ట్రైనీ ఐపీఎస్ మృతిపై మొదలైన విచారణ | cbi starts enquiry into trainee ips manu mukt manav suspicious death | Sakshi
Sakshi News home page

ట్రైనీ ఐపీఎస్ మృతిపై మొదలైన విచారణ

Published Thu, Jan 15 2015 1:42 PM | Last Updated on Sat, Sep 2 2017 7:46 PM

ట్రైనీ ఐపీఎస్ మృతిపై మొదలైన విచారణ

ట్రైనీ ఐపీఎస్ మృతిపై మొదలైన విచారణ

హైదరాబాద్: సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ (ఎన్‌పీఏ)లో శిక్షణ పొందుతున్న ఐపీఎస్ అధికారి మనూ ముక్త్ మానవ్ అనుమానాస్పద మృతిపై సీబీఐ విచారణ చేపట్టింది. ఇందుకోసం గురువారం రాజేంద్రనగర్ పోలీసులను సీబీఐ విచారిస్తోంది. కేసుకు సంబందించిన అన్ని విషయాలను సీబీఐ అధికారులు సేకరిస్తున్నారు.

గత ఏడాది ఆగష్టు లో నేషనల్ పోలీస్ అకాడమీ స్విమ్మింగ్ పూల్లో మనూ ముక్త్ మానవ్ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తన కొడుకును హత్య చేశారని మానవ్‌ తండ్రి రామ్ నివాస్ మానవ్ అప్పట్లో ఆరోపించారు. తన కుమారుడి మృతి పట్ల  విచారణ జరపాలని మానవ్ తల్లిదండ్రులు కేంద్రాన్ని కోరారు.  ఈనెల 6 తేదీన మానవ్ మృతిపై విచారణ జరపాలని  కేంద్ర ప్రభుత్వం సీబీఐ ను ఆదేశించింది.

హర్యానా రాష్ట్రం హిస్సార్ జిల్లాకు చెందిన మను ముక్త్త్ మానవ్ (30) 2013లో హిమాచల్‌ప్రదేశ్ ఐపీఎస్ క్యాడర్‌గా ఎంపికయ్యారు.  ఆకాడమీలో శిక్షణ పొందుతున్న వారంతా  ఆఫీసర్స్ క్లబ్‌లో విందు చేసుకున్నారు. ఈ విందులో మద్యం సేవించిన మానవ్ మరో ఇద్దరు ట్రైనీలతో కలిసి ఎన్‌పీఏలో ఉన్న స్విమింగ్ పూల్‌లో ఈత కొట్టేందుకు వెళ్లారు. స్విమ్మింగ్‌పూల్‌లో దిగిన కొద్దిసేపటికే మానవ్ నీటిలో మునిగి ప్రమాదవశాత్తు మృతి చెందారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement