'సదావర్తి భూములపై సీబీఐ విచారణ జరపాలి'
హైదరాబాద్ : సదావర్తి సత్రం భూములపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు. శనివారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రూ.5 కో్ట్లకు అదనంగా సదావర్తి భూముల కొనుగోలు చేస్తామన్న కంపెనీని నిబంధనల పేరుతో బెదిరించడం ఎంతవరకూ సమంజసమని వేణుగోపాలకృష్ణ ప్రశ్నించారు. బాధ్యతగల పదవిలో ఉన్న ముఖ్యమంత్రి ఇలాగేనా వ్యవహరించేందంటూ ధ్వజమెత్తారు.
సదావర్తి భూముల కుంభకోణంలో రూ.వెయ్యి కోట్ల దోపిడీకి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. బందరు పోర్టుకు ఎంత భూమి సేకరించాలనుకుంటున్నారో వెల్లడించలేదన్నారు. పోర్టు భూ సమీకరణపై మంత్రులు తలోమాటా మాట్లాడుతున్నారని వేణుగోపాలకృష్ణ అన్నారు. దీని వెనుక ఉన్న రహస్య ఎజెండా ఏంటో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.