గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సదావర్తి సత్రం భూముల వేలంలో జరిగిన అక్రమాలపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వేలం వ్యవహారాన్ని విజిలెన్స్ విచారణకు రాష్ట్ర్ర ప్రభుత్వం ఆదేశించింది. భూముల వేలంలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు రాష్ట్ర్ర ప్రభుత్వం గుర్తించింది. గత టీడీపీ ప్రభుత్వం తమిళనాడులోని సదావర్తి సత్రానికి చెందిన 83.11 ఎకరాలకు బహిరంగ వేలం నిర్వహించింది.