sadavarthi lands
-
సదావర్తి భూముల వేలంపై విజిలెన్స్ విచారణ
-
సదావర్తి భూముల వేలంపై విజిలెన్స్ విచారణ
సాక్షి,అమరావతి: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సదావర్తి సత్రం భూముల వేలంలో జరిగిన అక్రమాలపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వేలం వ్యవహారాన్ని విజిలెన్స్ విచారణకు రాష్ట్ర్ర ప్రభుత్వం ఆదేశించింది. భూముల వేలంలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు రాష్ట్ర్ర ప్రభుత్వం గుర్తించింది. గత టీడీపీ ప్రభుత్వం తమిళనాడులోని సదావర్తి సత్రానికి చెందిన 83.11 ఎకరాలకు బహిరంగ వేలం నిర్వహించింది. సత్రం భూముల వ్యవహారంపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై విజిలెన్స్,ఎన్ఫోర్సుమెంట్ విచారణకు ఆదేశిస్తూ రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. -
సదావర్తి: అన్నీ తెలిసినా.. ఏమీ తెలియనట్టు!
సాక్షి, అమరావతి: సదావర్తి భూములను కారుచౌకగా కొట్టేయాలని ఎత్తుగడ వేసిన ప్రభుత్వ పెద్దలకు సుప్రీంకోర్టులో ఊహించని పెద్ద దెబ్బే తగిలింది. రిజిస్ట్రేషన్ శాఖ ధర ప్రకారమే ఎకరా ఆరేడు కోట్ల రూపాయలు పలికే 83.11 ఎకరాల భూమిని రూ.22.44 కోట్లకో, లేదంటే రూ.60.30 కోట్లకో కొట్టేదామనుకున్న వారి ఎత్తులన్నింటికీ సుప్రీంకోర్టు అడ్డుకట్టవేసింది. ఇది ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తోంది. తమిళనాడు లేఖలో స్పష్టంగా... అవి సదావర్తి సత్రం భూములేనని, కాకపోతే ఆ భూములకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం ఇంతవరకు సత్రం పేరిట పట్టా ఇవ్వలేదని 2010లో ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాసిన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇలా ఆ భూములు మన రాష్ట్రానివే అని చెప్పే ఆధారాలను తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అధికారులే ఇచ్చారు. మామూలుగా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ ఆధారాల ద్వారా రాజకీయ దౌత్యం, లేదంటే న్యాయపరంగా పోరాడి ముందు ఆ భూములకు పట్టా సంపాదించి అమ్మకం ప్రక్రియకు పూనుకునేది. కానీ అలా జరగలేదు. ప్రభుత్వం అధికారం చేపట్టీ చేపట్టగానే అధికార పార్టీకి చెందిన పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ రాయడం, పట్టా కూడా లేని ఆ భూముల అమ్మకానికి రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా అనుమతి తెలపడం చకచకా జరిగిపోయాయి. ఇక్కడి నుంచే భూ దోపిడీ కథ మొదలైంది. కథ కంచికి.. మళ్లీ మొదటికి! భూములు అక్రమణలో ఉన్నాయని దాదాపు రూ.1000 కోట్ల ధర పలికే సత్రం భూములను మొదట విడత రూ.22.44 కోట్లకే అధికార తెలుగుదేశం పార్టీ నాయకులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలను ‘సాక్షి’ సాక్ష్యాధారాలతో వెలుగులోకి తెచ్చిన విషయం విదితమే. ఈ విషయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టును కోర్టును ఆశ్రయించడంతో భూములకు రెండో విడత వేలం నిర్వహించాలని ఆదేశించింది. మొదట విడత వేలం సందర్భంగా పేర్కొన్న టెండరు నిబంధనలను మార్చారు. మొదటి టెండరు నోటిఫికేషన్లో భూములకు రిజిస్ట్రేషన్ చేస్తామన్న నిబంధనను రెండో టెండరు నోటిఫికేషన్లో ఎలాంటి రిజిసేŠట్రషన్ చేసేది లేదంటూ స్పష్టంగా పేర్కొన్నారు. అయినా తొలి విడత వేలం జరిగినప్పుడు ఆ భూములకు పలికిన రూ. 22.44 కోట్ల ధర రెండో విడత వేలంలో ఏకంగా మూడింతలు అధికంగా రూ.60.30 కోట్లకు ఎగబాకడంపై సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం ఆ భూములకు ఇప్పటి వరకు పట్టా కూడా ఇవ్వలేదన్న విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఈ భూముల అమ్మకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతల్లో వేలం పాడాలని, దేవాదాయ శాఖకు డబ్బులు చెల్లించిన వారికి ఆ మొత్తం వడ్డీతో సహా చెల్లించాలని, దీంతోపాటు అసలు ఈ భూములు ఎవరివో ముందు తేల్చాలని సుప్రీంకోర్టు రాష్ట్ర హైకోర్టును ఆదేశించింది. ఇలా సత్రం భూముల అమ్మకం మొదటికొచ్చింది. పట్టా తీసుకుని వేలం నిర్వహిస్తే.. చెన్నై నగర సమీపంలో తాళంబూరు గ్రామంలో ఉన్న భూములు సదావర్తి సత్రానివే అనడానికి రాష్ట్ర దేవాదాయ శాఖ వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయి. 1927 వరకు ఆ భూములకు అక్కడి రైతులు సదావర్తి సత్రానికి కౌలు చెల్లించిన రికార్డులు దేవాదాయ శాఖ అధికారుల వద్ద ఉన్నాయి. దీనికి తోడు ఆ భూములు సత్రానికి చెందుతాయన్న స్పష్టమైన ఆధారాలను 1924 జనవరి 31వ తేదీ తమిళనాడులోని చెంగలపట్టు కోర్టు డిక్రీ వెలవరించిన పత్రాలు మన రాష్ట్ర దేవాదాయశాఖ వద్ద ఉన్నాయి. ఆ భూములు సత్రానికే చెందుతాయని కాంచీపురం జిల్లా రెవెన్యూ అధికారి 2010 మే 31న ఆ రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శికి రాసిన లేఖ మన రాషŠట్ర అధికారుల వద్ద ఉంది. ‘మన ప్రభుత్వం వద్ద ఉన్న ఆధారాల ఆధారంగా న్యాయపోరాటం చేయవచ్చు. తద్వారా సదావర్తి సత్రం పేరిట అధికారికంగా రికార్డులను పొందవచ్చు. తద్వారా 471.76 ఎకరాల భూములకు రాష్ట్ర ప్రభుత్వం పట్టా సంపాదించవచ్చు. అదే జరిగితే ఈ భూముల ద్వారా సత్రానికి ఏకంగా వేల కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది’ అని దేవాదాయ శాఖ అధికారులే చెబుతున్నారు. చంద్రబాబు దోపిడీకి అడ్డుకట్ట: ఆళ్ల అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని పేద బ్రాహ్మణులకు చెందాల్సిన అత్యంత విలువైన భూమిని తమ పార్టీ అనుయాయుల ద్వారా నామమాత్రపు ధరకు కొట్టేయాలనుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దోపిడీని అడ్డుకోగలిగామని వైఎస్సాఆర్ కాంగ్రెస్‌పార్టీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. వాదనల సమయంలో న్యాయస్థానాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలే ఇందుకు సాక్షాత్కారాలని గుర్తుచేశారు. రాజా వాసిరెడ్డి వారసులు 1885లో రాసిన వీలునామా ప్రకారం చెన్నై నగరం సమీపంలోని తాళంబూరు, పరిసరాల్లో 471.76 ఎకరాలు సదావర్తి సత్రానికి చెందినవని అన్నారు. ఆక్రమణలకు గురయ్యాయని అంటూ 83.11 ఎకరాలను వేలం పేరిట అక్రమ మార్గాల్లో దక్కించుకునేందుకు చంద్రబాబు అనేక ఎత్తులు వేశారన్నారు. విధివిధానాల ప్రకారం కాకుండా చీకటి గదిలో వ్యవహారాల తరహాలో వేలం నిర్వహణ తీరును, ఇతర అంశాలన్నింటినీ న్యాయస్థానాల దృష్టికి సాక్ష్యాలతో సహా తీసుకెళ్లగలిగామన్నారు. ప్రభుత్వ అధికారుల సమాచారం మేరకే అక్కడ ఎకరం రూ.6.50 కోట్ల వరకు ధర ఉండగా 83.11 ఎకరాలను 22.44 కోట్లకు తన అనుయాయుల ద్వారా దక్కించుకునేందుకు చంద్రబాబు వేసిన ఎత్తుగడలు పారలేదన్నారు. న్యాయస్థానం ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయనే విశ్వాసం ఉందని, అప్పటివరకు తమ పోరాటం కొనసాగుతుందని, పేద బ్రాహ్మణులకు సత్రం భూముల ఫలాలు అందాలనేది ఆకాంక్ష అన్నారు. -
ఏపీ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురు
హైదరాబాద్: సదావర్తి భూముల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. సదావర్తి భూములకు గతంలో నిర్వహించిన వేలం చెల్లదని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మళ్లీ వేలం నిర్వహించాలని, 6 వారాల్లో వేలం ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించింది. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) చెల్లించిన రూ.27.44 కోట్లను బేస్ ప్రైస్‌గా నిర్ణయించి వేలం నిర్వహించాలని సూచించింది. వేలంలో పాల్గొనేందుకు ఎవరూ ముందుకు రాకపోతే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి సదావర్తి భూములు చెందుతాయని హైకోర్టు తేల్చిచెప్పింది. ఎంతో విలువైన సదావర్తి సత్రానికి చెందిన 83.11 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీడీపీ నేతలకు కేవలం రూ.22 కోట్లకు ధారాదత్తం చేసింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేసి ఎమ్మెల్యే ఆర్కే హైకోర్టులో విజయం సాధించారు. రూ. 22 కోట్లకు అదనంగా మరో రూ.5 కోట్లు ఇస్తే మీకే భూములు ఇస్తామని హైకోర్టు అనడంతో రెండు విడతల్లో పూర్తిస్థాయి నగదు రూ.27.44 కోట్లను దేవాదాయశాఖ ఖాతాకు ఆయన జమచేశారు. చెప్పిన మాట ప్రకారం ఆయన డబ్బులు చెల్లించడంతో చంద్రబాబు సర్కారు ఇరకాటంలో పడింది. తాము అమ్మిన ధర కంటే ఎక్కువ డబ్బులు రావని ఇప్పటివరకు ప్రచారం చేసుకుంటూ వచ్చిన అధికార పార్టీ నాయకులు హైకోర్టు ఆదేశాలతో మూగనోము పట్టారు. -
కోర్టు కట్టమన్న మొత్తం కట్టేశా: ఆర్కే
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశాల మేరకు సదావర్తి భూముల విషయంలో కోర్టుకు చెల్లించాల్సిన రూ. 27 కోట్ల 44 లక్షల 625 రూపాయలు మొత్తాన్ని చెల్లించానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) తెలిపారు. శుక్రవారం రాత్రి ఆయన సాక్షితో మాట్లాడారు. ఈ నెల 13వ తేదీన రూ. 10 కోట్లు కట్టేశానని, మిగిలిన మొత్తం రూ.17,44,12,625 శుక్రవారం ఏపీ దేవాదాయ కమిషనర్‌కి ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసినట్లు తెలిపారు. దీనిపై వచ్చే సోమవారం కోర్టు జడ్జిమెంట్ ఇస్తుందని చెప్పారు. గతంలో సదావర్తి భూములకు సంబంధించి జరిగిన వేలంపాటలో అవకతవకలకు జరిగాయని ఎమ్మెల్యే ఆర్కే కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. గతంలో విక్రయించిన ధర కంటే మరో ఐదు కోట్లు అదనంగా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని.. ఆ భూమిని తనకే కేటాయించాలని ఆయన హైకోర్టును కోరగా అందుకు కోర్టు సమ్మతించింది. దానికి సంబంధించి చెల్లించాల్సిన మొత్తాన్ని (రూ. 27.44 కోట్లు) రెండు విడతలుగా చెల్లించాలని కోర్టు సూచించింది. గతంలోనే పది కోట్లు చెల్లించిన ఆర్కే శుక్రవారం మిగిలిన మొత్తాన్ని చెల్లించారు. -
రూ.17.44 కోట్లు చెల్లించిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే
హైదరాబాద్: సదావర్తి భూముల వేలం వ్యవహారంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేసి విజయం సాధించిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తూ ఎండోమెంట్ శాఖకు నేడు రెండో విడత నగదు జమచేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం ఇటీవల రూ.10 కోట్లను చెల్లించిన ఎమ్మెల్యే ఆర్కే, శుక్రవారం రూ.17.44 కోట్లను ఎండోమెంట్ శాఖకు చెల్లించారు. ఈ భూముల వ్యవహారానికి సంబంధించి హైకోర్టు తీర్పును శిరసావహిస్తామని చెప్పిన ఆర్కే.. అదే ప్రకారం రెండు విడతల్లో పూర్తిస్థాయి నగదు రూ.27.44 కోట్లను దేవాదాయశాఖ ఖాతాకు జమచేశారు. ఎంతో విలువైన సదావర్తి సత్రానికి చెందిన 83.11 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీడీపీ నేతలకు కేవలం రూ.22 కోట్లకు ధారాదత్తం చేసింది. భూములను చవకగా కొట్టేసేందుకు తమ సన్నిహితులకు ఏపీ ప్రభుత్వం అప్పగించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఎమ్మెల్యే ఆర్కే హైకోర్టును ఆశ్రయించారు. రూ. 22 కోట్లకు అదనంగా మరో రూ.5 కోట్లు ఇస్తే మీకే భూములు ఇస్తామని హైకోర్టు పేర్కొంది. మొత్తం రూ.27.44 కోట్లు చెల్లించేందుకు ఓ వ్యక్తి సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే ఆర్కే హైకోర్టుకు నివేదించగా.. మొదటి విడత కింద రూ.10 కోట్లు రెండు వారాల్లో చెల్లించాలని, మిగిలిన రూ.17.44 కోట్లను ఆ తర్వాతి రెండు వారాల్లో చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది. ఇటీవల మొదటి విడత నగదు రూ.10 కోట్లను చెల్లించిన ఎమ్మెల్యే ఆర్కే.. నేడు రెండో విడత సొమ్ము రూ.17.44 కోట్లను దేవాదాయశాఖకు చెల్లించారు. -
రూ.10 కోట్లు చెల్లించిన ఎమ్మెల్యే ఆర్కే
హైదరాబాద్: సదావర్తి సత్రం భూముల వేలం వ్యవహారంలో హైకోర్టు ఆదేశాల మేరకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తొలి విడతగా రూ.10 కోట్లు చెల్లించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను గౌరవించి గురువారం ఆ మేరకు నగదును చెల్లించినట్లు తెలిపారు. దేవాదాయ శాఖ కమిషనర్‌కు చెల్లింపు వివరాలను అందజేసినట్లు ఎమ్మెల్యే ఆర్కే వివరించారు. మరో 17 కోట్ల రూపాయలు నిర్ణీత గడువులోగా చెల్లించనున్నట్లు చెప్పారు. ఈ నెల 17న సదావర్తి భూముల వేలం కేసును హైకోర్టు మరోసారి విచారించనుంది. అయితే ఎంతో విలువైన సదావర్తి సత్రానికి చెందిన 83.11 ఎకరాల భూమిని కొంత మంది పెద్దలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.22 కోట్లకు ధారాదత్తం చేసింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఎమ్మెల్యే ఆర్కే హైకోర్టును ఆశ్రయించారు. అవసరమైతే రూ. 22 కోట్లకు అదనంగా మరో రూ.5 కోట్లు ఇస్తే మీకే భూములు కేటాయిస్తామని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. అదనంగా చెల్లించాల్సిన రూ.5 కోట్లతో కలిపి మొత్తం రూ.27.44 కోట్లు చెల్లించేందుకు ఓ వ్యక్తి సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే ఆర్కే హైకోర్టుకు నివేదించారు. మొదటి విడత కింద రూ.10 కోట్లను రెండు వారాల్లో చెల్లించాలని, మిగిలిన రూ.17.44 కోట్లను ఆ తర్వాతి రెండు వారాల్లో చెల్లించాలని కోర్టు స్పష్టం చేయగా... న్యాయస్థానం తీర్పును గౌరవించి ఎమ్మెల్యే ఆర్కే మొదటి విడత నగదును చెల్లించారు. -
రూ. 10 కోట్లు చెల్లించేందుకు సిద్ధం
హైకోర్టుకు తెలిపిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దేవాదాయ శాఖ కమిషనర్ కమిషన్ పేరు మీద చెల్లించమన్న కోర్టు సదావర్తి సత్రం భూముల వ్యవహారంపై తదుపరి విచారణ ఈ నెల 17కు వాయిదా హైదరాబాద్: సదావర్తి సత్రం భూముల వ్యవహారంలో హైకోర్టు ఆదేశాల మేరకు రూ. 10 కోట్లు చెల్లించేందుకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అంగీకరించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు. దేవాదాయ శాఖ కమిషనర్ పేరు మీద ఈ మొత్తాన్ని చెల్లించాలని రామకృష్ణారెడ్డికి కోర్టు సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా ఈ వారంతంలోపే రూ. 10 కోట్లు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని కోర్టు వెలుపల ఎమ్మెల్యే ఆర్కే మీడియాతో చెప్పారు. గతవారం ఈ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. సదావర్తి సత్రానికి చెందిన 83.11 ఎకరాల భూమిని కొంత మంది పెద్దలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 22 కోట్లకు ధారాదత్తం చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఎమ్మెల్యే ఆర్కే హైకోర్టును ఆశ్రయించారు. రూ. 22 కోట్లకు అదనంగా మరో రూ. 5 కోట్లు ఇస్తే మీకే భూములు కేటాయిస్తామని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. అదనంగా చెల్లించాల్సిన రూ. 5 కోట్లతో కలిపి మొత్తం రూ.27.44 కోట్లు చెల్లించేందుకు ఓ వ్యక్తి సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే ఆర్కే హైకోర్టుకు నివేదించారు. అలా అయితే మొదటి విడత కింద రూ. 10 కోట్లను రెండు వారాల్లో చెల్లించాలని, మిగిలిన రూ.17.44 కోట్లను ఆ తర్వాతి రెండు వారాల్లో చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మొదటి విడతగా రూ.10 కోట్లు చెల్లించేందుకు ఎమ్మెల్యే ఆర్కే సిద్ధమయ్యారు. -
చంద్రబాబు భూదోపిడీకి హైకోర్టు అడ్డుకట్ట
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు భూదోపిడీకి హైకోర్టు అడ్డుకట్ట వేసిందని సదావర్తి సత్రం భూముల విషయంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం హైకోర్టు తీర్పు వెలువడిన తరువాత ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సదావర్తి భూములను కట్టబెట్టేందుకు ఇపుడు ప్రభుత్వం ఖరారు చేసిన మొత్తం మీద అదనంగా రూ 5 కోట్లు చెల్లిస్తే భూమిని మీకే కేటాయిస్తామని హైకోర్టు తీర్పును ఇచ్చిందని ఆ మేరకు నిర్ణీత గడువు లోపుగా డబ్బు చెల్లిస్తామని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి వారి సదావర్తి సత్రానికి చెందిన చెన్నైలోని అతి విలువైన భూములను టీడీపీ నేతలు కారు చౌక ధరకే కొట్టేయాలని చూశారని రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు తన బినామీల ద్వారా ప్రభుత్వ, ప్రజల, దేవుడి భూములను దోచుకు తింటున్నారని ఆయన విమర్శించారు. 84 ఎకరాల భూములను రూ.22 కోట్లకే కట్టబెట్టడంతో తాము హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేశామని తెలిపారు. -
‘సదావర్తి’ అవినీతి నిరూపిస్తాం..!
– ఎమ్మెల్యే కొమ్మాలపాటికి వైఎస్సార్ సీపీ పెదకూరపాడు నియోజకవర్గ కన్వీనర్ కావటి సవాల్ అచ్చంపేట : సదావర్తి భూముల విషయంలో భారీ కుంభకోణంలో అవినీతిని నిరూపించగలవా అని ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నానని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్ కావటి మనోహర్‌నాయుడు పేర్కొన్నారు. చిగురుపాడు పునరావాస కేంద్రంలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎక్కడైనా...ఎప్పుడైనా... మీడియా ముందుకు ఎమ్మెల్యే చర్చకు రాగలరా..? అని ప్రతిసవాల్ విసిరారు. వైఎస్సార్ సీపీ నాయకులు అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని తనకేమి తెలియనదని ఎమ్మెల్యే అనడం విడ్డూరంగా ఉందన్నారు. 2014లో సదావర్తి భూములకు వేలం నిర్వహించి వచ్చిన డబ్బుతో గుడి, సత్రాన్ని అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే స్వదస్తూరితో ప్రభుత్వానికి లేఖరాయలేదా..? అని ప్రశ్నించారు. సదావర్తి భూములు ఎకరా రూ.7 కోట్లుగా తమిళనాడు ప్రభుత్వం నిర్ధరించిన సంగతి మరిచిపోయారా..? అని గుర్తు చేశారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కార్యాలయం 9 శాతం స్టాంపు డ్యూటీæ చొప్పున రూ.63 లక్షలకు చెల్లించాలని నిర్ణయిస్తే, రూ.26 లక్షలకు అమ్మకాలు జరుగుతుంటే ఎమ్మెల్యేగా ఎందుకు అడ్డుకోలేదన్నారు. ప్రజాధనం దుర్వినియోగం అవుతుంటే ప్రజా ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే ఎందుకు అడ్డుకోలేదన్నారు. దేవాదాయశాఖ డిప్యూటీæ కమిషనర్ భ్రమరాంబ తమిళనాడు రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం ఎకరా విలువ రూ.7 కోట్లు ఉందని, అదే బహిరంగ మార్కెట్లో అయితే రూ.12 కోట్లు ఉంటుందని, ఎండోమెంట్ కమిషనర్ అనూరాధకు లిఖిత పూర్వక సమాచారం అందించిన విషయం వాస్తవం కాదా..? అన్నారు. -
'సదావర్తి భూములపై సీబీఐ విచారణ జరపాలి'
హైదరాబాద్ : సదావర్తి సత్రం భూములపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు. శనివారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రూ.5 కో్ట్లకు అదనంగా సదావర్తి భూముల కొనుగోలు చేస్తామన్న కంపెనీని నిబంధనల పేరుతో బెదిరించడం ఎంతవరకూ సమంజసమని వేణుగోపాలకృష్ణ ప్రశ్నించారు. బాధ్యతగల పదవిలో ఉన్న ముఖ్యమంత్రి ఇలాగేనా వ్యవహరించేందంటూ ధ్వజమెత్తారు. సదావర్తి భూముల కుంభకోణంలో రూ.వెయ్యి కోట్ల దోపిడీకి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. బందరు పోర్టుకు ఎంత భూమి సేకరించాలనుకుంటున్నారో వెల్లడించలేదన్నారు. పోర్టు భూ సమీకరణపై మంత్రులు తలోమాటా మాట్లాడుతున్నారని వేణుగోపాలకృష్ణ అన్నారు. దీని వెనుక ఉన్న రహస్య ఎజెండా ఏంటో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన నిజ నిర్థారణ కమిటీ
హైదరాబాద్ : సదావర్తి సత్రం భూములపై ఏర్పాటు చేసిన నిజ నిర్థారణ కమిటీ సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు సత్రం భూములపై నివేదిక అందచేశారు. అమరావతి, చెన్నైలో పర్యటించిన నిజ నిర్థారణ కమిటీ సభ్యులు ఈ నివేదిక రూపొందించారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అమరావతి సదావర్తి సత్రం భూముల్లో వేలకోట్ల రూపాయల కుంభకోణం జరిగిన నేపథ్యంలో... ప్రతిపక్ష పార్టీ దీనిపై వాస్తవాలు వెలుగులోకి తెచ్చేందుకు పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు అధ్యక్షతన వైఎస్ఆర్ సీపీ నిజ నిర్థారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఏపీ సర్కార్ 81 ఎకరాల సదావర్తి భూములను ఎకరం రూ. 27 లక్షలకే అధికారులు కట్టబెట్టిన విషయం తెలిసిందే. (చదవండి ...సదావర్తి సత్రంలో వెయ్యి కోట్లు లూటీ) -
రేపు చెన్నైకి వైఎస్ఆర్సీపీ నిజనిర్ధారణ కమిటీ
హైదరాబాద్: వైఎస్ఆర్సీపీ నిజనిర్ధారణ కమిటీ ఆదివారం చెన్నై వెళ్లనుంది. పాలంబూరులోని సదావర్తి సత్రం భూములను కమిటీ సభ్యులు పరిశీలించనున్నారు. ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో కమిటీ సభ్యు లు చైన్నై వెళ్లనున్నారు. ఇప్పటికే అమరావతి వెళ్లి సదావర్తి సత్రాన్ని వైఎస్ఆర్సీపీ నిజనిర్ధారణ కమిటీ పరిశీలించిన విషయం తెలిసిందే.