‘సదావర్తి’ అవినీతి నిరూపిస్తాం..!
‘సదావర్తి’ అవినీతి నిరూపిస్తాం..!
Published Fri, Oct 21 2016 9:16 PM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM
– ఎమ్మెల్యే కొమ్మాలపాటికి వైఎస్సార్ సీపీ
పెదకూరపాడు నియోజకవర్గ కన్వీనర్ కావటి సవాల్
అచ్చంపేట : సదావర్తి భూముల విషయంలో భారీ కుంభకోణంలో అవినీతిని నిరూపించగలవా అని ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నానని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్ కావటి మనోహర్‌నాయుడు పేర్కొన్నారు. చిగురుపాడు పునరావాస కేంద్రంలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు.
ఎక్కడైనా...ఎప్పుడైనా... మీడియా ముందుకు ఎమ్మెల్యే చర్చకు రాగలరా..? అని ప్రతిసవాల్ విసిరారు. వైఎస్సార్ సీపీ నాయకులు అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని తనకేమి తెలియనదని ఎమ్మెల్యే అనడం విడ్డూరంగా ఉందన్నారు. 2014లో సదావర్తి భూములకు వేలం నిర్వహించి వచ్చిన డబ్బుతో గుడి, సత్రాన్ని అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే స్వదస్తూరితో ప్రభుత్వానికి లేఖరాయలేదా..? అని ప్రశ్నించారు. సదావర్తి భూములు ఎకరా రూ.7 కోట్లుగా తమిళనాడు ప్రభుత్వం నిర్ధరించిన సంగతి మరిచిపోయారా..? అని గుర్తు చేశారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కార్యాలయం 9 శాతం స్టాంపు డ్యూటీæ చొప్పున రూ.63 లక్షలకు చెల్లించాలని నిర్ణయిస్తే, రూ.26 లక్షలకు అమ్మకాలు జరుగుతుంటే ఎమ్మెల్యేగా ఎందుకు అడ్డుకోలేదన్నారు.
ప్రజాధనం దుర్వినియోగం అవుతుంటే ప్రజా ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే ఎందుకు అడ్డుకోలేదన్నారు. దేవాదాయశాఖ డిప్యూటీæ కమిషనర్ భ్రమరాంబ తమిళనాడు రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం ఎకరా విలువ రూ.7 కోట్లు ఉందని, అదే బహిరంగ మార్కెట్‌లో అయితే రూ.12 కోట్లు ఉంటుందని, ఎండోమెంట్ కమిషనర్ అనూరాధకు లిఖిత పూర్వక సమాచారం అందించిన విషయం వాస్తవం కాదా..? అన్నారు.
Advertisement