సాక్షి,అమరావతి: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సదావర్తి సత్రం భూముల వేలంలో జరిగిన అక్రమాలపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వేలం వ్యవహారాన్ని విజిలెన్స్ విచారణకు రాష్ట్ర్ర ప్రభుత్వం ఆదేశించింది. భూముల వేలంలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు రాష్ట్ర్ర ప్రభుత్వం గుర్తించింది. గత టీడీపీ ప్రభుత్వం తమిళనాడులోని సదావర్తి సత్రానికి చెందిన 83.11 ఎకరాలకు బహిరంగ వేలం నిర్వహించింది. సత్రం భూముల వ్యవహారంపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై విజిలెన్స్,ఎన్‌ఫోర్సుమెంట్ విచారణకు ఆదేశిస్తూ రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment