సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య రెగ్యులటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చైర్మన్‌గా ఉమ్మడి ఏపీ హైకోర్టు మాజీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వంగాల ఈశ్వరయ్య నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఉన్నత విద్యా సంస్థల్లో ప్రమాణాలు పెంచడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన, ఫీజుల నియంత్రణ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఈ కమిషన్‌లో ఇద్దరు ప్రొఫెసర్లు, ఓ ఐఏఎస్ అధికారి, ఉన్నత విద్యాసంస్థ ప్రతినిధి... సభ్యులుగా ఉంటారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌ను సంప్రదించిన మీదట, రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ ఈశ్వరయ్యను కమిషన్ చైర్మన్‌గా నియమించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఇవాళ జారీ అయ్యాయి. కాగా స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చైర్మన్‌గా రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఆర్.కాంతారావును ప్రభుత్వం నియామకం చేసింది.
ఐటీ (టిక్నికల్) సలహాదారులుగా
అలాగే ఆంధ్రప్రదేశ్ ఐటీ (టిక్నికల్) సలహాదారులుగా శ్రీనాథ్ దేవిరెడ్డి, జె. విద్యాసాగర్‌రెడ్డిను నియమిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. అదేవిధంగా ఏపీ ఐటీ (పాలసీ అండ్ ఇన్వెస్ట్‌మెంట్) సలహాదారునిగా కె. రాజశేఖర్‌రెడ్డిని నియమించింది.
Comments
Please login to add a commentAdd a comment