుమార్గాన వెళ్లిన జగన్‌కు దారి పొడవునా ప్రజలు నీరాజనాలు పలికారు.
 
రేణిగుంట:  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి రేణిగుంట విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు జగన్‌మోహన్‌రెడ్డి విమానంలో శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి రేణిగుంటకు చేరుకున్నారు. పార్టీ నేత భూమా నాగిరెడ్డి కూడా ఆయనతో పాటు వచ్చారు. విమానాశ్రయం చేరుకున్న జగన్‌కు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి, చిత్తూ రు జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, ఎమ్మెల్యేలు  చింతల రామచంద్రారెడ్డి, డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ గాయత్రిదేవి, సత్యవేడు నియోజకవర్గ ఇన్‌చార్జి ఆదిమూలం, నాయకులు జంగాలపల్లి శ్రీనివాసులు స్వాగతం పలికారు.

విమానాశ్రయం వెలుపల పార్టీ నేతలు, కార్యకర్తలు పుష్పగుచ్ఛాలు, పార్టీ కండువాలతో జగన్‌ను ఘనంగా సన్మానించారు. జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం వర్థిల్లాలి అంటూ నాయకులు, కార్యకర్తల నినాదాలతో విమానాశ్రయం హోరెత్తింది. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు వైఎస్ జగన్ ఫ్లెక్సీలతో వినూత్నంగా స్వాగతం పలికారు. జగ న్‌కు స్వాగతం పలికిన వారిలో పాలగిరి ప్రతాప్‌రెడ్డి, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, రైతు విభాగం నాయకుడు ఆదికేశవులురెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు పోకల అశోక్‌కుమార్, తిరుమలరెడ్డి, రెడ్డివారి చక్రపాణిరెడ్డి, విరూపాక్షి జయచంద్రారెడ్డి, సిరాజ్ బాషా, రేణిగుంట మండల నాయకులు అత్తూరు హరి, జువ్వల ధయాకర్‌రెడ్డి, నగరం భాస్కర్‌బాబు, గంగారి రమేష్, గురవరాజుపల్లి శంకర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, ఎం జీ రాజేష్‌రెడ్డి, షంషీర్, మోహన్‌నాయు డు, బాల సుబ్రమణ్యం శ్రీకాంత్ రా యల్ ఉన్నారు. అనంతరం జగన్ రోడ్డుమార్గంలో నెల్లూరు బయలుదేరి వెళ్లారు.
 
ఘన వీడ్కోలు:

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి రేణిగుంట విమానాశ్రయంలో శుక్రవారం మధ్యాహ్నం పార్టీ నేతలు ఘనంగా వీడ్కోలు పలికారు. నెల్లూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మేల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కుమార్తె వివాహానికి హాజరై తిరుగు ప్రయాణంలో రేణిగుంట చేరుకున్నారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి, జిల్లా కన్వీనర్ నారాయణ స్వామి, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  రోజా, అనిల్ కుమార్, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి, మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు వీడ్కోలు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement